సర్జికల్ స్ట్రైక్స్ = 💪ఆపరేషన్ 56″చెస్ట్ 💪+ “నేనెటో చూస్తూండగా నువ్వాణ్ణేసెయ్యెహే!” 😝 = ఇన్ ద ఫ్రంట్ దేర్ ఈజ్ క్రొకోడైల్ ఫెస్టివల్(ఫర్ పాకిస్తాన్ 😉)


కాశ్మీర్ ఇష్యూలో గేమ్-ఛేంజర్‌లాంటి మొన్నటి సర్జికల్ స్ట్రైక్స్ గురించి దేశమంతా అట్టుడికిపోతోంది. ఇంటర్నేషనల్ ఒపీనియన్ పాకిస్తాన్ని వేపుడు ముక్కల్లా వేయించేస్తోంది. బజరంగీ భాయ్‌జాన్, గౌతమిపుత్రశాతకర్ణి ఆల్రెడీ ఈ విషయంలో తమదైన శైలిలో స్టేట్‌మెంట్స్ ఇచ్చేశారు కూడా. టీవీల్లో వేడివేడిగా చర్చలు జరిగిపోతున్నాయ్. ఇంక మిగిలిందల్లా సర్జికల్ స్ట్రైక్స్‌పై అమూల్యఅభిప్రాయాలతో ఆర్జీవీ ట్వీట్స్, ఇది జరుగుతుందని ఎప్పుడో లెక్కలు వేసేశామంటూ జ్యోతిష్కుల పోస్ట్-డేటెడ్ ఫోర్‌కాస్ట్‌లూను. తొందర్లో అవీ వచ్చేస్తాయి. ఇంత జరిగిపోతుంటే సామాన్యుడుకూడా  ఏదోరకంగా ఉడతాభక్తి ప్రదర్శించకుండా ఉండగలడా? లేడు. బట్, హౌ టు డూ దట్? సబ్జెక్ట్ మేటర్ తెలిసి ఏడిస్తేకదా? రీసెంట్ హిస్టరీలో పాకిస్తాన్ని పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లుగా విడగొట్టి ఇందిరాగాంధీ అపరదుర్గ అయిన సర్జికల్ స్ట్రైక్ ఒకటి, టెన్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఇరాకీ న్యూక్లియర్ రియాక్టర్లని యుద్ధవిమానాల దాడితో ధ్వంసంచేసి సద్దాం హుసేన్‌ని ఆటమ్ బాంబ్ టెక్నాలజీకి ఆమడదూరం పెట్టిన ఆపరేషన్ ఓపెరా అనే ఇజ్రాయెలీ సర్జికల్ స్ట్రైక్ ఒకటి – వీటి గురించి వినడమే తప్ప ఇంకేమీ తెలీకుండానే వాదోపవాదాలు, చర్చోపచర్చలు చేసెయ్యడానికి మనమేమన్నా టీవీ యాంకర్లమా, మేధావి కండువాలు కప్పుకున్నామా? అయినా ఏదో ఒకటి రాయాలి. రాసి తీరాలనిపించి ఏం చెయ్యాలో తెలీక ఏదో ఒకలా మొదలుపెట్టాలి కనక ముందు సర్జికల్ స్ట్రైక్ అన్నదానికి తెలుగుభాషలో ఈక్వివలెంట్ వర్డ్ /సమానార్ధకపదం ఏదైనా ఉందేమోనని వెతికా. దొరకలేదు. లాభం లేదని సొంతంగా ట్రైచేస్తే సర్జికల్ స్ట్రైక్‌కి సమానపదం వ్యూహాత్మకశస్త్రప్రహారము అయ్యుండచ్చు అనిపించింది.  కానీ ఈ మాటని టపాలో మాటిమాటికీ వాడాల్సివస్తే అదో మెగాటపా అయ్యే ప్రమాదంవుంది.  అందుకేనేమో ఒక న్యూస్‌పేపర్‌వాళ్ళు సర్జికల్‌దాడులు అనే దుష్టసమాసంతో సరిపెట్టారు. సో, సర్జికల్ స్ట్రైక్స్ గురించిన భాషాపరమైన సమస్యల్ని ఆ విధంగా అధిగమించి, చంద్రబాబు స్టైల్లో ముందుకు పోవాల్నని, ముందుకు పోతుంటే సర్జికల్ స్ట్రైక్స్ వెనకనున్న స్ట్రాటజీ – అదే వ్యూహాత్మకత – ఏమిటాని ప్రశ్నఎదురైంది. కార్గిల్ తర్వాత ఇన్నేళ్ళకి పాకిస్తాన్ని ఉతికారేశామని మనం ఓ తెగ సంబరపడిపోతున్నాంగానీ చాలామందిని ఇవి వ్యూహాత్మక స్ట్రైకులా లేక ఊహాత్మక స్ట్రైకులా అనే సందేహం పీడించింది(ట). ఇంకా పీడిస్తోంది కూడా(నట). ఐతే జనం సంబురాలు చేసుకుంటున్న సమయంలో ఇలాంటి అప్రస్తుత ప్రసంగం ఎందుకొచ్చిందిలే, అనవసరంగా అక్షింతలు పడతాయని అనుమానాలు బహిర్గతం చెయ్యట్లేదు. ఐనా ఉండబట్టలేక ఒక జర్నలిస్టు, గృహమంత్రి  రాజనాధసింహులవారిని,”సార్! సర్జికల్ దాడులని నిర్ధారిస్తూ తీసిన వీడియోలూ, ఫోటోలూ ఏమన్నా…,” అంటూ సణిగితే ఆయన, “వెయిట్ అండ్ సీ,” అన్నారట. ఆయనకి మాత్రం ఏం తెలుసు. వ్యవహారం అంతా మోడీ-దోవల్-దల్బీర్-జయశంకర్ టీమ్ నడిపించేస్తేనూ? పారికర్‌‌కి కూడా తెలుసో లేదో డౌటేనట. ఆ జర్నలిస్టు కానీ రాజ్యసభటీవీలో జరిగిన ఓ రెండు మూడు చర్చలు, న్యూస్ యాంగిల్ బై ప్రొఫెసర్ నాగేశ్వర్, ఎట్సెట్రా ఫాలో అయ్యుంటే ఇలాంటి అనుమానాలు వచ్చేవికావు. డిఫెన్స్ & ఫారిన్ సర్వీస్ ఎక్స్‌పర్ట్‌లు ఈ అనుమానాలు వ్యక్తం చెయ్యడం, మళ్ళీ వాళ్ళే భారతప్రభుత్వం ఆధారాల్లేకుండా ఇంత హడావిడి చెయ్యదనీ, సరైన సమయంలో సరైన ఫోరంలో ఆధారాలు చూపెడతారనీ, ఇన్ ద ఫ్రంట్ దేర్ ఈజ్ క్రొకోడైల్ ఫెస్టివల్ అన్న మీనింగ్ వచ్చేలా అనడంతో నా మటుకు నాకు ఈ స్ట్రైకులు ఊహాత్మకం కావనీ వ్యూహాత్మకములేననీ నమ్మకం వచ్చింది. అంతేకాదు వ్యూహత్మకం అంటే అలాంటిలాంటి వ్యూహాత్మకం కాదు. సర్జికల్ స్ట్రైక్స్ అని ఇంగ్లీష్‌లో అంటేతప్ప ఆ వ్యూహాత్మకతలో వున్న ఫోర్సూ, ఎఫెక్టూ, ఇంపాక్టూ కరెక్టుగా తెలిసిరానంత భీభత్సమైన వ్యూహాత్మకతన్నమాట. సర్జికల్ స్ట్రైకులు జస్టు పాకిస్తాన్ దుర్మార్గాన్ని బయటపెట్టడానికీ, కేవలం ఉరీ ఎటాక్స్‌కి ప్రతీకారం తీర్చుకోడానికే అనుకోడానికి లేకుండా ఎన్డీయే ప్రభుత్వానికి కాస్త ఇమేజ్ ఛేంజ్-ఓవర్ అవసరమైన టైములోనే పాపిస్తాన్‌కి  పోగాలం వచ్చింది. ఉరీ ఎటాక్స్ చేయించి తనని తను ఇంటర్నేషనల్‌గా ఉరి తీసుకోడమేకాక మోడీకి, ఎన్డీయే గవర్నమెంటుకి, పన్లో పనిగా బీజేపీకి ఓ మంచి అవకాశాన్నిచ్చింది. సర్జికల్ స్ట్రైక్స్ వార్త వినగానే పాకిస్తాన్ నీ పిలక పీకిస్తాన్ అన్నంతగా సంబరపడిపోయి చంకలు గుద్దేసుకుంటూ ముష్కరమూకలన్నిట్నీ మోడీగారు తుక్కుతుక్కుగా ఉతికేస్తున్న ఫీలింగ్ వస్తున్నట్టైతే అదేం తప్పుకాదు. పాకిస్తాన్ని రెండు ముక్కలుగా విడగొట్టాక మనకి అంతటి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ వచ్చింది మళ్ళీ ఇప్పుడే కదా! బట్, ఈ స్ట్రైక్స్ రెండువైపులా పదునున్న కత్తులు. స్ట్రైక్ వల్ల పాపిస్తానీయుల్ని బెంబెలేత్తించడంతోపాటు దేశంలో ఆవులు, అసహనాలు, బీఫ్ ఇష్యూలు, బైఫర్కేషన్ మేటర్స్, స్టేట్ గవర్న్మెంట్స్‌ని అడ్డగోలుగా పడగొట్టడాలు .. మొదలైనవాటివల్ల తెచ్చిపెట్టుకున్న తలనొప్పులు, చెడ్డపేరునుంచి కొంతకాలం పాటు జనం డైవర్ట్ అవుతారు. ఉత్తరాఖండ్‌లోనో, ఎక్కడో ఎలక్షన్స్ వస్తున్నాయిట. ఈ స్ట్రైకుల ఎఫెక్ట్ అక్కడ ఎలక్షన్ విక్టరీగా తర్జుమా అవచ్చు. ప్రత్యేకహోదాలు, పాకేజీలకోసం గందరగోళం చేద్దామనుకునే వర్గాలు కూడా తమపైన ఎలాంటి సర్జికల్ స్ట్రైక్స్ జరుగుతాయోననే భయంతో కొన్నాళ్ళు నోరెత్తకుండా పడివుండే ఛాన్స్ కూడా వుంది. ఇలా చాలా లాభాలున్నాయి. ఒక్క దెబ్బలో పది పదిహేను పిట్టల్ని కొట్టడానికి దోవలు వెతుకుతున్న మోడీజీకి అజిత్‌దోవల్ రూపంలో మాంచి దోవ దొరికింది. అంతే పాక్ ఇచ్చిన అవకాశానికి తన వ్యూహాత్మకత జోడించి అజిత్‌దోవల్‌కి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం, ఆయన అవసరమైన ఏర్పాట్లన్నీ చేసెయ్యడం, డీజీఎమ్ఓ ఆధ్వర్యంలో పీఓకేలో ఉన్న టెర్రరిస్ట్ స్థావరాల మీద దాడులు జరిగి ముప్ఫైఎనిమిదిమంది తీవ్రవాదులు ముప్ఫైఎనిమిది బకెట్లు తన్నెయ్యడం జరిగిపోయింది. మోడీజీ ఛాతీసైజు 56+అంగుళాలని కొంచెం పెడసరంగానే, నిందాస్తుతి రూపంలో రాహుల్‌గాంధీజీ కన్‌ఫర్మ్ చేసేసారు. 56+అంగుళాల చాతీని వి(చ)రుచుకునే ఛాన్స్ యూఎస్సే గవర్నమెంట్ లోపాయకారీ సపోర్ట్ లేకుండా వచ్చేదా అంటే సమాధానం మోడీపై మనకున్న అభిమానాన్ని బట్టీ వుంటుంది. ఎవరికివాళ్ళు అంచనా వేసుకోవాల్సిందే. నేనెటో చూస్తూవున్నప్పుడు నువ్వాణ్ణేసెయ్యెహే అని అమెరికా అన్నాకే ఇండియన్ ఛాతీ 56+అంగుళాలయ్యిందని అభిజ్ఞవర్గాల అంచనా. వి(చ)రుచుకోడానికి 56+అంగుళాల ఛాతీ లేకుండా- విత్ ఆర్ వితౌట్ సపోర్ట్ ఫ్రమ్ యూఎస్సే- సర్జికల్ ఎటాక్స్ చెయ్యడం కుదిరేదా అన్నది అసలైన పాయింట్.

ఆపరేషన్ 56ఇంచ్-చెస్ట్ సక్సెస్ చెయ్యడంలో టెక్నాలజీపాత్ర ఎలాంటిది? ఆర్నెల్ల క్రితం ఇస్రోవారు కక్ష్యలోకి పంపిన  Cartosat 2 శాటిలైట్‌తో పాటు మరో ఆరు శాటిలైట్లు ఈ ఆపరేషన్‌లో సహాయపడ్డాయి(ట). Cartosat 2 ఉపగ్రహం తొంబై నిముషాలకొకసారి భూమి చుట్టూ తిరుగుతూ భూమ్మీద ఏ ప్రాంతంలోనైనా పావుగజం స్థలంలో ఏమేమి వున్నాయో పసిగట్టగలదు. అంతేకాదు, సెకనుకి ముప్ఫైయ్యేడు కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ కూడా నిర్దేశించిన స్థలంపైన ఒక నిముషం వీడియోకూడా తియ్యగలదు(ట). ఇవన్నీ ఉన్నప్పుడు ఇండియా దగ్గర సర్జికల్ స్ట్రైక్స్ చేసినట్టు ఆధారాలు తప్పక వుంటాయి. సరైన సమయంలో మనకీ, ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి కూడా మన నేతలు చూపిస్తారనే ధైర్యం మనక్కలక్కపోతే ఎలా? కలగాలి. కలిగింది. సో, టెక్నికల్ డీటెయిల్స్ మోడీ-అజిత్‌దోవల్-జయశంకర్-దల్బీర్ టీమ్‌కి వదిలేసి సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో మన కెపాసిటీ అండ్ ఎక్స్‌పీరియెన్స్ తెలుసుకునే దిశగా కసరత్తు చేద్దాం, అది రేపు. స్టే ట్యూన్డ్!!!

(to be contd.)

🙏😃🙏

 

👇147 years after Gandhiji was born 👇

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

that-gandhiji

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷