న్యూస్🌏+😎వ్యూస్>చైనా మరో ఈస్టిండియా కంపెనీ/ఇవాళ ఒక అమెరికన్‌తో/”పయనించే ఓ చిలుకా! ఎగిరిపో కబ్జా అయ్యెను గూడూ,” …


 

🌏న్యూస్🌏  చైనా మరో ఈస్టిండియా కంపెనీ: పాక్ ప్రభుత్వంపై పాక్ చట్టసభ్యుల ఆగ్రహం
😎వ్యూస్😊 చైనా – పాకిస్తాన్ జాయింటుగా చేస్తున్న ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్ వల్ల నష్టాలు కష్టాల పాలవుతున్నది బలూచీస్తాన్ ప్రజలు. వాళ్ళ గురించి ఇన్నాళ్ళూ లేని ఆగ్రహం, ఆదుర్దా, ప్రేమ పాక్ చట్టసభలు ఇప్పుడెందుకు ఒలకబోస్తున్నట్టు? ఎందుకంటే అదంతా బెలూచిస్తాన్‌లో జరుగుతున్న అక్రమాలపై ప్రపంచం కళ్ళు తెరిపించడానికి ఇండియా చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోడానికి చైనా ఆడిస్తున్న తోలుబొమ్మలాట కాబట్టి. ఈస్టిండియా కంపెనీ ప్రస్తావన ఎందుకో? ఆ కంపెనీ వల్లే కదూ వీళ్ళకీ పాకిస్తాన్ దక్కింది?

😈😈😈

🌏న్యూస్🌏 ఇవాళ ఒక అమెరికన్‌తో మాట్లాడే పని పడింది… అనుకోకుండా వాళ్ళ ఎలక్షన్స్ ‌టాపిక్ వచ్చింది…
😎వ్యూస్😊 అతను ఏవఁన్నాడంటే, “ఈ ఎలక్షన్స్‌లో ట్రంప్‌కి  అధికారం రాకూడదని హిల్లరీకి వోట్లేసేవాళ్ళు, హిల్లరీ ప్రెసిడెంటు అవ్వకూడదని ట్రంప్‌ని ఎన్నుకునేవాళ్ళు వున్నారు కానీ ఇద్దర్లో ఏ ఒక్కరినీ ప్రెసిడెంట్ అవ్వాలని కోరుకుని వోట్ చేసేవాళ్ళు లేరు,” అని. మన ఎలక్షన్లే నయఁవేఁమో!!

🙈 🙉 🙊

🌏న్యూస్🌏  దురాక్రమణలు, కబ్జాల గురించి వార్తలు, విశ్లేషణలు, చట్టాలు, లా-ఎన్ఫోర్స్‌మెంట్లు… అంటూ ఎన్నాళ్ళు ఎన్ని డిబేట్లు చేసినా అవింకా జరుగుతూనే వున్నాయి. ఎందుకంటే ….
😎వ్యూస్😊 కబ్జా అనేది మనుషులకి పుర్రెతో పుట్టిన బుద్ధి కనక. జంతుస్థాయిలో వున్నప్పటి నుండీ ఇప్పటి వరకూ కొన్ని లక్షల ఏళ్ల పరిణామక్రమం జరిగినా జీన్స్‌లో ఇంకా పూర్తిగా మారని క్వాలిటీ అది. 👇అదిగో ప్రూఫ్ – 

kabja

(అదేదో ఫోటో కాంపిటీషన్‌లో బహుమతి పొందిన ఫోటో. నిజంగా జరిగినది, ఫోటోషాప్ కానిది.) ఐతే, కొన్ని లక్షలఏళ్ల పరిణామక్రమంలో మనిషికి కబ్జా అలవాటు పూర్తిగా పోలేదు కానీ, క్రమబద్ధీకరణ అనే కొత్త స్కిల్ నేర్చుకున్నాడు. పాపం ఈ చిలక మాత్రం ఉడుము తోక పట్టుకుని ఎంత పీకినా ఏం పీకలేక చివరికి “పయనించే ఓ చిలుకా! ఎగిరిపో కబ్జా అయ్యెను గూడూ,” అని పాడుకుంటూ వేరే గూడు వెతుక్కుంటూ పోయిందిట.  

🍵 🌏 🌊 🌄 🌇 🌃 🌉 🌷 🌿 🌾 🌹 🌴