లక్ష్మీదేవి వాహనం ఏమిటి? నార్త్ ఇండియన్స్‌ని అడిగితే మొసలి అంటారు, కొందరు గుడ్లగూబ అంటారు. అమ్మవారు శ్రీవారితో షికారుకి బయలుదేరితే డ్యూటీ గరుడాళ్వార్దే అయినా సెపరేట్ వెహికిల్ కావాలంటే నెమళ్ళు, హంసలు, చిలకల్లాంటి నాజూకు వాహనాల్ని వదిలి శ్రీమహాలక్ష్మి ఆ రెండుజీవుల్ని ఎంచుకోవాల్సిన అవసరం ఏమిటో తాంత్రికంగా ఆలోచిస్తే తప్ప అర్ధం కాదేమో. సో, నో కామెంట్స్. నార్త్ ఇండియన్స్‌తో పోలిస్తే కొంచెం రేషనల్ & సోబర్ అనిపించే సౌత్ ఇండియన్ మైండుకి మాత్రం సముద్రమధ్యంలో మదగజాలచేత అభిషేకించబడుతున్న పద్మాలయని చూస్తే హాయిగా వుంటుంది😊. రవివర్మ చిత్రించినట్టు ఆవిడ పద్మంలో నిలబడి బాక్గ్రౌండ్లో ఒక ఏనుగు పూలదండతో సరోవరంలో నిలిచివున్న దృశ్యం సాత్వికతని, ప్రశాంతచిత్తాన్ని ప్రతిబింబిస్తూ వుంటుంది🙏…….🤔😵🤔😵🤔
అదిగో అంతవరకూ రాశాక ఇంక పెన్ను, కాదు కీ బోర్డు, కాదు కాదు బుర్ర మొరాయించింది. దాంతో ఆంధ్రజ్యోతి నెట్ ఎడిషన్ చదవడం మొదలుపెట్టా. హెడ్‌లైన్స్ ఈ మధ్య అన్ని పేపర్లకి వికృతమైన లేక సజెస్టివ్ టైటిల్స్ పెట్టబడిన హత్యలు, అత్యాచారాలు, అక్రమాలే కదా. అందుకని హెడ్‌లైన్స్ వదిలేసి ముఖ్యవార్తల్లోకి వెళ్తే ఈ వార్త చదవాలనిపించింది. చైనా వస్తువులు బహిష్కరించమని మోడీజీ పిలుపిచ్చాక ఇలాంటి న్యూస్‌పై ఇంట్రెస్టు పెరిగింది. మంచి గొడ్డుకో దెబ్బ మంచిమనిషికోమాట అన్నట్టు పాకిస్తాన్‌కి మిలటరీ సర్జికల్ స్ట్రైక్ ఇచ్చిన మోడీ చైనాకి ఎకనామిక్ సర్జికల్ స్ట్రైక్ ఇచ్చినట్టైంది (ఆఫ్కోర్స్ సామెతలో వున్న మంచి పదం ఇక్కడ అప్లై అవ్వదు) కదా. అందుకూ ఈ ఇంట్రెస్టు. ఇంతకీ సమాచారం ఇదీ – “ఢిల్లీలో చైనా వస్తువులను విక్రయిస్తున్న దుకాణాలు, మార్కెట్లను బహిష్కరిస్తున్నారు. కానీ, మనం చైనా వస్తువులన్నీ బహిష్కరించగలమా! అంటే బహిష్కరించలేం. బహిష్కరిస్తే మనం అసలు బతకలేం కూడా. కాస్త అతిశయోక్తిగా అనిపించొచ్చు కానీ ఇది నిజం. ఒకవేళ మనం వాటిని వద్దనాలంటే మన తయారీ రంగం చాలా అభివృద్ధి చెందాలి! తాతకు దగ్గు మందు నుంచీ మనవడికి ఆటబొమ్మదాకా.. దేశంలో అన్నీ చైనామయమే. ఎందుకంటే ఔషధాలైనా సరే.. ఆటబొమ్మలైనా సరే వాటికి ముడిసరకు చైనా నుంచి రావాల్సిందే. అక్కడి నుంచి ముడిసరకు రాకుంటే మన దేశంలో చాలా పరిశ్రమలు మూతబడాల్సిందే. ప్లాస్టిక్, సెల్ఫోన్లు, ల్యాప్‌టా్‌పలు, సోలార్ సెల్స్, ఎరువులు, కీ బోర్డులు, డిస్ప్లేలు, కమ్యూనికేషన్ పరికరాలు, ఇయర్ ఫోన్లు, అణు విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలకు అవసరమైన సరంజామా, ఔషధాలు, యాంటీబయోటిక్స్, భారీ యంత్రాలు, ఆటబొమ్మలు, స్ర్పింగ్‌లు, బాల్ బేరింగ్లు, ఎల్సీడీ, ఎల్ఈడీ పరికరాలు, రూటర్లు, పెన్‌డ్రైవ్‌లు, రకరకాల విద్యుద్దీపాలు, టపాసులు, దేవుళ్ల బొమ్మలు ఇలా చెప్పుకొంటూ పోతే మనం నిత్యం వాడే చైనా వస్తువులకు అంతూ పొంతూ ఉండదు. మరి వీటన్నింటినీ బహిష్కరించాలంటే దాదాపు ఎవరికీ కుదరకపోవచ్చు. ఇక చైనా ముడిసరకు కలిగిన వస్తువులు.. పరికరాలైతే సరేసరి. ఒక్కమాటలో చెప్పాలంటే మనం చైనాపై ఆధారపడటం రోజురోజుకీ పెరుగుతోంది. నాలుగేళ్ల కిందట మన దిగుమతుల్లో చైనా స్థానం 10గా ఉంటే ఇప్పుడిది ఆరుకు చేరింది. మన ప్రభుత్వం మేకిన్ ఇండియా కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత దేశంలోకి మేడిన్ చైనా వస్తువుల దిగుమతి 20శాతం పెరిగింది. గత అయిదేళ్లుగా ఏటా అయిదు శాతం మేర ఆ దేశ దిగుమతులు పెరుగుతున్నాయి. గత ఆరేళ్లలో మన దేశం నుంచి చైనాకు ఎగుమతులు 20 శాతం మేర క్షీణిస్తే.. దిగుమతులు మాత్రం 11.5 శాతం పెరిగాయి. మొత్తానికి చైనా నుంచి ఏటా రూ.నాలుగు లక్షల కోట్ల విలువైన వస్తువులు దిగుమతి అవుతున్నాయి.” ట్రెండు ఇలా వుంటే మోడీ ఎన్ని పిలుపులిచ్చినా సరిపోదు. గావుకేకలు పెట్టాల్సిందే. సరే ఆ తంటాలేవో ఆయన పడాల్సిందే. కానీ జనం అనబడే మనం మాత్రం చైనా నుంచి వచ్చే సరుకులన్నీ కాకపోయినా కొన్నైనా కొనడం మానెయ్యాలి. మొదటిది పిల్లలు ఆడుకునే బొమ్మలు. ఎందుకంటే ఆ బొమ్మలకి చైనా వాళ్ళు వాడే పదార్ధాలు ఎలాంటివో, వేసే రంగులు ఎంత విషపూరితాలో మనకి తెలిసే అవకాశం లేదు. ఆ మధ్య పిల్లలకి వాడే పాలపొడిలో ప్రాణాంతక కెమికల్స్ కల్తీ చేసి కొందరు దొరికిపోవడం, వాళ్ళని ఉరి తియ్యడం జరిగింది. అది బయటికి వచ్చిన న్యూసు. బయటపడని న్యూస్ ఎంత వుందో ఆ దేవుడికే తెలియాలి అనుకోడానికీ లేదు. చైనా వాళ్లకి దేవుడు లేడు కదా మరి. సరిగ్గా అందుకే చైనా నుంచి వచ్చే దేవుళ్ళబొమ్మలతో జాగర్తగా వుండాలి. ఆ దేవుళ్ళని ఎవరైనా తెలియక దేవుడిగూట్లో పెట్టుకుంటే దగ్గరగా దీపమో, అగరొత్తో పెట్టకుండా ఉండలేం కదా! ఆ బొమ్మలకేసే రంగుల్లో మండేపదార్ధాలు (flammable substance) లేవని గారంటీ ఏవుంది? పోనీ, సపోజ్, ఫర్ సపోజ్, ఆ ప్రమాదం లేదనుకున్నా ఆ దేవుళ్ళకి బొట్లు, నామాలు వగైరా లు వుండవు. పోనీ మనం అలవాటు ప్రకారం దేవుడి పటాలకి మెత్తినట్టు కుంకుమబొట్లు మెత్తచ్చు అని సరిపెట్టేసుకున్నా కానీ దేవుళ్ళకి మెల్లకళ్ళుంటే తట్టుకోగలమా? కనీసం డెకరేషన్ పీస్గానైనా పెట్టుకోలేంకదా? చైనా పాస్‌పోర్ట్ తో వచ్చే హిందూ దేవుళ్ళందరికీ మెల్లకళ్ళు కంపల్సరీ. కొందరికైతే చైనీస్లాగే చికిలికళ్ళు. మన దేవుళ్ళు మరి కమలనేత్రులు, కంజదళాయతాక్షులు కదా. చీమకళ్ళ సైనో-ఇండియన్ దేవుళ్ళు పద్మాలు, కలువలతో నిండిన మన స్తోత్రాలు యాక్సెప్ట్ చేస్తారా? చేసినా తట్టుకోగలరా? పద్మాలు కలువలు అంటే గుర్తొచ్చింది, ఈ పోస్టు మొదలుపెట్టడానికి అసలు కారణం. అది ఇదీ, లాస్ట్ వీక్ ఎవరో గిఫ్టుగా ఇచ్చిన లక్ష్మీదేవి ఫ్లవర్ వేజ్. పైన చెప్పిన వర్ణనలలో కొన్నిటికీ చైనీస్ క్రియేటివిటీ జోడించి తయారు చేసిన చైనా లక్ష్మీ దేవి. భారతదేశ సరిహద్దులు దాటనంత వరకూ ఏనుగు, మొసలి, గుడ్లగూబ వాహనాలపై విహరించే లక్ష్మమ్మకి చైనీయులు కొత్తవాహనం సమకూర్చారు. అదిగో ఆవిడ పాదాల దగ్గిర వుంది –
శ్రీమాత ఇంకా గమనించినట్టులేదు కానీ చూస్తే వెంటనే కాలు పైకి పెట్టేసుకుని పద్మాసనంలోకి మారిపోయేంత అందంగా లేదూ ఈ కొత్తవాహనం. వినాయకుడు చైనీస్ ఎలక నాకొద్దన్నాడో, చైనీసే జాలి తలిచి ఆయన బరువీ ఎలకేం మోస్తుందని పోర్ట్‌ఫోలియో మార్చారో కానీ గరుడారూఢ లక్ష్మీదేవి, మూషికారూఢగా దర్శనమివ్వాల్సొచ్చింది. చిన్నప్పుడు తాతగారు చెప్పిన కధలో ఒకడు, “తొండం బొజ్జా చూసి ఆంజనేయుడివనుకున్నాను, వీరభద్రుడివటోయ్ వెంకటేశా,” అంటాడు. వాడెవడో కచ్చితంగా చైనీస్వాడే అయ్యుంటాడు, ఫా హియాన్ కానీ , హ్యూయెన్‌త్సాంగ్ కానీ…ఛ! ఛ! వాళ్ళు కాదు…వాళ్ళ శిష్యప్రశిష్యుల్లో ఒకడయ్యుంటాడు. అదీ ఇండియన్ గాడ్స్ మేడిన్ చైనా కధ. ఓ వందేళ్ళ తర్వాత, అక్కర్లేదు ఇప్పటి ట్రెండు బట్టీ ఓ పాతికేళ్ళ తర్వాత మూషికవాహనంపై అమ్మవారు అంటూ ఆర్టిఫిషియల్ భక్తి నిండిన కంఠాలతో టీవీ యాంకర్లు వర్ణిస్తూంటే వినే దుస్థితి వద్దు అనుకుంటే … లెటజ్ స్టాప్ బయింగ్ చైనా మేడ్ ఇండియన్ గాడ్స్. వాటికి పెట్టే ఖర్చు కొండపల్లి బొమ్మలూ, ఏటికొప్పాక బొమ్మలమీద పెడితే ఆ కళనీ, ఆ కళాకారులనీ నిలబెట్టినట్టవుతుంది. Make In Indiaకి సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. 🙂 🙂 🙂 🙏
సైనో-ఇండియన్ దేవుళ్ళు 😀
లక్షీదేవికి మూషికవాహనం 😀😀
మీ వ్యాసం బాగుందండి.
చైనా వస్తువుల నిషేధం గురించి ఓ భిన్నాభిప్రాయం నా దృష్టికి వచ్చినది ఇక్కడ వ్యాఖ్యగా పెడుతున్నాను చదవగలరు.
————
WhatsApp message posted here as received.👎
————
This is an article by Nallamothu Sridhar, a Technology Expert.
పాకిస్థాన్ మీద కోపంతో చైనా మీద అలగడమేంటిరా ………?
ఎవరితోనైనా గొడవొస్తే.. ఇక వాళ్ల వస్తువులు వద్దనే కామెడీ చిన్న పిల్లల మనస్థత్వం మన మేధావులకి ఎప్పుడుకు పోతుందో!
పాకిస్థాన్‌తో సమస్య వస్తే చైనా ఫోన్లు మనం కొనొద్దు అంటూ.. మూతి బిగదీసుకుని కూర్చుంటున్నారు కొంతమంది. మరి ఇండియా ఫోన్లు కొందామా? ఇండియా ఫోన్లంటే ఏంటి? Celkon, Micromaxలేనా? వాటికి ఇండియాలో ప్రతీ విడి భాగం తయారు చేసుకునే యూనిట్లు ఉన్నాయా? ఒక్కసారి వాటి ఫ్యాక్టరీలకు వెళితే మామూలు సెల్‌ఫోన్ టెక్నీషియన్లని అపాయింట్ చేసుకుని చైనా నుండి దిగుమతి చేసుకున్న విడి భాగాలను అసెంబుల్ చేసి వాటి మీద తమ లోగో వేసుకుని అమ్ముకుంటూ ఉంటాయి. ఇదా భారతీయ బ్రాండ్లని ఎంకరేజ్ చెయ్యడమంటే? సో విడి భాగాలు ఇండియాలో లేవు కాబట్టి ఆ ఫోన్లు కూడా కొనకుండా ఉండగలమా?
అలాగే చాలామందికి iPhone అంటే క్రేజ్. అది చైనాలో తయారవుతుందని తెలిసీ ఎగబడి కొంటారు? మరి చైనాని దెబ్బ తీయాలంటే కొనకుండా ఉండాలి కదా?
ఆ మధ్య కర్నాటకకి తమిళనాడుకి గొడవొస్తే తమిళనాడు వాళ్లు మాకు కర్నాటక పాలు ఇకపై వద్దు అని ఫోజులు కొట్టారు? ఎన్ని రోజులు అలా ఫోజులు కొడతారు. దాన్ని అమాయకత్వమనాలా, మూర్ఖత్వమనాలా?
వ్యాపారాలు వేరు, కన్యూమర్ మార్కెట్ వేరు, దౌత్యపరమైన విధానాలు, ఇబ్బందులు వేరు. అంతకుముందు కొరియా ఫోన్లని కొనొద్దని కొంతకాలం చావగొట్టారు జనాలు.. అంటే శాంసంగ్ కొనొద్దని! మళ్లీ అదే జనాలు చాటుగా శాంసంగ్ ఫోన్లు కొంటూనే ఉంటారు. ఫేస్బుక్కుల్లో నీతులు వల్లించడానికీ, తమకేదో ప్రత్యేకంగా దేశ భక్తి ఉన్నట్లు చాటుకోవడానికీ తప్పించి ఇలాంటి మూర్ఖపు మాటలు ఎందుకూ పనికిరావు.
ఆర్థిక వ్యవస్థ ఎంత సరళీకృతంగా ఉంటే అంత మార్కెట్లు బాగుంటాయి, వినియోగదారులూ, వ్యాపార సంస్థలూ బాగుంటాయి. ఆ మధ్య చాలామంది ఇలాగే హడావుడి చేశారు.. అమెజాన్‌లో ఓ అమ్మకందారుడు అండర్వేర్ మీద వినాయకుడి బొమ్మ వేశారనీ, ఇక అమెజాన్‌లో కొనమనీ గొడవ చేశారు? మరి అదే జనాలు ఆ తర్వాత అమెజాన్‌లో కొనకుండా ఉన్నారా? కోపం వస్తే నాకు అన్నం వద్దని అలిగినంత కామెడీగా ఉంటాయి ఇలాంటి అభిప్రాయాలు.
వేరే దేశాల, వేరే ప్రాంతాల వస్తువులు, సేవలు వద్దనుకుంటే ఉన్న చోటినే పది రోజుల్లో చచ్చిపోతాం. ఇది మార్కెట్ వ్యవస్థ. అన్నీ వాడాల్సిందే, అన్నీ వాడితేనే రోజు గడుస్తుంది. ఇది చదివైనా కొంతమంది మూర్ఖత్వం వదులుతారని ఆశిస్తూ..
చైనా వస్తువులు, అమెరికా వస్తువులు వద్దనుకుంటే అక్కడ ఉన్న మన బంధువుల్ని తరిమి కొడతారు, ఐ మీన్ ఇండియా వాళ్లు మా దగ్గర మా ఉపాధి కొల్లగొడుతూ ఎందుకు ఉండాలి అని పంపించేస్తారు. వాటికీ సిద్ధమేనా? దౌత్యపరమైన ఇబ్బందుల్ని సామాన్య ప్రజలకు ఆపాదించడం ఎప్పుడూ పద్దతే కాదు. ఇలా సంకుచితంగా ఆలోచిస్తే కయ్యానికి కాలు దువ్వినట్లు అవుతుంది.
ఇంత బలమైన దేశభక్తే ఉందనుకుందాం.. మరి చైనా కంపెనీలు ఇండియాలో ఫోన్లు తయారీ యూనిట్లు పెట్టడానికి మోదీ, చంద్రబాబు, KCRలు ఒప్పందాలు కుదుర్చుకుంటుంటే, తరచూ చైనా పర్యటించి పెట్టుబడిదారుల్ని ఆకర్షిస్తుంటే మన నోళ్లేమైపోతాయి? ఏం మనమేమైనా తీసిపోయామా? మన వాళ్లే పెట్టాలి అని ధర్నాలు చెయ్యొచ్చు కదా. భీష్మించుకుని కూర్చోవచ్చు కదా!
చివరిగా ఒక్క మాట చైనా ఉత్పత్తులు వద్దని ఓనాలుగు రోజులు గిరి గీసుకు కూర్చున్నంత మాత్రాన భారత ఆర్థిక వ్యవస్థ ఉన్న ఫళంగా బలంగా మారిపోదు. భారతదేశం ఆర్థికంగా బలపడాలంటే ఏం కావాలో మరో ఆర్టికల్‌లో వివరంగా రాస్తాను. నాకేం తెలుసు ఇవన్నీ అనుకోవచ్చు, నేను చదువుకున్నది ఎకానమీ, కాస్ట్ అకౌంటెన్సీ, ఆ తర్వాతే టెక్నాలజీ రంగంలోకి వచ్చాను.
– నల్లమోతు శ్రీధర్
————
LikeLike
థాంక్యూ అండి _/\_
శ్రీధర్‌గారి అనాలిసిస్ బాగుంది. అయితే ఒక్క పాయింట్. మనమేం చైనా వస్తువుల్ని బాన్ చెయ్యట్లేదు కదా. వాళ్ళు మార్కెట్ చేస్తారు, కొనడం కొనకపోడం మనిష్టం. ఫోన్స్లాంటి టెక్నాలజీ గూడ్స్ సంగతెలా వున్నా దేవుళ్ళబొమ్మల్లాంటివి- మోడీ చెప్పినా, చెప్పకపోయినా – మనంతట మనం కొనకపోవడం కరెక్టేమో. కనీసం దేవుడిబొమ్మలకైనా క్వాలిటీ చూడాలి కదా. పర్సు కూడా అనుమతించాలనుకోండి.
//ఎవరితోనైనా గొడవొస్తే.. ఇక వాళ్ల వస్తువులు వద్దనే కామెడీ…//
అందులో కొంత diplomatic arm twisting, కొంత ప్రీ-ఎలక్షన్ పేట్రియాటిజమూను. జనం మరీ సీరియస్‌గా తీసుకుని రెచ్చిపోనవసరంలేదు కానీ రెచ్చిపోతారు. కొంత వేడి పుట్టిస్తే చైనాతో మన bargaining power కొంత పెరుగుతుందనేది ప్రభుత్వపు స్ట్రాటజీ అనుకోవచ్చు. రెండుమూడేళ్ళ క్రితం అనుకుంటా. చైనా జపాన్ మధ్య ఏదో వివాదం వస్తే చైనీస్, జపాన్ హైకమిషన్ ఆఫీసుల మీద దాడి చేసి గొడవ చేసారు. జపాన్ ఒక మెట్టు దిగింది.
LikeLike
మీ విశ్లేషణా బాగుంది YVRగారూ. మీరన్నట్లు భారతప్రభుత్వం యొక్క strategy అనిపిస్తోంది. పైగా వాళ్ళ సరుకుల అమ్మకాలు భారతదేశంలో గణనీయంగా తగ్గితే ఇదంతా నీ వల్లే నంటూ చైనా పాకిస్ధాన్‌ని తగ్గమనే అవకాశాలు కూడా ఉండచ్చు. Money talks అనే నానుడి లాగా.
శ్రీధర్ గారి అనాలిసిస్ బాగానే ఉంది గానీ తను చెప్పిన మొదటి వాక్యంతో నేనీకభివించలేను. శత్రువు మిత్రుడు కూడా శత్రువే అంటారు కదా పెద్దలు.
LikeLike
నిజమేనండీ. చైనా బొమ్మలు కళా కాంతి లేకుండా ఉంటున్నాయి. రిటర్న్ గిఫ్ట్స్ కి కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు ఇస్తే బావుంటుంది.
LikeLike
థాంక్యూ అండి 🙏
LikeLike