పోలవరంప్రాజెక్ట్ గురించి… బ్రహ్మంగారి కాలజ్ఞానంలో, నోస్ట్రడామస్ రాతల్లో..


పోలవరం ప్రాజెక్టు నా చిన్నప్పట్నుంచీ వింటున్నానని ఒక ముప్ఫైయ్యారేళ్ళతను మొన్న ఒక ఛానల్ డిస్కషన్‌లో చెప్పాడు. నా పదకొండేళ్ళవయసులో విన్న మొదటి ఎన్నికల హామీ అని జ్ఞానంలో, అనుభవంలో తలపండిన విజ్ఞులొకరు చెప్పారు. ఆయన వయసు డెబ్బైఐదుకి చుట్టుపక్కల. 1941లో మద్రాస్ ప్రెసిడెన్సీ చీఫ్ ఇంజినీర్ ఎల్.వెంకటకృష్ణయ్యర్ మొట్టమొదటి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసారని గవర్నమెంట్ రికార్డ్స్‌లో ఉండనే వుంది. కొన్నేళ్ళు పోతే పోలవరం గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలోనే రాసినట్టు తేలుతుంది. ఇంకా…ఆ…ఆ…ఆ… కొన్నాళ్ళు వెయిట్ చేస్తే నోస్ట్రడామస్ దీన్ని గురించి మెన్షన్ చేసినట్టు బయటపడుతుంది. ఎవరైనా శ్రద్ధపెట్టి పరిశోధిస్తే అశోకుడు వేయించిన శాసనాల్లో కూడా పోలవరం ప్రస్తావన కనబడొచ్చు. ఇంకా…ఆ…ఆ…ఆ…ఆ…ఆ…ఆ…ఆ…. కొంతకాలంపోతే ఎవరో ఒక సినిమా డైరెక్టరు ఓ పీరియడ్ మూవీ తీసి అందులో హరప్పా-మొహెంజొదారోల్లో బయటపడ్డ సింధునాగరికుల ఇళ్ళ శిధిలాల్లో పోలవరం ప్రాజెక్ట్ ప్లాన్లతో తాళపత్రాలు దొరికినట్టు చూపించెయ్యచ్చు. ఆ ముచ్చటకూడా తీరాక మన చరిత్రకారులు ఆకాశగంగ నేల మీద ప్రవహించడానికి దారి చూపుతూ భగీరధుడు పోలవరం మీంచే నడిచి వెళ్లినట్టు నిరూపించవచ్చు. ఋగ్వేదంలోనే పోలవరం ప్రసక్తి వున్నట్టు భావితరాలవారు వినే అవకాశం కూడా వుంది. అప్పుడింక ప్రపంచంలోనే అత్యంత పురాతనకాలంలో మొదలై ఇప్పటికీ నిర్మాణం కొనసాగుతున్న ఇరిగేషన్‌ప్రాజెక్ట్‌గా ఐక్యరాజ్యసమితివారి యునెస్కో పోలవరం ప్రాజెక్టుని గుర్తించడం, వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా ప్రకటించడం, అలాంటి సైట్స్‌కి యునెస్కోవారిచ్చే నిధులు ఇవ్వడం జరిగిపోతాయి. దేశానికి పైసా ఖర్చు లేకుండా ప్రాజెక్ట్ పూర్తయిపోతుంది. ఇప్పటికైనా అర్థమైందా పార్టీలకతీతంగా ప్రభుత్వాలు ఎందుకు అష్టకష్టాలు పడైనా ఆలస్యం చేస్తూ, నిధుల విషయంలో అత్యంత పిసినిగొట్టుతనంగా వ్యవహరిస్తూవున్నాఅష్టకష్టాలు పడైనా ఆలస్యం చేస్తూ, నిధుల విషయంలో అత్యంత పిసినిగొట్టుతనంగా వ్యవహరిస్తూవున్నాయో ప్రజలు అర్ధం చేసుకోపోతే ఎలా 😉? ముప్ఫయి నలభై వేల కోట్ల కోసం కేంద్రం ముక్కు పిండడంలో అర్ధమేమైనావుందా 😉?

 

🙏😆🙏

నేను సైతం “ప్రత్యేకా”గ్నికి బిల్లు ఒక్కటి ఆహుతిచ్చాను……..(“ప్రత్యేక” పేరడీ, మహాకవికి క్షమాపణలతో _/\_)