చైనాలో రవీంద్రనాథ్ టాగోర్ కాంట్రావర్సీ !!!


tagore

పుట్టి బుధ్ధెరిగిన ఇన్నాళ్ళకి (బుధ్ధెరెగడం అనే ప్రాసెస్‌ కొంచెం, కొంచెం కాదు చాలా ఎక్కువ టైమే తీసుకుంది) రవీంద్రనాథ్ టాగోర్‌ని ఎక్ప్‌ప్లోర్ చెయ్యడం మొదలెట్టిన నాకు ఆశ్చర్యం కలిగించిన ఒక విషయం చైనాలో టాగోర్‌కి మంచి ఆదరణ, ఫాలోయింగ్ ఉన్నాయన్న వార్త. ఇది నాకు వార్తే. గీతాంజలికి నోబెల్ ప్రైజు, శాంతినికేతన్, జనగణమన, చిన్నప్పుడు కన్నీళ్లు పెట్టించిన హోమ్ కమింగ్ అనే ఫతిక్ చక్రవర్తి కధ, ఇంటర్మీడియేట్‌లో ఇంగ్లిష్ మాస్టారు అద్భుతంగా చెప్పిన “ఎ రాంగ్ మాన్ ఇన్ వర్కర్స్ పేరడైజ్” కధ .. ఇవి తప్ప విశ్వకవి సంగతులేమీ తెలీనివాడికి ఇది వార్త అవ్వడంలో ఆశ్చర్యం ఏముంటుంది? చైనాలో విశ్వకవికి ఉన్న ఆదరణ ఎంత అంటే ఈ ఏడాది టాగోర్ నూటాయాభై ఐదో జయంతి సందర్భంగా చైనాలో పీపుల్స్ పబ్లిషింగ్ హౌస్ వాళ్ళు కంప్లీట్ వర్క్స్ ఆఫ్ టాగోర్ అని బెంగాలీ టు చైనీస్ డైరెక్ట్ ట్రాన్స్‌లేషన్ విడుదల చేసేటంత. ఇదే సమయానికి టాగోర్ పేరుతో అక్కడో వివాదం కూడా మొదలైందిట. టాగోర్ అందం, ఆలోచన, తాత్వికత, అలౌకికత నింపి రాసిన వాక్యాల కూర్పు స్ట్రే బర్డ్స్ పుస్తకాన్ని ఫెంగ్ టెన్గ్ అనే రచయిత విడిగా తన సొంత మసాలా కలిపి అనువదిస్తే Zhejiang Wenyi Publishing House దాన్ని ముద్రించింది. అది కాస్తా కాంట్రావర్సీ అయి కూచుంది. చైనీయులకి ఈ మసాలా నచ్చక చర్రున రియాక్ట్ అయ్యారు.

అవ్వరా మరి?

“The world puts off its mask of vastness to its lover. It becomes small as one song, as one kiss of the eternal” – ఇంగ్లీష్‌లో చదివితేనే నర్మగర్భంగా ధ్వనించే ఈ వాక్యాన్ని ఫెంగ్ టెన్గ్ చైనీస్‌లో “The world unzipped his pants in front of his lover. Long as a French kiss, slim as a line of a poem” అనే అర్ధం వచ్చేలా రాసేశాడు. ఇంత ‘గొప్ప’గా రాసేవాడికి అనువాదం ఏం ఖర్మ? స్వతంత్ర కావ్యం అనేస్తే వదిలిపోయేదిగా? అనడు.

ఈ దెబ్బకి మోడరన్ చైనీస్ మనోభావాలే దెబ్బతిన్నాయంటే మిగతా ట్రాన్స్‌లేషన్ ఇంకెంత అందంగా అఘోరించిందో అనేది ఊహించడం…. అనవసరం. ప్రస్తుతం పబ్లిషర్లు కాపీలన్నీ వెనక్కి తీసేసుకున్నారు. చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ కాలపు చైనీస్ సొసైటీ కూడా కనెక్ట్ అయ్యేంత సున్నితమైన భావాలు వ్యక్తం చేసిన రవీంద్రుడి అంతరంగ తరంగాలు ఇంకెంత సున్నితమైనవైయ్యుంటాయనేది.(జిస్ కి రచనా ఇత్‌ని సుందర్!!, వో కిత్‌నా సుందర్ హోగా, వో కిత్‌నా సుందర్ హోగా!!)

కాంతికి మూలమైన ఫోటాన్స్‌లాంటి అత్యంతసూక్ష్మకణాలలో మార్పువల్ల కానీ కనిపెట్టలేనంత అత్యంతసూక్ష్మ తరంగాలని ఈ మధ్య సైంటిస్ట్లు ‘విని’ ఋజువు చేసిన గురుత్వ తరంగాల (గ్రావిటేషనల్ వేవ్స్) ఉనికిని వందేళ్ళ క్రితం ఊహించిన ఐన్‌స్టీన్ బుద్ధి ఎంత సున్నితమో, ఎంత సునిశితమో టాగోర్‌ మనసూ, హృదయం, వ్యక్తీకరణ అంత సున్నితం, అంత సుకుమారం అయ్యుండాలి. లేకపోతె ఏకం సత్ విప్రాః బహుదా వదంతి అనే భావతరంగాలనే తన ఆలోచనల్లో, రచనల్లో ఎలా నింపగలడు? అలాంటి ‘మన’కవి రచనని అల్లాటప్పాగా, అసభ్యంగా ఒక విదేశీయుడు అనువదించడం, దాన్ని అతని దేశస్తులే వ్యతిరేకించడం నిజంగా వార్తే. ముఖ్యంగా తెలుగువాళ్లకి (ఎందుకో వేరే చెప్పాలా?)    

తీసేవాళ్ళు+వేసేవాళ్ళు+ఎగబడి చూసేవాళ్ళు+సెన్సార్‌బోర్డు+గవర్న్‌మెంటు = ప్చ్! మనం!!

…love for Nature, Beauty, Truth, Freedom and the underlying Oneness of all beings (YVR’s అం’తరంగం’)

కార్బైడుపొగకన్న హాలాహలము మిన్న వదిలెయ్యరా నన్ను నా మానవా!!!