🌏న్యూస్🌏 > దేశంలో అత్యంత ఖరీదైన పెళ్ళికి అతి విలువైన శుభలేఖ (ఇంతకంటే డిటెయిల్స్ కావాలా..?)😎వ్యూస్😊 > అత్యంత ముచ్చటైన ఆ శుభసినిమాలేఖని ఇంకా బాగా ప్లాన్ చేసి వుండాల్సింది. పాట, నటన, గ్రాఫిక్స్ అన్నీ అద్భుతం. నటీనటులందరూ తమతమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. స్క్రీన్-ప్లే , దర్శకత్వం గురించి చెప్పనే అక్కర్లేదు. కానీ ఎక్కడో ఏదో చిన్న వెలితి. సినీకళలో వున్న ఇరవైనాలుగు శాఖల్లో ఒకటేదో సరిగ్గా కుదరలేదు. తెర మీద సినిమాలతో పాటు నిజజీవిత డ్రామాలూ చూడ్డం అలవాటైపోయిన మనకి ఒక సినిమాకి ఉండాల్సిన హంగులు, మసాలాలన్నీ లేకపోతే సినిమా చూసిన తృప్తి వుండదు కదా!?! ఆఁ.. ఐనా మించిపోయిందేముంది? ఫ్యూచర్లో ఎన్నో సెలబ్రిటీ వెడ్డింగులు అపరకుబేరుల ఇళ్ళలో జరుగుతూనే ఉంటాయ్. ఐ యామ్ ష్యూర్, ఎవరో ఒకరు బాక్గ్రౌండ్లో జూనియర్ ఆర్టిస్టులు గెంతుతుంటే విదేశీలొకేషన్స్లో స్టెప్పులేస్తూ పెళ్ళికి పిలవకపోరు. స్టంట్లు, ఐటండాన్సులు పెట్టడానికి కొంచెం టైమ్ పడుతుందేమోగానీ కాస్ట్యూమ్స్ మారుస్తూ స్టెప్స్ వేస్తూ పిలిచే పెళ్లిపిలుపులు త్వరలో విడుదల. యెస్, ఇప్పుడా వెలితి ఏవిటో తెలిసిపోయింది.😆😆😆 |
🌏న్యూస్🌏 > Half of India’s wildlife in danger of extinction: Living Planet Report 2016😎వ్యూస్😊 > మనకున్న ఎటాచ్మెంట్లూ, సెంటిమెంట్లూ కూడా ఇంకే దేశంలోనూ, సంస్కృతిలోనూ ఉండవంటే అతిశయోక్తి కాదు. అలాగే ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు అనేది మనకి తెలిసినంత బాగా ఏ దేశానికీ తెలీదు. మొదటిదానివల్ల దేవుళ్ళ నుంచీ సినిమాయాక్టర్ల వరకూ అందర్నీ గుళ్ళు కట్టి వాటిలో బంధించేస్తాం. రెండోదానివల్ల ఆ గుళ్ళనీ, గుడిలో పూజలందుకునేవాళ్ళనీ కూడా కొన్నాళ్ళకి మర్చిపోతాం. ఈ క్రమంలోనే మనం ఈ దేశంలో తిరుగాడే వన్యమృగాలకీ, పక్షులకీ, కొండలకీ, గుట్టలకీ, నదులకీ దైవత్వం ఆపాదించి పూజిస్తాం. కొండలమీద దేవుళ్ళ నివాసాలు, నదుల్లో వారికి నౌకావిహారాలు. పశుపక్ష్యాదుల మాటకొస్తే ఒక్కో జాతినీ ఒక్కో దేవుడికి వాహనంగా ఏర్పరిచి గౌరవించాం. అక్కడితో పనైపోయిందని చేతులు దులిపేసుకున్నాం. కొండలు నదుల పరిస్థితి ఏమిటో కేదార్నాధ్ వరదలోనూ, గంగాయమునల ప్రక్షాళనా ప్రయత్నాల్లోనూ తెలుస్తోంది. జంతుజాతుల అవస్థ ఏంటో ఇప్పుడిలా బైటపడింది. మూగజీవాలపై తమిళకవి వైరముత్తు భావాల్ని అవినేని భాస్కర్గారి అనువాదంలో చదువుకుని నిట్టూర్చడం కంటే ఏం చెయ్యలేని స్థితిలో వున్నాం, అందుకే ఒకసారి ఆ కవితని …. 👇http://eemaata.com/em/issues/201609/9120.html |
🌏న్యూస్🌏 > షిర్డీసాయి దేవుడా కాదా?😎వ్యూస్😊 > ఏ భక్తి సాంప్రదాయంలోనైనా ఆర్తి, అర్ధార్ధి టైపు భక్తులు మెజారిటీగా వుంటారు. జిజ్ఞాసు , జ్ఞాని కేటగిరీ ఎక్కడైనా మైనారిటీయే. జ్ఞాని-జిజ్ఞాసులకి వాళ్ళేం చేస్తున్నారో వాళ్లకి క్లారిటీ ఉంటుంది కనుక వాళ్ళకీ వివాదాల గోలే ఉండదు. స్వచ్ఛమైన ఆర్తులకీ అచ్చమైన అర్ధార్ధులకీ ఇవి పట్టించుకునేంత ఓపిక తీరిక లగ్జరీ వుండవు. అవసరాన్ని బట్టీ దేవుణ్ణి మార్చుకుంటారు కానీ ఇలాంటి మేధోమధనాలు వాళ్ళ ఒంటికి పడవు. సో, ఈ వాదవివాదాల వల్ల ఎఫెక్ట్ అయ్యి బాధపడే సంశయాత్ములు, అంటే అర్ధార్ధి స్టేజి నుంచి జిజ్ఞాసు-జ్ఞాని వర్గంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నవాళ్ళు, అలాంటి వాళ్ళ కోసం కూలంకష చర్చలు జరగాలి. ఒక వ్యక్తి దేవుడా కాదా అంటే అవుననీ కాదనీ ఎడతెగని వివాదానికి ఏడాదికోసారి తెర లేస్తూ వుంటుంది. వివాదానికి ఇరుపక్షాలా మనోభావాలు గాయపడుతూనే వుంటాయి. అదలా కొనసాగుతూనే వుంటుంది కానీ వివాదంపై వున్న ఫోకస్ ఆ వివాదంవల్ల వెలుగులోకి వచ్చే, వెలుగులోకి రావాల్సిన ముఖ్యమైన విషయాలపైకి మళ్ళదు. ఎందుకో మరి? ఆర్జీవీ ట్వీట్లు , ఆయన ఫిలాసఫీ ఇర్రిటేటింగ్ గా వున్నా కొన్నిట్లో మాంఛి లాజిక్కుంటుంది. ఆలోచించే మెదడుకి కావాల్సినంత మేత. చూసే దృష్టిని బట్టి షిరిడీసాయి పైన చెలరేగుతున్న వివాదం కూడా అలాంటిదే. భక్తులు, విభక్తులు (=సాయికి భక్తులు కానివారని కవి హృదయం😉 ) కూడా లోతుగా ఆలోచించాల్సినవి, అయినా ఎవరూ సీరియస్ గా పట్టించుకోనివి ఐన పాయింట్లు అనేకం దీనివల్ల చర్చలోకి వస్తాయి.మచ్చుకి కొన్ని –
ఇలాంటి అంశాలపై అర్ధవంతమైన చర్చలు ఆధ్యాత్మికవేత్తల మధ్య కంటిన్యువస్గా జరుగుతూ వుంటే ప్రజలకి మార్గదర్శకంగా ఉండదూ? ఆ రకంగా వివాదాన్ని సంవాదం(= ప్రశ్నోత్తర రూపమగు సంభాషణము అని ఆంధ్రభారతి డిక్షనరీ మీనింగు)గా మార్చుకోవచ్చేమో?!? షిర్డీసాయి కృష్ణుణ్ణి రిపీట్ చేస్తూ చెప్పిన “తద్విద్ధి ప్రణిపాతేన పరి ప్రశ్నేన సేవయా. ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వదర్శిన:” శ్లోకానికర్ధం అదే కదూ! 🤔🤔🤔 |
🐦🐒 🍵 🌏 🌊 🌄 🌇 🌃 🌉 🌷 🌿 🌾 🌹 🌴
👇క్లిక్👇
🌴🌹🌾🌿🌷హాపీ వృక్షావళి!! పుడమితల్లి కోసం చిన్న హాండ్మేడ్ వీడియో🌷 🌿 🌾 🌹 🌴