న్యూస్🌏😎వ్యూస్ >ఈ సిగ్నల్ రిసీవ్ చేసుకున్న సైంటిస్ట్ వావ్! అని…//మైసూర్ పాక్ పేరు మార్చాలని, కరాచీ హల్వాలో కరాచీ … // షాంఘై నుంచి ఏ దిశలోనైనా సరే మూడు గంటలు….


 

🌏న్యూస్🌏 >> A 39-year-old radio signal that hinted at life beyond Earth is being probed again

wow

😎వ్యూస్😊 ముప్ఫైతొమ్మిదేళ్ళ క్రితం అంతరిక్షంలోంచి వచ్చిన ఓ సిగ్నల్‌ని మన సైంటిస్ట్‌లు పసిగట్టారు. ఒకే ఒక్కసారి వచ్చిన ఆ రేడియో సిగ్నల్ ధనుర్రాశిలో వున్న నక్షత్రమండలాల్లో ఎక్కణ్ణుంచో వచ్చిందని అంచనా. భూమికాక విశ్వంలో వేరే ఎక్కడైనా బుద్ధిజీవులుండి వాళ్ళు ఇతర బుద్ధిజీవుల అన్వేషణలో సంకేతాలు పంపిస్తున్నట్టైతే ఆ సంకేతాలు ఎలా ఉండాలో దానికి తగినట్టు ఇవున్నాయని  శాస్త్రజ్ఞుల అంచనా.  ఈ సిగ్నల్ రిసీవ్ చేసుకున్న సైంటిస్ట్ వావ్! అని నోరు తెరిచాట్ట. పైన కనిపిస్తున్న “wow” అతని రాతే. ఆ వావే దానికి పేరుగా స్థిరపడింది. కొత్తగా మళ్ళీ ఈ సిగ్నల్స్‌పైన పరిశోధనలు మొదలౌతాయిట.

బానేవుంది కానీ భూమ్మీదున్న నానాజాతుల జనాల మధ్య వైరాలూ, ఆ మాటకొస్తే ఏ జాతికి ఆ జాతిలోనే అంతఃకలహాలూ కలిపి సవాలక్ష ఇష్యూలు నలుగుతూ కొట్టుకు చస్తుంటే, కాదు ఛస్తుంటే, ఇప్పుడు కొత్తగా గ్రహాంతరజీవుల్ని వెతికి పట్టుకుని వాళ్ళతో సంబంధబాంధవ్యాలు నెరపాల్సిన అర్జెన్సీ ఏఁవిటో మానవుడికి. వాళ్ళంతట వాళ్ళు వెతుక్కుంటూ వస్తే ఎలాగో తప్పదు. అది వేరే సంగతి. మనమే వాళ్ళని వెతికి పట్టుకున్నాక వాళ్ళూ మనలాంటివాళ్ళే అయితే ఇంక షరా మామూలేగా? అంతరిక్షంలో బోర్డర్లు, పార్టిషన్లు, LOCలు, క్రాస్-బోర్డర్ టెర్రర్ ఎటాక్స్, సర్జికల్ స్ట్రైక్సూ, మన సినిమాల్లో వాళ్ళ యాక్టర్స్ నటించాలంటే మన ఆర్మీకి సినిమావాళ్ళు కోట్లు చెల్లించడం…….

🐦🐒 🍵 🌏 🌊 🌄 🌇 🌃 🌉 🌷 🌿 🌾 🌹 🌴🐦🐒 🍵 🌏

🌏న్యూస్🌏 >> కృష్ణ జింకల వేట కేసులో సుప్రీం కోర్టుకి రాజస్తాన్ ప్రభుత్వం  అప్పీల్

😎వ్యూస్😊 >>

kandala

🐦🐒 🍵 🌏 🌊 🌄 🌇 🌃 🌉 🌷 🌿 🌾 🌹 🌴🐦🐒 🍵 🌏

🌏న్యూస్🌏>>    మైసూర్ పాక్ పేరు మార్చాలని, కరాచీ హల్వాలో కరాచీ ఉన్నంతవరకూ దాన్ని ముట్టుకోమని నెటిజన్ల హల్చల్!!

😎వ్యూస్😊 >>

ఉరుమురిమి మంగలం మీద పడినట్టు ఇండో-పాక్ గొడవల సంగతేమోగానీ మైసూర్‌పాక్ ప్రాణాల మీదకొచ్చింది. ఉరీ ఎటాక్స్, ఆపైన సర్జికల్ స్ట్రైక్స్ నేపధ్యంలో రెండు దేశాల ప్రభుత్వాలు డిప్లొమాటిక్ & స్ట్రాటజిక్ వార్ చేస్తుంటే దాన్ని కాష్ చేసుకోడానికి పేటపార్టీలు, సందుపార్టీలు, టీవీ ఛానళ్ళు ఒక పక్క చెలరేగిపోతుంటే, ఇంకోపక్క గల్లాపెట్టెల వర్రీ పట్టుకున్న కండలవీరులు, కరణ్ జోహార్లు తమ సొంత శైలిలో కామెడీ చేస్తుంటే పొలిటికల్ & సినీ కమెడియన్స్‌ని గేలి చేస్తున్నారో లేక తమ ఉడతాదేశభక్తి ప్రదర్శిస్తున్నారోగానీ సామాన్యులు మైసూర్‌పాక్ మీద, కరాచీ హల్వా మీద, పెషావర్ బిర్యానీ మీద యుద్ధాలు ప్రకటించారు. ఓ పాతికేళ్ళ క్రితం వరకూ మైసూర్‌పాకంగా స్వదేశీ ఘుమఘుమలు వెదజల్లి, ఫాషనబుల్ జన‌ం పాకాన్ని పాక్‌గా ఆంగ్లీకరించినా భరించి ఇప్పుడు మేడిన్ పాకిస్తాన్‌ ముద్ర వేయించుకుని…. ప్చ్! పాపం! మైసూర్‌‌పాక్(కం). ఇంకా నయం, పాకంగారెలు పాక్ గారెలుగా మారలేదుగానీ మారివుంటే?? ….ఎంత ప్రమాదం తప్పిందీ..

🐦🐒 🍵 🌏 🌊 🌄 🌇 🌃 🌉 🌷 🌿 🌾 🌹 🌴🐦🐒 🍵 🌏

🌏న్యూస్🌏>>

Seeing pollution over India, China left me shocked: Astronaut Scott Kelly : “Seeing places like China and India, and the pollution that exists there almost all the time is quite shocking,” Kelly said in a brief media appearance with US President Barack Obama in the Oval Office of the White House yesterday.

“There was one day last summer, the summer of 2015, when I was in space I saw the eastern side of China was perfectly clear. And I’d never seen that before in all of my time in space, and I’d spent well over a year in space, total, at that point,” he said. Seeing Himalayan lakes kept US astronaut Scott Kelly ‘sane’

“I could see all these cities that are – there’s like over 200 cities in that part of China, with over a million people. And it was at dusk, and I could just, for the very first time, I was able to see them, and it was quite shocking,” he added.

😎వ్యూస్😊 >> హైదరాబాద్‌లో అరగంట ఆటో ప్రయాణం చేసినా, డబుల్‌డెకర్ బస్సులో పై డెక్‌లో కూచుంటేగానీ ఊపిరాడని వైనం చూసినా, బైట వాహనాలు వదిలిన పొగ వాసన ఏసీకార్లో చల్లచల్లగా వీచే మలయపవనంగా చెలామణీ అయ్యే విధం అనుభవించినా తెలిసిపోయే, నగరవాసులు(ల్ని?) నిత్యం ఆస్వాదించే పొల్యూషన్ని-

షాంఘై నుంచి ఏ దిశలోనైనా సరే మూడు గంటలు ప్రయాణించినా కొడైకెనాల్లో మబ్బుల్లా కంటిన్యువస్‌గా కనిపిస్తూనేవుండే కాలుష్యాన్ని-

చూసి హా…..శ్చర్యపడిపోయేసేదానికి ఏడాదిపాటు అంతరిక్షంలో గడపాలా?

😉 😉 😉 వాట్ ఐ మీన్ ఈజ్, ఇంతింత కాలుష్యాన్ని పీల్చేస్తూ కూడా మనం మౌనంగా భరించేస్తుంటే స్కాట్ కెల్లీలాంటివాళ్ళు పై విధంగా హైలైట్ చెయ్యక తప్పదు, మనమే మౌనం వీడాలి అని.

🐦🐒 🍵 🌏 🌊 🌄 🌇 🌃 🌉 🌷 🌿 🌾 🌹 🌴🐦🐒 🍵 🌏

4 thoughts on “న్యూస్🌏😎వ్యూస్ >ఈ సిగ్నల్ రిసీవ్ చేసుకున్న సైంటిస్ట్ వావ్! అని…//మైసూర్ పాక్ పేరు మార్చాలని, కరాచీ హల్వాలో కరాచీ … // షాంఘై నుంచి ఏ దిశలోనైనా సరే మూడు గంటలు….”

  1. < " కరాచీ హల్వాలో కరాచీ ……. "
    —————-
    😀😄. ఒకప్పుడు ఉప్మారవ్వ (బొంబాయి రవ్వ / హిందీలో సూజీ) ని కరాచీ నూక అనేవారు. ఇప్పుడెవరూ ఆ పేరు వాడుతున్నట్లు లేదులెండి 🙂. .

    Like

    1. సర్, మీ కామెంట్ చూశాక తట్టింది, మనకో హైదరాబాదు, పాకిస్తాన్లో ఒక హైదరాబాదు వున్నాయి. మరి…

      Like

  2. అవునా శర్మ గారూ?? 🙁
    అవును కదా YVR గారూ!! 🙁
    కాబట్టి మా వంతు “ఉడతా దేశభక్తి”గా కరాచీ నూకలో కరాచీ, హైదరాబాద్ బిర్యానీలో హైదరాబాద్ తీసెయ్యాలని డిమాండ్ చేస్తున్నాం 👆😀.
    అంత వరకు ఉప్మా, సత్యనారాయణ వ్రత ప్రసాదం గోధుమ నూక తో చేసుకోవచ్చు ✋ 🙂.

    Like

Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s