పురాణాలు, ఇతిహాసాల్లో 🏹సర్జికల్ స్ట్రైకులు🚀, 🔊సర్జికల్ లీకులు 🗡(శివుడినుంచి శల్యుడి వరకూ)


(1)

సర్జికల్ స్ట్రైక్స్ = 💪ఆపరేషన్ 56″చెస్ట్ 💪+ “నేనెటో చూస్తూండగా నువ్వాణ్ణేసెయ్యెహే!” 😝 = ఇన్ ద ఫ్రంట్ దేర్ ఈజ్ క్రొకోడైల్ ఫెస్టివల్(ఫర్ పాకిస్తాన్ 😉)

(2)

సర్జికల్ స్ట్రైకులు అనేటటువంటివి మనకేమాత్రం కొత్త కాదు. ఇవాళ మోడీజీ కనిపెట్టినవి కాదు. బట్, ఇందిరాగాంధీ తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేసే ఛాన్సు, అందుక్కావాల్సిన ధైర్యం ఈయనకే వచ్చాయి. పురాణయుగాల నుంచీ ఇప్పటివరకూ అవి లేకుండా మార్పు రాలేదు, రాదు. మనుషులకి మార్పుకి సరిపడదు కదా? సో, సర్జికల్ స్ట్రైక్స్ పరిస్థితుల్లో మార్పును తీసుకొచ్చే సాధనాలుగా చూడాలన్నమాట. సరే, విషయంలోకొస్తే – అనకూడదుగానీ, మన హిందూదేవుళ్లలో ముగ్గురు గొప్ప పవర్‌ఫుల్ దేవుళ్ళ అవతరణకి సర్జికల్ స్ట్రైక్స్ కారణం. వినాయకుడిని ఏనుగుతలవాడిగా మార్చిన శూల ప్రహారం సర్జికల్ స్ట్రైక్ కాదా? పార్వతిని మూడుకళ్ళలో ఒక్కటీ ఎత్తి చూడకుండా, మూడుకళ్ళూ+ముక్కూ మూసుకుని తపస్సు చేసుకుంటున్న ముక్కంటి మీద మన్మధుడి పుష్పబాణఘాతాలు సృష్టిలోనే మొదటి సర్జికల్ స్ట్రైక్స్. ఇంద్రుడు-మన్మధుడు కలిసి చేసిన సర్జికల్ స్ట్రైకులకి లెక్కలేదు. కావాలంటే విశ్వామిత్రుడు సాక్ష్యం ఇస్తాడు. ఇంద్రుడు వ్యూహాత్మకంగా, ముందే ప్లాన్ చేసుకుని కొట్టిన దెబ్బ కాకపోయినా బాలహనుమంతులవారు సూర్యుణ్ణి మింగబోయినప్పుడు ఆయన వజ్రాయుధంతో కొట్టిన దెబ్బ వల్లనే హనుమంతుడికి అన్ని శక్తులూ, వరాలూ దక్కి, రామకార్యానికి ఉపయోగపడ్డాయి. కనక అదీ సర్జికల్ స్ట్రైక్‌కి ఇంచుమించు సరిసాటి అనుకోవచ్చు. రామపట్టాభిషేకం అనౌన్స్ కాగానే కైకేయి ఎప్పట్నుంచో ఆన్-హోల్డ్‌లో పెట్టిన రెండువరాలూ అప్పటికప్పుడు కోరుకోవడం ఇంట్రా-ఫామిలీ సర్జికల్ స్ట్రైక్. హనుమంతులవారు సుందరకాండ స్క్రిప్ట్ ప్రకారం లంకలో చేసిన విధ్వంసకాండంతా “చూసిరమ్మంటే కాల్చిరావడం” అనే సర్జికల్ స్ట్రైక్ ఆపరేషన్, రాములవారి ప్లాన్ ప్రకారం జరిగింది. వినాయకుడి హెడ్ ట్రాన్స్‌ప్లాంట్‌లాగా సర్జికల్ స్ట్రైక్ అనేది లిటరల్లీ సర్జికల్ అయిన సందర్భాలున్నాయ్. శూర్పణఖ ముక్కూ చెవులూ కోసి లక్ష్మణస్వామి, బలి మూడడుగుల నేల దానం చేస్తుండగా, అతని కమండలంలోంచి నీళ్ళు రాకుండా అడ్డుపడిన శుక్రుడి కంటిని దర్భతో పొడిచి వామనుడు, తన వక్షస్థలంపై తన్నిన భృగుమహర్షి పాదంలో వుండే కన్నుని చిదిపి విష్ణువు చేసినవి లిటరల్లీ సర్జికల్ స్ట్రైక్స్. ఏకలవ్యుడి బొటనవేలు దక్షిణగా తీసుకుని ద్రోణాచార్యుడు చేసిన లిటరల్ సర్జికల్ స్ట్రైక్‌కి ప్రతిగా “అశ్వత్థామ హతః, కుంజరః”అని మీడియా ఇన్‌ఫర్మేషన్ని కాస్త వక్రీకరించి ధర్మజుడు ద్రోణుడిచేత అస్త్రసన్యాసం చేయించిన వైనం వెర్బల్ సర్జికల్ స్ట్రైకు, ఆ ఆవకాశం అందుకుని ద్రోణుడి తలనరికిన ధృష్టద్యుమ్నుడిది వయోలెంట్ సర్జికల్ స్ట్రైకు. క్షీరసాగరమధనం ఎపిసోడ్‌లో అమృతభాండంపై కన్నేసిన రాక్షసుల దగ్గరకి విష్ణువు మోహినిగా రావడం డైవర్షనరీ సర్జికల్ స్ట్రోక్. అదే టైములో కొంచెం ఆలస్యంగా, నిఘావిభాగం వైఫల్యంవల్ల సగమే సక్సెస్ అయిన సర్జికల్ స్ట్రైక్ ఒకటి కోవర్ట్‌లుగా దేవతల క్యూలో దూరి అమృతం రుచి చూసిన రాహుకేతువుల మీద జరిగింది. దాని ఫలితమే శ్రీకాళహస్తి ఆలయానికి రాహుకేతు పూజల రూపంలో పెరిగిన ఆదాయం. భారతయుద్ధానికి చాలా ముందుగానే జరాసంధుణ్ణి కృష్ణుడు చంపించడం, కర్ణుడి కవచకుండలాలు ఇంద్రుడు దానం పొందడం, బెల్టుషాపుల్లో శల్యుడికి మంచి ఆఫర్లిచ్చి దుర్యోధనుడు తనవైపు తిప్పుకోవటం, ధర్మరాజు ఆ శల్యుడి చేతనే కర్ణుడి మొరేల్ దెబ్బతీయించటం .. సర్జికల్ స్ట్రైకుల కిందకే వస్తాయి. అజ్ఞాతవాసంలో ఉన్న పాండవుల్ని కనిపెట్టడానికి దుర్యోధనుడు జీమూతమల్లుడిని దేశదేశాలూ పంపడం సర్జికల్ స్ట్రైక్ ఆపరేషనే. పాండవులకి అర్ధరాజ్యం ఇచ్చినట్టే ఇచ్చి లక్కఇంట్లో కాల్పించాలని ధృతరాష్ట్రుడి పర్మిషన్‌తో జరిగిన కోవర్ట్ ఆపరేషన్ ఒక సర్జికల్ స్ట్రైకైతే, విదురుడు ఆ సంగతి పాండవులకి చేరవెయ్యడం సర్జికల్ లీక్. అర్జునుణ్ణి బృహన్నలవైపొమ్మని ఊర్వశిచ్చిన శాపం, అది అజ్ఞాతవాసంలో పనికొచ్చేలా ఇంద్రులవారు క్రమబద్ధీకరించడం పాజిటివ్ సర్జికల్ స్ట్రైక్స్. మృతసంజీవని విద్య కోసం కచుడు, శుక్రుణ్ణి ఆశ్రయించడం, అది తెలిసి రాక్షసులు కచుణ్ణి చంపి కాల్చేయ్యడం దేవాసురుల మధ్య జరిగిన మ్యూచువల్ సర్జికల్ స్ట్రైక్స్. సరిగ్గా గుర్తులేవుకానీ, పురాణాల్లో ఇంద్రుడు చాలానే సర్జికల్ స్ట్రైకులు చేస్తాడు. దితి గర్భంలో వున్న ఒకానొక ఫ్యూచర్ రాక్షసపిండాన్ని(వృత్రాసురుడనుకుంటా) ఇంద్రుడు ముక్కలు చెయ్యడం వాటిలో ఒకటి. సర్జికల్ స్ట్రైక్ ఆపరేషన్స్ వల్ల అంతా మంచే జరుగుతుందన్న గారంటీ ఎక్కడా ఎప్పుడూ లేదు, ఒక్క పాకిస్తాన్ విషయంలో తప్ప ;-). ఆ విషయం దేవర్షి నారదులవారికి బాగా తెలుసు. హిరణ్యకశిపుడి భార్య లీలావతి గర్భంలో వున్న శిశువుని అంతం చెయ్యాలని ఇంద్రులవారు మొదలెట్టిన సర్జికల్ స్ట్రైక్‌ ఆపరేషన్ని నారదులవారు ఆపివుండకపోతే పరమభాగవతోత్తముడు ప్రహ్లాదుడుగానీ, ఆయన హీరోగావచ్చిన భక్తప్రహ్లాద సినిమా, అందులో ఎస్వీఆర్, రోజారమణిల నటనగానీ ఈ లోకానికి దక్కడం సాధ్యమయ్యేదా?

(to be contd.)

🙏😃🙏