షిర్డీబాబా సమాధి పొంది రెండేళ్ళు తక్కువగా శతాబ్దం. 1918 నుంచీ ఈ తొంభైఎనిమిదేళ్ళలో ఆయన భక్తుల సంఖ్య తామరతంపరగా పెరిగింది. అంతకుముందు ఎన్నేళ్ళనుంచీ బాబాని జనం సేవించారో!?! బాబా పదహారేళ్ళ వయసులో షిర్డీ వచ్చినప్పటినుంచీ ఎనభైమూడో ఏట సమాధి చెందేవరకూ. షుమారు అరవైఐదేళ్ళు. అరవైఐదు ప్లస్ తొంభై ఎనిమిది = నూటఅరవైమూడేళ్ళనుంచీ షిర్డీబాబా పూజలందుకుంటుంటే ఆయన్ని పూజిస్తే కరువులొస్తాయని ఇప్పుడా చెప్పుట? ఈ నూటఅరవైమూడేళ్ళలో వచ్చిన కరువులూ? అవి జనం చేసుకున్న కర్మా?
కొంపదీసి విదర్భ, మరాఠ్వడాలకి సెపరేట్ స్టేట్హుడ్ ఇవ్వకుండా ఆపడానికి బాబా “సాయం” తీసుకుంటున్నారా ఎవరైనా?
లేక, బాబా దేవస్థానాలపై రాష్ట్రప్రభుత్వాలు పెట్టుకున్న ఆశలపై నీళ్ళు జల్లే ప్రయత్నమా?
లేక, షిర్డీ భక్తులందరినీ ఒక వోటుబాంకుగా మార్చు ప్రక్రియయా?
ఎవరో ఒక మహాత్ముణ్ణి నమ్మి ఆర్తి-అర్ధార్ధి-జిజ్ఞాసు-జ్ఞాని అనే నాలుగు రకాల భక్తుల్లో ఒక కేటగిరీలో సెటిలై సంసారభారాన్ని భరిస్తూ ఎంతో(కొంత) మంచినే ఆచరిస్తున్న షిర్డీభక్తులని ఇలా గందరగోళంలో పడవేయుట పాడియే ధర్మమూర్తీ? బాబాని నమ్మి, ఎట్లీస్ట్ ఎవరికి వారు మంచివారుగా వుంటున్నారు కదా. అది చాలదా? ప్రజలకిప్పుడీ కన్ఫ్యూజన్ అవసరమా?
అదిసరేగానీ, మాంసాహారిని పూజిస్తే కరువులొస్తాయ్, ఓకే. ఘోరాలు, నేరాలు చేసి జైళ్ళ లోపల, బెయిళ్ళ మీద, కోర్టుల చుట్టూ తిరుగుతున్నవాళ్ళని సేవిస్తే ఇంకేమౌతుందో… బాబోయ్! అది కూడా తేల్చేస్తారా? లేక దానికీ ఓ రెండు సెంచరీలు ఆగాలా?
***
షిర్దీ సాయిట హుండీ
వర్ధిల్లగన మన నేత వచ్చెను జూచెన్
సర్దుట కిట దస్కములు జ
బర్దస్తుగ గాంచెనోయి పర్సులు నింపన్ 🙂
జిలేబి
LikeLiked by 1 person
హృద్యమగు వ్యాఖ్యలతో
పద్యముల కూర్చు భాషా
సేద్యము అనితర
సాధ్యము బ్లాగులోక రస
వాద్యము జిలేబికె తప్పన్!!
Thank you so much. 🙂
LikeLike