కావేరి🔥వాటర్‌వార్💣>>కమల్‌హాసన్‌ మిస్సైన రెండు పాయింట్స్ >🔎(1)భాషనేర్చిన🐒కోతులు🐒 🔎(2)వాటర్లో వున్న వాటా&వార్‌ 🔎


ఇండియాలో జలయజ్ఞాలే కానీ జలయుద్ధాలు(వాటర్ వార్స్) జరుగుతాయా?అని ఇండియాలో ఎవరూ కొశ్చన్ చెయ్యరు. ఆశ్చర్యం అసలే పడరు. మనకి మునిసిపాలిటీ టాప్స్ దగ్గర జరిగే బిందెయుద్ధాలు తెలుసు. కొన్ని కులాలకి దాహానిక్కూడా నీళ్ళు దొరకని (దొరకనివ్వని) పరిస్థితుల్లో నీటి పేరు మీద జరిగిన కులపోరాటాలూ తెలుసు. అందువల్ల అడపాదడపా కర్నాటక, తమిళనాడు మధ్య జరిగే కావేరీజలాలపై వివాదాలు, వాటితోపాటు జరిగే విధ్వంసాలూ పెద్ద న్యూస్‌లా అనిపించవు, మేధావివర్గం అని స్టాంప్ పడిన వాళ్లకి తప్ప. మేధావివర్గంవాళ్ళలా గడ్డాలు పెంచి, జీన్స్‌పాంట్ మీద లాల్చీ, మెళ్ళో ఒక సంచీ వేసుకుని తిరక్కపోయినా కమల్‌హాసన్ మేధావివర్గంలోకే వస్తాడు. అతని ఐడియాలూ, లైఫ్ స్టైలూ అందరికీ నచ్చవు కానీ అందరికీ నచ్చడానికి పాట్లుపడేవాడు మేధావెలా ఔతాడు? అవ్వడు. అతను మేధావి అనడానికి అతని మినిమం క్వాలిఫికేషన్ జనానికి పాకేజ్ మసాలా సినిమాలు చూపించి డబ్బు దండుకోవాలనే మెంటాలిటీ లేకపోవడమే. సో, కమల్ ఈజ్ ఎ మేధావి. అందుకే కావేరి వాటర్ వార్స్ గురించి స్పందించాడు. వానరాల స్థాయి నుంచి చాలా దూరం వచ్చేశారు కాబట్టే జనం తన మార్కు సినిమాల్ని ఆదరిస్తున్నారనుకుని “Cauvery had flown even when we were monkeys without languages; will flow even after our times,” అనేశాడు. నో డౌట్ మనుషులు వానరాల నుంచి చాలా దూరం వచ్చేశారు కానీ కొంచెం అబ్జర్వ్ చేస్తే అతనో పాయింట్ మిస్సయ్యాడేమో అనిపిస్తుంది. ఎలాగా అంటే –

 వాటర్ పదంలో వాటా, వార్ రెండూ వున్నాయి. వానరం, వాటర్, వాటా, వార్ అన్నిటికీ కామన్ లెటర్ “వా” లేక “వ”. వానరుడి తోక, అదే “వా” ఊడిపోయాకే నరుడవతరించాడు. వానరానికి ఒకప్పుడున్న “వా” ఎలా ఊడిపోయింది? సొంతలాభం కొంత మానుకుని సమూహాలుగా, సంఘాలుగా మనుగడ సాగించడం మొదలయ్యాక, వాటాల్లో న్యాయానికి, వార్‌‌ అంటే విముఖతకి అలవాటు పడ్డాకే. వానరుడు నరుడుగా మారడం ఆ రెండు మార్పులూ లేకుండా అయ్యేదా? బట్, ఇప్పుడీ బిజినెస్ యుగంలో, “యుగధర్మం” 😉 ప్రకారం నరులకి వాటాల మీద యావ పెరిగిన కొద్దీ,  ప్రతిదాంట్లోనూ  “నాకేంటంట?” అన్న వెతుకులాట విజృంభిస్తున్న కొద్దీ ఎప్పుడో  వూడిన తోక, “వా” మళ్ళీ వచ్చి తగులుకుంటోంది. పవర్లో, సంపదలో, వోట్లలో  పెద్దపెద్ద వాటాల కోసం  అవసరం లేకపోయినా వార్** చెయ్యడానికి నరుడు తనలో వున్న వానరుణ్ణి తట్టిలేపుతాడు. వోట్లు అంటే వెలిగింది – వానరం,వాటర్,వాటా,వార్‌లతో “వ” అక్షరాన్ని వోటుకూడా పంచుకుంటోంది. ఇవన్నీ ఒకచోట  చేరితే  ఏమౌతుంది? వోట్లలో వాటాల కోసం వానరుల్లాంటి పొలిటీషియన్సు + వాళ్ళ ఫాలోవర్సూ వాటర్ వార్స్ సృష్టిస్తారు. (**సింధుజలాల వాటాల గురించి ఇండియా – పాక్‌ల మధ్య జరగబోయే రాజకీయాల బేసిస్, లెక్కలు వేరు) 

సో, కమల్ మిస్సైన పాయింట్ వానరాలు నరులుగా మారేక్రమంలో కొన్ని వానరాలు భాష నేర్చేసుకున్నాయనేది. అవి వేషభాషల్లో అచ్చు నరుల్లాగే అన్ని ఫాషన్లూ ఫాలో అయిపోతాయి కానీ నరుడికి వానరుడికి తేడా చూపించే “వా”ని మాత్రం అలాగే దాచిపెట్టుకుంటాయి. కావేరీ జలాల సమస్య ఒక్కటే కాదు, దేశంలో ఎన్ని రకాల సమస్యలుంటే అన్ని చోట్ల “వా” తగిలించుకున్న నరులు ప్రత్యక్షం అవ్వగలరు. నూటిరవైకోట్ల జనాభావున్న దేశంలో వివాదాలు లేకుండా ఎలా ఉంటాయ్? వాటి కోసమే రకరకాల ట్రిబ్యునల్స్, వాటర్ కమిషన్స్, ఎట్సెట్రా వున్నాయి. కానీ వాటితోపాటు విధ్వంసం ఎందుకు? వాటర్ =వాటా (OR) వార్ అనే ఫ్రేములో ఇరుక్కున్న “వా”నరులుండడం వల్ల.

వందేళ్ళ పైనుంచే ప్రయత్నిస్తున్నా వాటాలు పంచుకోడం చేతకాక తమిళనాడు కర్ణాటక మాటి మాటికీ కావేరీ వాటర్ వార్స్‌కి దిగుతూవుంటాయ్. ఆస్ట్రేలియా, స్పెయిన్‌లలో కూడా ప్రాంతాల మధ్య నీటి పంపిణీకి ఇంచుమించు ఇలాంటి సమస్యలే ఉన్నాయి(ట) అయినా అక్కడ విధ్వంసాలు జరగవు(ట). ఎందుకు? నీటికరువు రాబోతున్నట్టు పసిగట్టగానే గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ప్రజలని ప్రిపేర్ చెయ్యడంవల్ల, సరైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చెయ్యడంవల్ల. సకలప్రాణులకీ ప్రాణాధారమైన సహజవనరులతో అయితే వ్యాపారం లేకపోతే రాజకీయం తప్ప మరో మార్గం వెతికే ఆలోచన, ఆసక్తి లేనప్పుడు నదుల నీళ్ళు పంచుకోవాల్సిన అవసరం ఎక్కడుంటే అక్కడ వాటర్ వార్స్ తప్పవు. అందుకే వాటర్ వార్లు మునిసిపల్ టాప్స్ దగ్గర జరిగే బిందెల యుద్ధాలస్థాయి నుంచీ రాష్ట్రాలు, దేశాల మధ్య బాంబుల యుద్ధాల లెవెల్‌కి ఎదిగాయి, ఎదుగుతున్నాయి.   

వన్ థింగ్, మనం గమనించని, rather గమనించినా సీరియస్‌గా పట్టించుకోని సంగతి ఒకటుంది – ఎందుకోగానీ నీటిఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో, అవి స్టేట్ బోర్డర్స్ అయ్యుండి, పైనుంచి నీళ్ళు రావాల్సిన ఎరియాలైతే తప్ప, జనంలో – ఉద్యమాలు, విద్వంసకాండల సంగతి దేవుడెరుగు – ప్రదర్శనలు, ప్రొటెస్టులు కూడా గట్టిగా వుండవు. ఒకవేళ వున్నా అవి మొక్కుబడివ్యవహారాలే. సమస్య తీరేవరకూ కంటిన్యూ అవ్వవు. స్టేట్స్ మధ్య పంచుకునే వ్యవహారం అయితే మాత్రం ఎక్కడలేని చైతన్యం. ఎందుకిలా? బ్లేమ్ చెయ్యడానికి బోర్డర్ అవతల ఒక బూచి రెండుపక్కలవాళ్ళకీ కన్వీనియెంట్‌గా దొరకడం వలనా? చివర “న్యం” కామన్‌గా వుందికదాని పాపం దౌర్జన్యం, చైతన్యం ఒకటే అనుకుంటార్లావుంది ఈ భాష నేర్చిన🐒🐒🐒లు. 

సమస్య అందరిదీ అనుకుని, ఇరువైపులవాళ్ళూ కూచుని మాట్లాడుకుని క్రియేటివ్ సొల్యూషన్స్ కనిపెట్టలేని చేతకానితనం+దాన్ని కప్పిపుచ్చుకునే ఆత్మవంచన = దౌర్జన్యకాండ అనుకోవాలా? కొంపదీసి ఇదే నిజం కాదుకదా?

🙏😃🙏

10 thoughts on “కావేరి🔥వాటర్‌వార్💣>>కమల్‌హాసన్‌ మిస్సైన రెండు పాయింట్స్ >🔎(1)భాషనేర్చిన🐒కోతులు🐒 🔎(2)వాటర్లో వున్న వాటా&వార్‌ 🔎

 1. విన్నకోట నరసింహారావు

  నేనంటున్నానని కాదు గానీ మనది దారి తప్పిన దేశం అనిపించడం లేదూ? ప్రతి విషయాన్నీ గోరంతలు కొండంతలు చేసి రాజకీయ లబ్ధి పిండుకోవాలనే యావ, అధికార దాహం బాగా పెరిగిపోయాయి. వీటికి తోడు విలువల పతనం. మనమింతే 🙁 (We are like this only అని ఒకప్పుడు టీవీలో ఓ ప్రకటన వస్తుండేది, మీకు గుర్తుండే ఉంటుంది. అలాగన్నమాట).

  అవునూ “నో.వా.చే.రా” అంటే ఏమిటని కోరితే “ప్చ్” అని పెదవి విరుస్తారేమిటండి? 🙂

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   ప్రజాస్వామ్య రాజకీయాల్ని ఎలా హాండిల్ చెయ్యాలో అర్ధం చేసుకునేలోగా రాచరికం నుంచి డెమోమోక్రసీకి మారిపోవడం ఒక పెద్ద కారణం అనిపిస్తుంది. Commerce overtaking values ఇంకొకటి. మీ స్పందనకి నెనరులు _/\_
   నో.వా.చే.రా కి మీనింగ్ ఒక టపాలో వివరిద్దామని ప్రయత్నం. కానీ టైము దొరకడం లేదు. అందుకే ఈ “ప్చ్” 🙂

   Like

   Reply
  2. kastephale

   నో.వా.చే.రా గురించి నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నారా? 🙂

   Like

   Reply
   1. విన్నకోట నరసింహారావు

    ఏదో భయపెడుతున్నట్లుగా ఉందే 😳? అయినా ఫరవాలేదు చెప్పండి శర్మ గారూ, నే భయపడే రకాన్ని కాదు 🙂.

    Like

    Reply
 2. kastephale

  వారు చెబుతారేమోనని చూస్తున్నా లేకపోతే నే చెబుతా! 🙂 ఇదేం బ్రహ్మవిద్య కాదండి! 🙂 డి కోడ్ చేయలేనిదీ కాదు 🙂

  Like

  Reply
 3. విన్నకోట నరసింహారావు

  “ప్రజాస్వామ్య రాజకీయాల్ని ఎలా హాండిల్ చెయ్యాలో అర్ధం చేసుకునేలోగా రాచరికం నుంచి డెమోమోక్రసీకి మారిపోవడం ఒక పెద్ద కారణం అనిపిస్తుంది.” అన్న మీ కామెంట్ చూస్తే గుర్తొచ్చి వ్రాస్తున్నాను.
  ———————
  భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడం గురించి 1947 లో బ్రిటిష్ పార్లమెన్‌ట్ లో చర్చ జరుగుతున్నప్పుడు విన్‌స్టన్ చర్చిల్ గారు ఇలా అన్నారని అంటారు :-

  “”Power will go to the hands of rascals, rogues, freebooters; all Indian leaders will be of low calibre & men of straw. They will have sweet tongues & silly hearts. They will fight amongst themselves for power & India will be lost in political squabbles. A day would come when even air & water would be taxed in India.”

  (టెక్నాలజీ పెరగటానికి ముందే, సోషల్ మీడియా పుట్టక ముందే, 40 / 45 ఏళ్ళ క్రితమే ఓ పుస్తకంలో చదివాను ఈ వాక్యాలు.)
  చర్చిల్ గారు అసలు ఈ మాటలు అననే అనలేదనేవారూ ఉన్నారు. ఏమయినప్పటికీ ఆయన అన్నాడో అనలేదో గానీ అటువంటి పరిస్ధితి నిజమని నిరూపించడానికి మాత్రం భారతీయులు చాలా కష్టపడ్డారని ఎక్కడో ఓ కామెంట్ కూడా చదివాను.
  —————-
  అన్నట్లు నో.వా.చే.రా. సంగతేం చేసారు? 🙂

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   కొంతకాలం సిద్ధాంతపరమైన కుమ్ములాట, ఇప్పుడు సిద్ధాంతాలన్నీపోయి, లేబుల్స్ మిగిలాయి, కుమ్ములాట మిగిలింది.

   సర్, నో.వా.చే.రా త్వరలో విడుదల. ఈ లోపుగా మీ ఆసక్తివల్ల నో.వా.చే.రా జిలేబీగారి బ్లాగులో, ఒక కంద పద్యంలో భాగమై పోయింది. థాంక్యూ.

   Like

   Reply
   1. విన్నకోట నరసింహారావు

    కాదేదీ జిలేబీగారి పద్యానికనర్హం ! 🙄

    Like

    Reply

Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s