మనుషులే నీళ్ళులేక అల్లాడుతుంటే దప్పిక తీరని దుప్పి అంటూ ఈ గోలేంట్రా అనిపిస్తోందా? బ్లాగ్స్ చదివే తీరిక, ఆసక్తి, ఓపిక ఉన్నవాళ్ళెవరికీ గారంటీగా అలా అనిపించదనే ధైర్యం. అందులోనూ ఈ పోస్టు టైటిల్ చూసి కూడా క్లిక్ చేసారంటే వన్యప్రాణుల్ని ఇష్టపడేవాళ్ళు, వాటిని సంరక్షించాలనుకునేవాళ్ళే అయ్యుంటారు. మూగజీవాలపై సానుభూతిని వారితో సహానుభూతిగా మార్చుకోవడానికే ఈ ONE MINUTE FOR WILDLIFE మొదలుపెట్టాను. So, dear reader! I am so happy for your visit. _/\_ 🙂
నిన్నకాక మొన్న ఒక సంబార్ జింక దాహం తీర్చుకోడానికి ఒక ఊళ్లోకి వచ్చి అక్కడి చెరువులో నీళ్ళు తాగి క్షేమంగా తిరిగి వెళ్ళిన వైనం ఇక్కడ పంచుకున్నాను.(సంబార్ జింకకి గ్రామస్తుల ఆతిధ్యం ) అంతలోనే మన రాష్ట్రంలో అదే సంబార్ జాతి దుప్పి విషాదాంతం చూడాల్సివచ్చింది. పాపం, దప్పికతో ప్రాణాలకి తెగించి ఊళ్లోకి వచ్చిన ఈ దుప్పి అక్కడా నీళ్ళ చుక్క దొరక్క వెనుదిరిగింది. నాలుగడుగులు కూడా పడక ముందే కుప్పకూలి తలవాల్చింది.
మనుషులే నీళ్ళులేక అల్లాడుతుంటే దప్పిక తీరని దుప్పి అంటూ ఈ గోలేంట్రా అనిపించట్లేదు కదూ! ఎందుకంటే అడవుల్లో నీరు దొరికే పరిస్థితే వుంటే ప్రజల కోసం రైళ్ళలో, టాంకర్స్లో నీళ్ళు సరఫరా చెయ్యాల్సిన దుస్థితే వచ్చేది కాదు. చెట్లు, పశుపక్ష్యాదులు సుఖంగా ఉన్నాయంటే పర్యావరణం ఆరోగ్యవంతంగా ఉందనీ, కరువు కాటకాలు రావనే కదా అర్ధం.
అరవై ఏళ్ళ స్వతంత్ర భారతంలో మనుషులకే నీళ్ళు లేవు నేటికీ, నీరు నేడు వ్యాపార వస్తువు, ఒకప్పుడు దప్పిక తీర్చడం పుణ్యం. జంతువులగురించి ఆలోచించేవారెవరు బాబూ!
మెచ్చుకోండిమెచ్చుకోండి
అవును సర్. మీరన్నది రైటే. కానీ జంతువుల పట్ల ఇప్పుడిప్పుడే ఎవేర్నెస్ నెమ్మదిగా పెరుగుతోంది కదా. ఇప్పుడే ఇలా వాటిని గుర్తు చేసుకుంటూ ప్రకృతిమాతకి ఉడతాభక్తి ప్రకటించుకుంటే అదో తృప్తి.
నెనరులు. _/\_ 🙂
మెచ్చుకోండిమెచ్చుకోండి