గాంధీజీ To మోడీజీ, సర్జికల్ స్ట్రైక్స్ అనేవి నిరంతర ప్రక్రియ (వెంకయ్యనాయుడుగారి vocabularyలో, ;-) )


(1)సర్జికల్ స్ట్రైక్స్ = 💪ఆపరేషన్ 56″చెస్ట్ 💪+ “నేనెటో చూస్తూండగా నువ్వాణ్ణేసెయ్యెహే!” 😝 = ఇన్ ద ఫ్రంట్ దేర్ ఈజ్ క్రొకోడైల్ ఫెస్టివల్(ఫర్ పాకిస్తాన్ 😉)   (2)పురాణాలు, ఇతిహాసాల్లో 🏹సర్జికల్ స్ట్రైకులు🚀, 🔊సర్జికల్ లీకులు 🗡(శివుడినుంచి శల్యుడి వరకూ)

(3)

1937 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో సుభాష్ బోస్ పట్టాభి సీతారామయ్యని ఓడించాడు. బోస్ ప్రెసిడెంట్ అవడం ఇష్టంలేని గాంధీజీ, “పట్టాభి’స్ డిఫీట్ ఈజ్ మై డిఫీట్,” అంటూ హిస్టారికల్లీ ఫేమస్ పోలరైజింగ్ స్టేట్‌మెంట్ ఒకటి పడెయ్యడంతో ఇక పార్టీలో తనమాటెవరు వింటారని బోస్ రిజైన్ చేసేసాడు(ట). దీన్నిబట్టీ గాంధీయన్ సర్జికల్ స్ట్రైక్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. ఈ పోస్ట్స్ రాస్తున్నది ఫన్ కోసమే అయినా ఒక విషాదాన్ని ఇక్కడ చేర్చక తప్పదు. గాడ్సే గాంధీజీని హత్య చెయ్యాలనుకోవడం, చెయ్యడం అతని దృష్టిలో సర్జికల్ స్ట్రైకే. ఈ దేశంలో జరిగిన అత్యంత ట్రాజికల్ సర్జికల్ స్ట్రైకది. అలాగే స్వాతంత్రం కోసం సైనికమార్గం పట్టిన బోస్ డెత్ మిస్టరీని రాజకీయం చేసి వాడుకుంటున్నారు కదా, అదీ ట్రాజికల్ సర్జికల్ స్ట్రైకే.

కిందటి పోస్టులో దేవర్షి నారదుణ్ణి తల్చుకున్నాం. ఈ పోస్టులో భూలోకనారదుణ్ణి గుర్తుచేసుకోడం ధర్మం. దేవర్షి నారదుడి స్పెషలైజేషన్ కలహాలు పుట్టించడమైతే భూలోకనారదుడు పుల్లలు వెయ్యడం, పొగపెట్టడం అనే ప్రక్రియల్లో సిద్ధహస్తుడు. పాపభూయిష్టమైనటువంటి ఈ యొక్క కలియుగంలో నారదాంశతో పుట్టి  లోకకల్యాణం సాగిస్తున్నవారిలో డాక్టర్ సుబ్రమణ్యస్వామివారొకరు. ఈ మధ్య ఆయన నిర్వహించిన “లోకకల్యాణం”, రఘురాంరాజన్‌ తన పదవికి తనే ఎసరు పెట్టుకునేదాకా పొగపెట్టడం. మిలట్రీభాషలో సర్జికల్ స్ట్రైక్ అనే ఈ ప్రక్రియని ఈ సందర్భంలో సర్జికల్ స్మోక్(వ్యూహాత్మక పొగపెట్టుట) అనొచ్చు. పవన్‌కళ్యాణ్  ప్రత్యేకహోదా డిమాండ్‌తో ఆంధ్రుల ఆత్మగౌరవసభ నిర్వహించడం కూడా ఒక విధమైన సర్జికల్ స్ట్రైకే. అనుకోవచ్చు. దానివల్లే ప్రస్తుతానికి అరుణ్ ఝూట్లీ జైట్లీగారు ప్రత్యేకపాకేజీ అనౌన్స్ చేశారని చాలామంది అనుకుంటున్నారని విన్నాం. పాకేజీలో ఏముందనేది వేరే విషయం. ఈ పాకేజీవల్ల ఏం ఒరుగుతుందో చూసి అప్పుడు పీకే మళ్ళీ మరో సర్జికల్ స్ట్రైక్ పీకవచ్చు. ఇక్కడ గమనించాల్సిన పాయింటేంటంటే పవన్‌కళ్యాణ్ హోదాసాధనలో మరీ రెచ్చిపోయే అవకాశంలేకుండా చెయ్యడానికి ఉద్దేశించిన సర్జికల్ స్ట్రైకే ప్రత్యెకపాకేజీ అనౌన్స్‌మెంట్ అంటున్న స్కూల్ ఆఫ్ థాట్ ఒకటుందని.

ఎన్టీఆర్‌ని పదవిలోంచి దింపిన రాజకీయప్రక్రియని ప్రజాస్వామ్యపరిరక్షణ అని కొందరంటే, వెన్నుపోటు అని ముద్దుగా పిల్చుకుంటారు ఇంకొందరు. ఏ పేరైతే ఏంటి లక్ష్మీపార్వతిగారి పాలిటమాత్రం అదో సర్జికల్ స్ట్రైక్ అయ్యికూచుంది.

2009, డిసెంబర్9న తెలంగాణా విభజన ప్రక్రియ మొదలైందని చిదంబరం చేసిన ప్రకటన సర్జికల్ స్ట్రైకే. కేసీఆర్‌ నిరాహారదీక్షతో హీరో ఐపోయి కొత్త స్టేట్ క్రెడిట్ అంతా ఆయన ఖాతాలో పడిపోతుందనే కంగారుతో కాంగ్రెస్‌పార్టీ విసిరిన సర్జికల్ స్ట్రైక్ అది అంటే కాదనగలమా? ఏపీ ప్రభుత్వం అర్జెంటుగా హైదరాబాద్‌నుంచి విజయవాడకి షిఫ్ట్ అవడం వెనుక కేసీఅర్‌‌గారు సంధించిన సర్జికల్ స్ట్రైకేదో ఉందని కొన్నాళ్ళు గుసగుసలు చెలరేగాయి.

ఉండవిల్లి అరుణ్‌కుమార్‌గారు విభజన కధలో “ఊహించి”న ఘట్టాలు విభజనబిల్లుని ఆడ్డుకునే ప్రయత్నాల్ని ఆపడానికి ప్రయోగించిన సర్జికల్ స్ట్రైక్స్ అంటే జైపాల్ రెడ్డిగారు ఒప్పుకోరుగానీ ఒప్పుకోకపోవడానికి సరిపోయే లాజిక్కు ఆంధ్రావాళ్ళకైతే కనిపించట్లేదుగదా? విభజన జరపడానికి వాడిన సర్జికల్ స్ట్రైక్స్ అవయితే అడ్డగోలు విభజనతో చుట్టుకున్న పాపానికి జైపాల్‌రెడ్డిగారిని బాధ్యుడిగా చేసి తమకంటిన పాపం కడుక్కోడానికి సోనియమ్మ & కో విసురుతున్న రివర్స్ సర్జికల్ స్ట్రైక్స్ ఈ విభజనకధలనే అనుమానంకూడా ఇప్పుడిప్పుడే బయల్దేరుతోంది.

75యేళ్ళు దాటిన నాయకులు పార్టీలో, ప్రభుత్వంలో క్రియాశీలపదవుల్లో కాకుండా పడక్కుర్చీల్లో కూచుని ఈగలుదోమలు విసురుకుంటూ పనిలోపనిగా అప్పుడప్పుడు రాజకీయఖండన-మండన-ముండనా*దులు చేస్తూవుండడమనే వుద్యోగానికి పరిమితం చేసెయ్యడం పార్టీలో నరేంద్రమోడీ – అమిత్‌షాల అంతర్గత సర్జికల్ స్ట్రైక్. (* పనిలేని పెద్దమనిషి ఒకాయన పిల్లి తల గొరిగినట్టు 🙂 ) 

మోడీగారు ఇంకా వెయ్యని, తప్పక వెయ్యాల్సిన సర్జికల్ స్ట్రోక్ ఒకటుంది. కేజ్రీవాల్‌కి, ఇంకొందరు అప్పోజిషన్ లీడర్లకి సర్జికల్ దాడులు చేసిన ఎవిడెన్స్ కావాలట. ఇలా ఎవిడెన్స్ అడుగుతున్నవాళ్ళందర్నీ నెక్స్ట్ టైమ్ దాడులు చేసినప్పుడు ఒక్కొక్కళ్ళనీ ఒక్కొక్క ఎటాక్ గ్రూప్‌‌కి ఎటాచ్ చేస్తాం రమ్మని ప్రభుత్వం ఆహ్వానించాలి. వాళ్ళ డౌట్లూ తీరతాయి, వాళ్ళ దేశభక్తికి ప్రజల్లో వాళ్లకి గౌరవమూ వెయ్యిరెట్లు పెరుగుతుంది. మరోపక్క వాళ్ళకి సర్జికల్ స్ట్రైక్‌ రుచి అనుభవంలోకి వస్తుంది.‌ ఓహ్! వాటే కోయిన్సిడెన్స్!! 🙂 ఇది రాస్తుండగానే ఈనాడు, ఇదీ సంగతిలో ఈ కార్టూన్ పడింది – 

idee-sangati

pic courtesy: Eenadu 

(Note: రాయడం అయ్యేప్పటికి కేజ్రీవాల్ తన వ్యాఖ్యలు పొరపాటని ఒప్పుకున్నట్టు న్యూస్ వచ్చింది)

ఏదైనా భయంకర నేరం, లేక ఘోరం జరిగితే ఒకట్రెండు రోజుల గాప్‌లో ఎవరో ఒక సినీడైరెక్టర్ ఆ నేరం ఆధారంగా సినిమా తీసేస్తున్నానంటూ అనౌన్స్ చేసేస్తాడు. చూడ్డానికి, వినడానికి శవాలమీద పైసలు ఏరుకునే వ్యవహారంలా అనిపించే ఇలాంటి అనౌన్స్‌మెంట్స్ నిజానికి సర్జికల్ స్ట్రైకులే. ఇంకొకడెవడో ఆ సినిమా తియ్యకుండా. బై ద వే, సినిమాల టాపిక్ వస్తే గుర్తొచ్చింది, కరుడుగట్టిన తీవ్రవాదులుకూడా మామూలు మనుషుల్లా ఆలోచించగలరని, చిస్తారని జైషే మొహమ్మద్ లీడరు మసూద్ అజర్ మాటల్లో బైటపడింది. ఉరీ ఎటాక్స్ నేపధ్యంలో బాలీవుడ్ హీరోలపై దారుణమైన సర్జికల్ వెటకారాలకి పాల్పడ్డాడు. (తెలుగు/తమిళ్ మసాలా పాకేజీ సినిమాలు చూసుండడు కానీ, చూసివుంటే వాడికీ ఛాన్స్ వుండేది కాదు. టాలీ/కోలీవుడ్ హీరోల కంటిచూపులకో, తొడచరుపులకో ఎప్పుడో ఎన్‌కౌంటర్ ఐపోయేవాడు.) వెటకారాలకి కినిసారేమో మొన్నటి సర్జికల్ దాడుల్ని సినిమాగా తీస్తానని ఏ ఒక్క బాలీవుడ్ ప్రముఖుడూ అనౌన్స్ చెయ్యలేదు. కన్సిడరబుల్ పార్ట్ ఆఫ్ ది పాపులేషన్ సినిమాలు తీసి, వాటిలో వేసి, వాటిని చూసి బతుకుతున్న దేశంలో ఈ పరిస్థితి చాలా శోచనీయం. ఇందులో మార్పు రావాలి. ఇప్పటికైనా మించిపోయిందిలేదు బాలీవుడ్ అర్జెంటుగా సినిమా అనౌన్స్ చెయ్యాలి. బాలీవుడ్‌వాళ్ళు రజనీకాంత్‌‌ని హీరోగాపెట్టి మొత్తం పాకిస్తాన్ని ఈడ్చుకొచ్చి ఇండియాలో, అదీ తమిళనాడులో కలిపేసినట్టు, అక్కడున్న టెర్రరిస్టులు, ఐఎస్‌ఐ, పాకిస్తాన్ ఆర్మీ – అందర్లో రజనీకాంత్ దెబ్బకి మార్పు వచ్చేసి, తక్షణం లుంగీల్లోకి మారిపోయి, తమిళసినిమాల్లో లుంగీడాన్సులు చేసే జూనియర్ ఆర్టిస్టులుగా జనజీవన స్రవంతిలో కలిసిపోయినట్టు, మసూద్ అజర్‌ని రజనీకాంత్ కట్టిపడేసి జీవితాంతం నాన్-స్టాప్‌గా అరవ & తెలుగు మాస్ మసాలా సినిమాలు చూసే శిక్ష వేసినట్టు సినిమా తీసి కౌంటర్-సర్జికల్ వెటకారం ఎటాక్ చేస్తేగానీ మసూద్ అజర్‌కి తగిన శాస్తి జరగదు.

(ఇట్ మే బి కంటిన్యూడ్…)