మై థాట్స్ అబౌట్ పవన్ కళ్యాణ్(01) పవన్ = “చిరు”గాలి = సినిమాల్లో సుడిగాలి = ఫాన్స్ ‘వీచే’ political వడగాలి


ఇవాళ ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడాలంటే వెంఠనే గుర్తుకొచ్చేది పవన్ కళ్యాణ్! (ఇకనుంచీ పికె అంటా). తన పేరు తల్చుకునిగానీ ఎవరూ ఏ రాజకీయపుటెత్తులు వేయడానికి కుదరని పరిస్థితి కల్పించాడు పికె. ఎట్‌లీస్ట్ అలా అనిపించేలా చేస్తున్నాడు. ప్రూఫ్ కావాలా? ఇదిగో – You are one of those reading this post just because you saw his name in the title, right? 🙂 If your answer is a ‘No’ then you show it by clicking that “Like” button 😉 somewhere down there 👇

Now, పికె పాలిటిక్స్‌లోకొచ్చి ఏం పీకుతాడు అనేవాళ్ళు కొందరు. పికె నిజానికి ఒక పీకే, చంద్రబాబు సంధించిన పొలిటికల్ స్ట్రోకే, బీజేపీ నడిపించే రాజకీయ జోకే అనేవాళ్ళు ఇంకొందరు. పైపైకి ఎవరెవరు ఏమేమన్నా, నిజంగా పికె ఎవరివైపు పనిచేస్తున్నాడో అనేది అందరికీ సస్పెన్సే. అతని స్క్రిప్ట్ రైటర్‌‌పార్టీకి తప్ప(ఒకవేళ వుంటే). తక్కినవాళ్ళ పని  పికె నెక్స్ట్‌స్టెప్ ఏంటో, గాలి ఎట్నుంచి ఎటు తిరుగుతుందో గెస్ చేస్తూ, అవసరమనుకున్నప్పుడు కౌంటర్లిస్తూ, టీవీ డిబేట్లలో అభిప్రాయాలు, ఎనాలిసిస్సులు ప్రకటిస్తూ కూచోడమే. పైకి కనిపించకుండా చేసే యాక్టివిటీ ఇంకొకటుంది. అది పవన్ తన జనసేనని ఫుల్‌‌టైమ్ రాజకీయపార్టీగా రంగంలోకి దింపితే అందులో చేరడానికి ఫీలర్లు వదులుతూ ఉండడం. స్టేట్ పాలిటిక్స్‌లో ఇలాంటి సిట్యుయేషన్ ఏర్పడ్డానికి కారణం పవన్ వెనకనున్న ఫాన్స్. పవన్ ఏ పార్టీవైపు తిరిగితే ఈ ఫాన్లన్నీ ఆవైపుకి తిరిగి గాలి వీస్తాయి. పవన్‌కి అతని ఫాన్స్‌కి మధ్యనున్న రిలేషన్ ఒక యాక్టర్‌కి అతని అభిమానులకి ఉన్న దానికన్నా డిఫరెంట్ రిలేషన్. పవన్ అంటే గాలి అని అర్ధం కదా. ఫాన్ అంటే పంకా. ఫాన్లు వీచే గాలి పవన్. భలే కుదిరింది కదూ. కుదిరింది కానీ ఈ గాలి ఫాన్ తిరిగితే వీచే గాలి కాదు. ఫాన్లనే తిప్పే గాలి. చిరంజీవి తమ్ముడిగా పవన్ ఒకప్పుడు ‘చిరు’గాలి. తన వెరైటీ నటనతో, తనదైన విలక్షణ ఆలోచనా ధోరణితో ఒక సుడిగాలిగా మారాడు.  ఈ గాలి వీచినప్పుడు ఫాన్స్ తిరిగి వోట్లు వీస్తాయి(రు). సినీఫాన్లు కాకుండా పవన్ వెనక అదేదో సామాజికవర్గపు ఫాన్లు కూడా ఉన్నాయిట. పవన్ని కులం గురించి కదిలిస్తే మాత్రం, ‘గాలికీ కులమేదీ.?..’ అని పాడతాడు. పవన్ అంటే గాలి అనే మీనింగ్ గుర్తు పెట్టుకుంటే ఆయన చెప్పిందీ కరెక్టే కదా? ఆయనకి కులం పట్టింపు లేకపోవచ్చు కానీ కులానికి … తప్పు తప్పు… సామాజికవర్గానికి పవన్ పట్టింపు ఉంటుంది కదా అని రాజకీయ వాతావరణ పరిశీలకుల అంచనా. Can’t help it. That’s how a political animal’s senses work. సో, సినీఫాన్లకి సామాజికవర్గ ఫాన్లు తోడైతే అప్పుడు వీచేది వోట్లగాలికాదు,వోట్ల ఝంఝామారుతమే అనీ, దానికి వాలుగా వున్న పార్టీ సేఫ్ అనీ, ఎదురీదిన పార్టీ ఉఫ్..ఫ్..ఫ్!!! అని రాజకీయుల పైకి చెప్పని లెక్కలు. ఇదీ పవన్ ఫాక్టర్ ఇన్ ఏపీ పాలిటిక్స్. పవన్ స్ట్రాటజీ అదిరింది కదా! పవనిజంలో నిజం ఎంత అని చాలా మందికి సందేహాలున్నాయి. పవన్ పొలిటికల్ స్ట్రాటజీని బట్టి  ఎంతో కొంత సరుకున్న ఇజమే పవనిజం అనుకోవచ్చు. బట్, ఆ నిజం నిరూపించాలంటే స్ట్రాటజీ ఒక్కటే సరిపోదు. సరిపోదు కదా? యాక్టివ్ పాలిటిక్స్‌లోకి దూకాలి, ఎన్నికల్లో నించుని పవర్ దక్కించుకోవాలి, చేతికందిన పవర్‌ని సద్వినియోగం చెయ్యాలి. అప్పుడే పవర్‌స్టార్‌లో ఉన్న స్టార్ పవర్ ఋజువౌతుంది. పవనిజం నిజం అవుతుంది. పవన్ తన పొలిటికల్ ఫిలాసఫీకి పునాదులు గుంటూరు శేషేంద్రశర్మగారి ఆధునికమహాభారతంలో వున్నాయని కదా చెప్తాడు. ఐ థింక్ దటీజ్ సమ్‌థింగ్ రిమార్కబుల్ అబౌట్ పవన్’స్ థాట్ ప్రాసెస్. I will write about it in my next post. Stay tuned.

😃🙏😃

Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s