నాకర్ధమైన అద్వైతం – 00౧


ఉన్నది ఒకటే. అన్నిటికీ, అందరికీ మూలం ఒకటే.

ఏకైకఅస్తిత్వపు మస్తిష్కంలో కదిలే విభిన్నసంకల్పాలే సృష్టి, అంతులేని వైవిధ్యాల ఈ సమాహారం

ఏకత్వపు మహాసముద్రంలో పుట్టిన అలలే ప్రకృతి, పదార్ధం, పంచభూతాలు, ప్రాణులు 

అద్వైతస్థితి ముక్కచెక్కలైన మాయాదర్పణంలో తనని తాను చూసుకున్నప్పుడు పుట్టిందే ద్వైతస్థితి, దృశ్యమాన ప్రపంచం

పడిలేచే అలకి ప్రతిరూపం కిందమీదులయ్యే మనసు; ఏకత్వానికి భిన్నత్వానికి మధ్య కొట్టుమిట్టాడే కెరటం ఈ మనసు

అలలపైన కదలాడే చిరుఅలలు అం’తరంగాలు’, మనసుకనే కలలు ఈ భావాలు, భావావేశాలు, భయోల్లాసాలు

ద్వైతఅద్వైతస్థితుల మధ్య దిక్కుతోచని పయనంలో మధ్యలోనే కరిగిపోతున్న మంచుపడవ జీవితం

ఏకత్వానికి మళ్ళిన మనసు, అదే హృదయం; ఆ హృదయప్రకంపనాలు ప్రేమ,అహింస,త్యాగం, అనురాగం, స్నేహం

భిన్నత్వానికై ఉరకలేసే మనసు, అది మస్తిష్కం; కామక్రోధలోభమోహమదమాత్సర్యాల మందిరం

౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧