ములాయం సింగ్ ఉవాచ: నా కొడుకు వేస్ట్, ఆమె కొడుకు బెస్ట్ + శివపాల్ ఉవాచ: గంగాజలంపై ఒట్టు..//వేళ్ళతో లెక్కపెట్టే అలవాటున్న పిల్లలు తెలివితేటల్లో..//దీపావళికి పొల్యూషన్-ఫ్రీ దీపాలు


🐦🐒 🍵 🌏 🌊 🌄 🌇 🌃 🌉 🌷 🌿 🌾 🌹 🌴

🌏న్యూస్🌏

వేళ్ళతో లెక్కపెట్టడం అలవాటున్న పిల్లలు తెలివితేటల్లో ముందుంటారు(ట)

Counting on fingers may make kids smarter: Study

Washington, Oct 23, 2016, PTI:

In order to analyse how the mind works while performing arithmetic, Ilaria Berteletti from Gallaudet University in the US and colleagues scanned the brains of 39 children between ages eight and 13 while they mentally subtracted and multiplied single-digit numbers. File photo. For representation purpose. Parents, take note! Counting on fingers may make your kids smarter, suggests a new study which found that children who have better perception of their hands tend to be more skilled at math. Finger perception – the ability to distinguish, name, or recognise the fingers – is associated with math skill and even when people are not manually ticking off numbers, areas of the brain associated with fingers are still activated, researchers said.

😎వ్యూస్😊

వేళ్ళమీద లెక్కపెట్టడం, అక్షరాలు దిద్దడం, ఎక్కాలు బట్టీపట్టడం మొన్నమొన్నటి వరకూ ఇండియాలో పిల్లలకి అలవాటున్నవే కదా! ఇంకొంచెం వెనక్కెళ్తే పజిల్స్‌లాంటి పద్యాలు హోమ్‌వర్క్‌గా ఇచ్చేవారని “ధారణా బ్రహ్మరాక్షస” బిరుదాంకితులు గరికిపాటివారు చెప్పారు. అంటే ముందునుంచే వున్న తెలివితేటల్ని పెంచే పద్ధతుల్ని మార్చేసి, ఆ సో-కాల్డ్ “పాత”పద్ధతులన్నీ మరుగునపడ్డాక, అలవాటు తప్పిపోయాక అవే మంచివని “సైంటిఫిక్”గా తెలుసుకుంటున్నాం. ప్చ్! కాన్ట్ హెల్పిట్! రీ-ఇన్వెంటింగ్ ద వీల్ అంటే ఇదేనేమో!?!?!

🌏న్యూస్🌏

రామజన్మభూమిలో యాదవకుల ముసలం అనిపించుకుంటున్న ములాయం Vs. అఖిలేష్ Vs.శివపాల్Vs.అమర్‌సింగ్ వివాదాల్లో రెండు హైలైట్స్ –

(1)   🌏న్యూస్🌏 // నా కొడుకు వేస్ట్ ఆమె కొడుకు బెస్ట్ : మోడీకి ములాయం ప్రశంసలు

తాజాగా ఉత్తర ప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ చూపులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై పడ్డాయి. మోదీ ‘మంచి కొడుకు’ అని తెగ పొగిడేశారు. ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టినా అప్పుడప్పుడూ వెళ్ళి తన తల్లి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటారన్నారు. మోదీ ఆదర్శప్రాయుడైన కొడుకు అని స్పష్టం చేశారు. లఖ్‌నవ్‌లో సోమవారం జరిగిన సమాజ్‌వాదీ పార్టీ సమావేశంలో ములాయం, ఆయన కుమారుడు అఖిలేశ్ యాదవ్ హోరాహోరీగా తలపడిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలోనే అఖిలేశ్‌కు పరోక్షంగా హితవు చెప్తూ మోదీని ప్రశంసించారు. తన సంతానం నుంచి తాను ఏమి ఆశిస్తున్నదీ ములాయం సంకేతాలిచ్చారు.

😎వ్యూస్😊

పాపం, ఈ మాటకి అఖిలేష్ ఎలా ఫీలయ్యాడో, ఎంత ఫీలయ్యాడో కానీ ప్రజల్లో కొందరైనా “చాయ్ అమ్ముకునేవాళ్ళ పిల్లలకి, కుస్తీపట్లు పట్టేవాళ్ళ పిల్లలకి తేడా ఇదన్నమాట,” అనుకుంటే?!?! ఇంకేమన్నావుందా?

(2)   🌏న్యూస్🌏 //గంగాజలంపై ఒట్టు.. అఖిలేశ్‌ కొత్తపార్టీ పెడతానన్నారు : శివపాల్ యాదవ్//

‘‘కొత్త పార్టీ పెడుతున్నానని అఖిలేశ్‌ నాతో చెప్పారు. ఇప్పుడు మాటమార్చి అబద్ధాలు చెబుతున్నారు. కావాలంటే గంగానదిమీద ప్రమాణం చేస్తా.’’ అంటూ ములాయం సోదరుడు, యూపీ మంత్రి శివపాల్‌యాదవ్‌ ఆరోపించారు.

😎వ్యూస్😊

అఖిలేష్ అలా చెప్తే చెప్పుండచ్చు. చెప్పకపోయీ వుండచ్చు. మనకి తెలీదు. తెలిసే అవకాశం కూడా లేదు. ఈ గంగాజలం మీద ఒట్టేసి చెప్పడం అనేదే సందేహాలకి తావిస్తుంది. గంగా ప్రక్షాళన / శుద్ధి ప్రాజెక్టు ఇంకా పూర్తవ్వలేదుగా? అది అవ్వకుండానే గంగానదిపై ఒట్లేసేస్తే జనాలకి – గంగలో పేరుకున్న (కుంటున్న) కాలుష్యం చూస్తున్నవాళ్లకి – ఆ ఒట్ల మీద డౌట్లు రావూ?

🌏న్యూస్🌏 : దీపావళి రోజు బాణసంచా కాల్చవద్దని కాలుష్య నియంత్రణ మండలి సూచిస్తోంది. కాలుష్యకారకమైన పొగ వల్ల శ్వాసకోశ వ్యాధులు, విపరీతమైన శబ్దాల కారణంగా వినికిడి సమస్య వస్తుందని, కళ్ళల్లో రజను వంటివి పడితే దృష్టికే ఇబ్బంది కలుగుతుందని సంబంధిత శాఖ హెచ్చరిస్తోంది. 75 డెసిబుల్స్‌ అంటే రెండు చేతులతో చప్పట్లు గట్టిగా కొడితే ఎంత శబ్దం వస్తుందో అంత శబ్దం గల బాణసంచాను మాత్రమే వినియోగించడం వల్ల ఇబ్బంది ఉండదని కూడా ప్రచారం చేస్తున్నారు.

😎వ్యూస్😊 : చెవులకి సంగీతంలా వినబడి, కళ్ళకి విందులా కనిపించిన వార్త ఇది, నిజంగా. సంస్కృతి, సాంప్రదాయం పేర్లతో ఏడాదిలో ఒకేఒక్కరోజులో గాలిలో ఎంత పొల్యూషన్ కలుపుతున్నామో. గణేశనిమజ్జనాల్లో నీళ్ళలో కలుస్తున్న కాలుష్యం కంటే దీపావళి రోజు గాలిలో కలిసే విషవాయువులు ఎక్కువ. ఇంకా పైగా ఇతరప్రాంతాలకి గాలి నీళ్ళకంటే తేలిగ్గా వ్యాపిస్తుంది. కాలుష్య నియంత్రణ మండలి సూచనలు టపాకాయల రణగొణధ్వనిలో మినుకుమినుకుమంటూ ఒక మూలన ఒదిగుండే దీపాల్లా వున్నా అవి దీపావళి అంతరార్ధాన్ని చాటే జ్ఞానదీపాల్లా వున్నాయి.

🐦🐒 🍵 🌏 🌊 🌄 🌇 🌃 🌉 🌷 🌿 🌾 🌹 🌴