🌏న్యూస్🌏
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘నల్లధనం’పై వీర ఖడ్గం ఎత్తారు. వెయ్యి, ఐదొందల కరెన్సీ నోట్లపై కత్తి వేటు వేశారు. ‘నల్ల దొరల’కు అనూహ్య, ఆకస్మిక షాక్ ఇచ్చారు. నల్లధనం అరికట్టడంపై ఒక్కో అడుగు వేస్తూ వచ్చిన మోదీ… మంగళవారం రాత్రి ఒక్కసారిగా ‘బాంబు’ పేల్చారు. త్రివిధ దళాల అధిపతులతో సమావేశమైన అనంతరం మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ, దౌత్య అంశాలపై కీలక నిర్ణయాలు ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ… మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పేలా 500, 1000 నోట్ల రద్దు గురించి ప్రసంగించారు. పేదల కష్టాలు, అవినీతి సమస్యకు ప్రధాన కారణం నల్ల ధనమే అని తేల్చారు. నల్లధనం, నకిలీ కరెన్సీ, ఉగ్రవాదం… ఇవే దేశ అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తున్నాయన్నారు. 😎వ్యూస్😊 ఇండియన్లు మా ప్రధాని నిఝ్ఝంగా గ్రేట్ అనుకునే ఘట్టాలు చరిత్రలో నాలుగే నాలుగు – మొదటిది అరవైఐదులో లాల్బహాదూర్ శాస్త్రి పాకిస్తాన్‌కి బుద్ధి చెప్పిన తరుణం, రెండోది 1971లో పాకిస్తాన్‌ని రెండు ముక్కలు చేసిన ఇందిరాగాంధీ ప్రహరణం, మూడు పీవీ నరసింహారావుగారి ఆర్ధిక సంస్కరణం, నాలుగు బ్లాక్ మనీపై మోడీ వ్యూహాత్మక రణం నెహ్రూగారి పబ్లిక్ సెక్టార్ డెవలప్మెంట్, ఇస్రో ఘన విజయాలు, పోఖ్రాన్ అణువిస్ఫోటనాలు, కలాంగారి అగ్నేయాస్త్రాలు కూడా గొప్పవే కానీ పై నాలుగూ అనూహ్యంగా జరిగి ప్రజల్ని బాగా ఎక్సైట్ చేసి, ఎన్నో ఏళ్ల పాటు గుర్తు చేసుకుంటూ ఉండేలా నిలిచిపోయా(తా)య్, I think 🤔. ముఖ్యంగా నాలుగోది, బహుళార్ధ సాధక ప్రాజెక్టు, కాదు సర్జికల్ స్ట్రైక్. ఒకే దెబ్బకి ఉగ్రవాదుల్ని, నల్లకుబేరుల్ని, అవినీతి చేపల్ని, ఇన్‌ఫ్లేషన్‌ని ఉతికారెయ్యడంతోపాటు యూపీ ఎలక్షన్లనీ, ప్రోబబ్లీ 2019 ఎలక్షన్లనీ (వోటుకి నోటు లావాదేవీలు ఆగిపోతాయ్ మరి) కూడా బుట్టలో వేసేసుకునే పాశుపతాస్త్రం. 🐦🐒 🍵 🌏 🌊 🌄 🌇 🌃 🌉 🌷 🌿 🌾 🌹 🌴 |
🌏న్యూస్🌏
ఈ 👇 బొమ్మే న్యూస్ – 😎వ్యూస్😊 ఆ బొమ్మ చూస్తుంటే భారద్దేశానికి సంబంధించినంత వరకూ అమెరికా ప్రెసిడెంటు పొజిషన్లో చాలా మార్పు, ఒక రకంగా ప్రొమోషన్ వచ్చినట్టే అనిపించట్లా? ఒబామా జేబులో ఎప్పుడూ హనుమంతుడి బొమ్మ పెట్టుకునేవారు(ట). అప్పట్లో ఆయనకి పెద్ద హనుమాన్ విగ్రహం, గదలాంటివి బహుకరించాం. ఒబామాతో పోలిస్తే ట్రంప్‌గారి ఆంజనేయభక్తి ఎలాంటిదో, ఎంతటిదో, భక్తి వుంటే అది ఆంజనేయుడి దివ్యత్వంపైనో, వానరత్వంపైనో తెలీదుగానీ ఆయన ఫోటోలు ఏకంగా హనుమంతుడి పటాల సరసన చేరిపోయాయి. యత్ర నార్యంతు పూజ్యంతే… అన్న హిందూసంస్కృతిపై ఆయనకున్న “గౌరవాభిమానాలు” ఆయన దీపావళి సందేశాల్లో విన్నాం, చేష్టలు లీకైన పాత ఆడియోల ద్వారా తెలుసుకుని ఆనందించాం. ఆజన్మ బ్రహ్మచారి హనుమంతులవారికీ విషయం తెలీకుండా ఉంటుందా? తన పటం పక్కనే ఈ అపర మన్మధులవారి చిత్రాలని చూస్తే ఏం ఇబ్బంది ఫీలౌతాడో ఏమో! (మన్మధులవారూ తోటి హిందూ దేవుడే అయినా ఆయనకీ, అంజనేయుడికీ సైద్ధాంతిక విబేధాలున్నాయి కదా మరి). అయినా ట్రంప్‌కి మనం ఇచ్చిన ‘ప్రమోషన్’ వెనక పాకిస్తాన్ నెత్తిన అమెరికన్ గద పడుతుందనే, పడాలనే మన ఆశ వుందని హనుమంతుడికి తెలీదా ఏంటి? అంచేత చూసీ చూడనట్టు ఊరుకోవచ్చు. అయితే ఈయన(ట్రంప్)గారు – హనుమంతుళ్ళా ఉగ్రాక్షసుల్ని మట్టు పెడతారో 🤔 అంతులేని యుద్ధాలకి ఆజ్యం పోస్తారో 🤔 అణు(బాంబు)మంతుల్ని అణిచిపెడతారో 🤔 అ(ను/ణు)బంధం ఇండియాతో పెనవేస్తారో🤔 – వెండితెరపై చూడాల్సిందే త్వరలో విడుదల, తప్పక చూడండి (కాదు, చూడక తప్పనిది) – సంపూర్ణ ట్రంపాయణం ట్యాగ్ లైన్ – ముందు చూసి తర్వాత (అవసరమైతేనే) కాల్చడం రామభక్త హనుమానం🙏 ముందు కాల్చేసి ఆపైన చూసే రకమని ట్రంప్‌పై లోకానికి అనుమానం.😇 🐦🐒 🍵 🌏 🌊 🌄 🌇 🌃 🌉 🌷 🌿 🌾 🌹 🌴 |
🌏న్యూస్🌏 :
బాలికను చంపిన చిరుత పులిని.. సజీవ దహనం చేసిన గ్రామస్తులు సూరత్: బాలికను చంపిన చిరుత పులిని గ్రామస్తులు సజీవ దహనం చేశారు. బోనులో చిక్కిన చిరుతపై తమ కసి తీర్చుకున్నారు. గుజరాత్ రాష్ట్రం సూరత్‌లోని వాడి గ్రామంలో గురువారం ఈ ఘటన జరిగింది…… http://www.andhrajyothy.com/artical?SID=329877 😎వ్యూస్😊 : పులి మనిషిని చంపితే క్రౌర్యం మనిషి పులిని చంపితే ధైర్యం, శౌర్యం అని వందేళ్ళ క్రితమే ఎవరో మనుషుల డబుల్ స్టాండర్డ్స్‌ని ఏవగించుకున్నారు. సరే, స్ట్రగుల్-ఫర్-ఎగ్జిస్టెన్స్ అనేది ఏ జీవీ తప్పించుకోలేని సత్యం. ఆ స్ట్రగుల్లో జంతువులకీ మనుషులకీ మధ్య సంఘర్షణ తప్పదు, వన్యప్రాణి ఓడిపోకా తప్పదు. అంతులేని మనిషి ఆకలి కోసమో, అడవుల కొట్టివేత కారణంగానో హ్యూమన్-యానిమల్ కాన్ఫ్లిక్ట్ పెరుగుతోందేకానీ తగ్గడం లేదు. ఐనా, మానవజాతి ఒక పక్క అన్యజీవజాతుల్ని భక్షిస్తూనే మరోపక్క సంరక్షించడానికీ ప్రయత్నిస్తున్నారు. అది హర్షణీయం.👍 ఇవన్నీ ఒక ఎత్తు, జనానికి టాయిలెట్లు కట్టించుకునే, వాడుకునే అలవాటులేకపోవడానికి ఒక జీవం – నో, నో, రెండు జీవాలు బలవ్వడం మరో ఎత్తు. అదీ స్వచ్ఛభారత్ నేపధ్యంలో. చిరతపులి చిన్నపిల్లని చంపితే కసి తీర్చుకోక ఊరుకుంటామా అని సరిపెట్టుకోవచ్చు కానీ ఆ బాలిక చిరుత నోట పడడానికి మూలం జనం నాగరికతకి అలవాటు పడకపోవడం కాదా? ఒక జంతువుగా మరో జంతువుని వేటాడడం పులికి సహజం. నాగరికులుగా ప్రజలు టాయిలెట్లు కట్టించుకోకపోవడం, వాడకపోవడం అసహజం. అది ప్రకృతిపై మనిషి చెలాయిస్తున్న నిరంకుశత్వం. 🐦🐒 🍵 🌏 🌊 🌄 🌇 🌃 🌉 🌷 🌿 🌾 🌹 🌴 |
మీ బ్లాగ్ జిలేబి వాసన కొడుతోంది, మీ బ్లాగ్ లోకి రావడానికే భయమేస్తోంది, బొమ్మలు వగైరా వగైరాచూసి.
LikeLike
సర్ ! 🙏
కండలు చూపించిన బొమ్మ మీకు నచ్చలేదనుకుంటున్నాను. ఇప్పుడు
తీసేస్తున్నా.
మీ వ్యాఖ్యలో మొదటి పార్టు విషయంలో వ్యూహాత్మక మౌనం వహించి, ఆ విధంగా ముందుకు పోవాల్నని భావిస్తున్నాను.
LikeLike