ఆర్ యూ బయింగ్ డైమండ్స్?థింక్ అబౌట్ టైగర్స్ టూ!!


tiger daimond

ఆర్ యూ బయింగ్ డైమండ్స్? ప్లీజ్ థింక్ అబౌట్ టైగర్స్ టూ. యెస్, ముందు పులి కావాలా? డైమండ్స్ కావాలా? తేల్చుకుంటే మంచిది.

ఇదేం పిచ్చి? పులికి, డైమండ్స్‌కి మధ్య చాయిస్ ఏంటి? అనిపిస్తే పోస్టు మొత్తం చదవాలి. అప్పటికీ అలాగే అనిపిస్తే…….. ఓ _/|\_  😦 

డైమండ్స్ వద్దు, పులి కావాలి అంటే వెయ్యి హెక్టార్ల అడవి నిలబడుతుంది. పులి గిలి జాన్తా నై, డైమండ్స్, డైమండ్ మైన్స్, అవి తెచ్చే లాభాలు, ఉద్యోగాలు, ఎట్సెట్రా కావాలి అంటే వాటన్నిటికీ కలిపి మనం చెల్లించాల్సిన మూల్యం ఎంతో, ఏమిటో ఒక్కసారి ఆలోచించాలి  –

ఒక కారు ఇరవైఆరువేల మైళ్ళు నడిస్తే విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ ఎంత ఉంటుందంటే ఒక ఎకరం స్థలం మొత్తం పచ్చటి చెట్లతో నిండివుంటే ఆ చెట్లన్నీ కలిసి ఆ బొగ్గుపులుసువాయువుని పీల్చుకోడానికి ఒక సంవత్సరం పట్టేటంత. వెయ్యి హెక్టేర్లు అంటే 2470 ఎకరాలు. వెయ్యి హెక్టేర్ల అడవి నాశనం అయితే 2470 కార్లు ఒక్కొక్కటీ ఇరవైఆరువేల మైళ్ళు ప్రయాణిస్తే విడుదలైన కార్బన్ డయాక్సైడ్‌ని చెట్లు కాక ప్రజలే పీల్చుకోవాల్సి వస్తుంది. అందువల్ల వచ్చే రోగాలవల్ల బాగుపడేది డాక్టర్లు, మందుల కంపెనీలు, కార్పొరేట్ హాస్పిటల్సూ.

ఒక ఎకరం నిండా ఉన్న చెట్లు ఎంత ఆక్సిజన్ వదిలిపెడతాయంటే పద్దెనిమిదిమంది ఒక సంవత్సరం పాటు పీల్చగలిగినంత. వెయ్యి హెక్టేర్లలోవున్న చెట్లు 2470 x 18 = 44,460 మందికి ఒక ఏడాదికి అవసరమైనంత ఆక్సిజన్ విడుదల చేస్తాయి.

ఇంతటి మూల్యం ప్రజలు చెల్లిస్తే లాభాలు పట్టుకుపోయేది ఒక ఎమ్మెన్సీ. పరోక్షంగా బాగుపడేది మెడికల్ ఇండస్ట్రీ. మరోపక్క  డైమండ్ ఇండస్ట్రీ. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో ఈ పరిస్థితి నిజం కాబోతోంది.

పెంచ్ టైగర్ రిజర్వ్‌కి, నవర్దేహి వైల్డ్‌లైఫ్ శాంక్చువరీకి మధ్యవున్న అటవీప్రదేశంలో వజ్రపుగనుల తవ్వకానికి మైనింగ్ దిగ్గజం రియోటింటో శతవిధాలా ప్రయత్నిస్తుంటే మన కేంద్రప్రభుత్వం అందుకు లైసెన్సులివ్వడానికి సహస్ర విధాలా ప్రయత్నిస్తోంది. ఒక అడవి నుంచి మరో అడవిలోకి వెళ్ళడానికి పులులు వాడుకునే కారిడార్ ఈ ప్రాంతం. మైనింగ్ ప్రారంభమైతే అడవి నుంచి అడవికి పులుల కదలికలు ఆగిపోతాయి. వేటకి, జంటని వెతుక్కోవటానికి వాటికున్న అవకాశాలు తగ్గిపోతాయి. పులి పేరున ఎన్నెన్నో అటవీప్రాంతాలు రక్షించబడి దేశంలో సహజ ప్రకృతి నిలబడుతోంది. పులిని దాని సహజవాతావరణంలో చూడ్డానికి వచ్చే టూరిస్టులవల్ల ఆ చుట్టుపక్కల చాలా మందికి జీవనోపాధి కలుగుతోంది. కాలుష్యనివారణ, భూగర్భజలాల పరిరక్షణ అనే రెండు అతి ముఖ్యమైన ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఇవన్నీ కాదనుకుని వజ్రాల ఉత్పత్తిలో ప్రపంచంలో మొదటిస్థానం ఆక్రమించాలని ఇండియా ప్రయత్నించడం అవసరమా?

హే! భూమాతా! వజ్రాలు కొనే ప్లాన్‌లో వున్నవారికి కలలో కనబడి ఒక ముడివజ్రాన్ని తవ్వి తీసి, ప్రాసెస్ చేసి అమ్మడంలో ఎంత పర్యావరణ నష్టం కలుగుతుందో, ఎంత అనారోగ్యం వ్యాపిస్తుందో చెప్పరాదా? ఒక డైమండ్ నెక్లెస్ కొంటె ఇంకెన్నిరెట్లు ఎక్కువగా ప్రకృతికి, ప్రజలకి నష్టం జరుగుతోందో  వివరించరాదా?

హే! భారతమాతా! మా ప్రభుత్వాన్ని ఒక పచ్చచీర కొనిపెట్టమని అడగరాదా?

***

షిర్డీసాయిని పూజిస్తే?.. 65+98=163ఏళ్లనుంచీ….

తెలుగువాళ్ళూ! ఉగాదిపచ్చడి RECIPE మార్చండి! అర్జెంట్!

WHY(ఎందుకు)WE(మనం)ARE(ఉన్నాం)? ౧

చైనాలో రవీంద్రనాథ్ టాగోర్ కాంట్రావర్సీ !!!