స్వామివారు వైకుంఠపు కిచెన్ లోకి వెళ్ళారు. అక్కడ శ్రీమాత చేతి కాఫీ, నందనవనంలో ఇంద్రుడు పండించి పంపిన ఫ్రెష్ అరబికా కాఫీగింజల డికాక్షన్, పాలకడలి పాలు, అమృతపు పంచదారతో శ్రీమాత కలిపిన కాఫీ…


////”ఫ్రాంక్లీ స్పీకింగ్, మనుషుల విషయంలో నా ఎక్స్పెక్టేషన్ ఏంటో భూమ్మీదున్న ఏడు బిలియన్ల జనాభాలో 0.1% మందికైనా అంటే డెబ్భైవేలమందికైనా సరిగ్గా అర్ధమైందో లేదో డౌటు నాకు. మీరు అనుకునేది, విన్నది, చదివింది ఇవన్నీ ఎన్ని వేల సంవత్సరాల నుంచీ ఎన్ని నోళ్ళలో ఎన్ని రూపాంతరాలు చెందిన ఇన్ఫర్మేషనో గ్రహించావా? నెక్స్ట్ కాఫీ కప్పుకి ఒక కమ్యూనికేషన్ ఎలా డిస్టార్ట్ ఔతుందో అంటే ఎలా వక్రీకరిస్తుందో ఒక కధ ద్వారా చూపిస్తా నీకు.”////  

“మనం నిజంగా కాఫీని ప్రేమిస్తున్నామా లేదా తెలుసుకోవాలంటే ఓ చిన్న టెస్ట్ వుంది. ఏం కొనడానికి ఎక్కడికి వెళ్ళినా అక్కడ కానీ, ఆ చుట్టుపక్కల కానీ ఉన్న కాఫీషాపులపైనా, అక్కడ దొరికే రకరకాల కాఫీపొళ్ళపైనా ఓ కన్నేసి ఉంచుతాం.   కిరాణా కొట్టుతో మొదలెట్టి హై-ఎండ్ డిపార్ట్-మెంటల్ స్టోర్ వరకూ ఎక్కడికెళ్ళినా సరే అవసరమున్నా లేకపోయినా అక్కడ దొరికే కాఫీ బ్రాండ్స్ ఏంటో చూస్తాం, చూస్తాం కాదు పరిశీలిస్తాం. పరిశోధిస్తాం. ఆఘ్రాణిస్తాం. బేసికల్లీ కాఫీ గొప్పతనం అంతా దాని సువాసనలోనే గూడు కట్టుకుని ఉంటుందిట. జెస్సీ లేన్ ఆడమ్స్ అనే పెద్దమనిషి Coffee smells like freshly ground heaven అన్నాడు. అందుకే కొత్తగా, కొంచెం డిఫరెంటుగా అనినిపించినవాట్ని వదిలేసి బాగా పరిచయంవున్న, ముక్కుపుటాలకి తగుల్తూనే స్వర్గంలో, అఫ్ కోర్స్ బొందితోనే, ఉన్న ఫీలింగ్ తెప్పించే పాకెట్ ఒకటి సొంతం చేసుకుని కానీ ఇంటిదారి పట్టం. బైటికెళ్ళిన ప్రతిసారీ ఇలా చేస్తున్నామంటే మన గుండెజారి కాఫీలో గల్లంతైనట్టే.” రెండుమూడ్రోజుల క్రితం కొన్న బాన్-కఫే కాఫీపొడితో తయారుచేసుకున్న ఫిల్టర్ కాఫీలో దాని చేదుని డామినేట్ చెయ్యనంత క్వాంటిటీ (= మోతాదు, తెలుగులో మాట్లాడుతున్నప్పుడు అక్కడక్కడ తెలుగుపదాలు వాడటం తెలుగువాళ్ళ జన్మహక్కు అని అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది 🙂 ) పంచదార కలుపుతూ స్వామివారికి నా కాఫీ-థాట్ వివరించాను.

” అవునూ ఈ జెస్సీ లేన్ ఆడమ్స్ ఏంటి కలియుగ హిరణ్యాక్షుడా? గజాసురుడా? మొత్తం స్వర్గాన్నే పొడి కొట్టుకుని కషాయం చేసుకు తాగేసేట్టున్నాడు?,” స్వామి జోక్ చేస్తున్నాడని తెలుసు కనక చెప్పాను, “ఈ జెస్సీ యొక్క పెద్దమనిషిత్వం ఆరా తీద్దామని నెట్ లో పెద్ద పెద్ద వలలు వేసి వెతికినా దొరకలేదు. కలడు కలండనువాడు కలడో లేడో అంటున్నారు జనం.”

“అలాగా? ఇంతకీ ఈ కలడు కలండను వాడు … ఇదెక్కడో విన్నట్టుంది”

“కలఁ డందురు దీనులయెడఁ, గలఁ డందురు పరమయోగి గణములపాలం
గలఁ డందు రన్ని దిశలను, గలఁడు గలం డనెడువాఁడు గలఁడో లేఁడో,” స్వామీ! ఇదేనా? పదిహేనో శతాబ్దంలో పోతన గారు రాశారు.”

“అది సరే! ఒరిజినల్ గా ఈ మాటలన్నది కృతయుగంలో గజేంద్రుడు. ఆ మాటలకే కదూ శంఖుచక్రాల్నీ, గరుడాళ్వార్నీమర్చిపోయి చేతనున్న లక్ష్మి కొంగు అలా పట్టుకునే పరుగుపరుగున వెళ్లి గజేంద్రుణ్ణి రక్షించాను.ఆ రోజులూ, ఆ భక్తులే వేరు.”

ఫ్లాష్-బాక్ లోకి వెళ్ళిపోయిన విష్ణుదేవుణ్ణి ఇరుకున పెట్టే చాన్స్ దొరికింది.

“ఆర్యూ ష్యూర్, స్వామీ? దీనులనీ, యోగులనీ అనుక్షణం కనిపెట్టుకుని వుంటావా? మరీమధ్య నేరాలూ ఘోరాలూ జనాభాకి డైరెక్ట్ ప్రపోర్షన్లో జరిగిపోతున్నాయ్. బాధితుల్లో దీనులెవరూ లేరంటావా? లేక కలియుగం కాబట్టి అదంతే అంటావా? అదీ కాకపోతే జన్మలు కర్మల లెక్కల్నిబట్టీ ఈ లోకాన్నెవరూ బాగుచెయ్యలేరని నాలుగు చేతులూ ఎత్తేశావా?”

“పిచ్చి మూర్ఖుడా! జన్మలు, కర్మలు, యుగాన్ని బట్టీ దేవుడికీ మనిషికీ మధ్య దూరం పెరిగిపోడాలూ ఇవన్నీ మనిషికి జ్ఞానం, విజ్ఞానం లో-లెవెల్లో వున్న కాలానికి సంబంధించిన లెక్కలు. ఇప్పుడు మీ జ్ఞానవిజ్ఞానాలు ఇంతింతై వటుడింతై అన్నట్టు పెరిగిపోయాయి. వాట్ని మీ కష్టాలు తీర్చుకోడానికి వాడుకోకుండా భూమ్మీద పొల్యూషన్ – మానసిక, నైతిక, రాజకీయ అండ్ వాతావరణ కాలుష్యం పెంచడానికి వాడుకుంటున్నారు. కలియుగాన్ని నేనేం సృష్టించలా. మీరు చేసే పనుల, ఆలోచనలబట్టీ యుగాలు మారుతాయి. ఐన్-స్టీన్ కాలం గురించి ఏం చెప్పాడు? రెండు సంఘటనల మధ్య వుండే ఖాళీ / దూరమే కాలం అని చెప్పలా? మార్పులు సంభవించినప్పుడే కాలం ఏర్పడుతుంది అని తెలవట్లా? సో, మీ ప్రవర్తనల్లో ధార్మికత, నైతికత తగ్గుతున్న కొద్దీ యుగం దిగజారుతుంది. అవి పెరిగిన కొద్దీ యుగమూ పైకెక్కుతుంది. నాలుగు యుగాలు ఓ టైమ్ టేబుల్ ప్రకారం ఒకదాని తర్వాత ఒకటిగా రైలుపెట్టెల్లావస్తాయనుకుంటే పప్పులో కాలేసినట్టే, కాదు కాదు రైలు పట్టాలు తప్పినట్టే. మీరంతా ధర్మాన్ని అర్ధం చేసుకుని ఈ క్షణం నుంచీ అందరూ తు.చ. తప్పకుండా ఫాలో అవ్వండి ఇప్పటికిప్పుడు కృతయుగం (=సత్యయుగం) ఎందుకు మొదలవ్వదో చూస్తాను.”

“అదేంటి స్వామీ! కలియుగం అంటే దుష్ట సమయం, అప్పుడు జనం పాపకర్ములై, భ్రష్టాచారులై బావు చెయ్యలేనంత పాడైపోతారు, కల్కి అవతారం వచ్చేవరకూ అని మేమనుకునేదంతా….”

“ఫ్రాంక్లీ స్పీకింగ్, మనుషుల విషయంలో నా ఎక్స్పెక్టేషన్ ఏంటో భూమ్మీదున్న ఏడు బిలియన్ల జనాభాలో 0.1% మందికైనా అంటే డెబ్భైవేలమందికైనా సరిగ్గా అర్ధమైందో లేదో డౌటు నాకు. మీరు అనుకునేది, విన్నది, చదివింది ఇవన్నీ ఎన్ని వేల సంవత్సరాల నుంచీ ఎన్ని నోళ్ళలో ఎన్ని రూపాంతరాలు చెందిన ఇన్ఫర్మేషనో గ్రహించావా? నెక్స్ట్ కాఫీ కప్పుకి ఒక కమ్యూనికేషన్ ఎలా డిస్టార్ట్ ఔతుందో అంటే ఎలా వక్రీకరిస్తుందో ఒక కధ ద్వారా చూపిస్తా నీకు.”

“మేమేనేంటి స్వామీ! ప్రపంచంలో ఎన్ని మతాలున్నాయ్? నువ్వనే 0.1%లో వాళ్ళూ ఉన్నారు కదా?”

“మతాలూ, వేషాలూ మీరు పెట్టుకున్నవి. నా డిక్షనరీలో మతం అనే మాటే లేదు. నేనేమన్నా అందర్నీ ఉద్దేశించే అంటా. నన్ను మొదటగా దర్శించిన ఋషులకి, ద్రష్టలకి ఆ విషయం కరెక్టుగానే అర్ధమైంది. తరవాత్తరవాత అర్ధాలు మారిపోయాయ్.”

“మరి కల్కి అవతారం మాటేమిటి?”

“కలియుగం – సో కాల్డ్ కలియుగం – మొదలై ఐదువేల ఏళ్ళయింది కదా? ఇంకా నాలుగు లక్షలా ఇరవైఏడు వేల సంవత్సరాల టైముంది కల్కి రావడానికి. అంతవరకూ ఏం చేస్తారు మీరంతా? ఈగలు, దోమలు తోలుకుంటూ; ఈగ, బాహుబలి, బ్రూస్ లీ, రాష్ట్రవిభజన, కోడిపందాలు, పుష్కరాలు, జాతకాలు, పాప క్షమాపణలు, పవిత్రయుద్ధాలు, గాడిదగుడ్డు… వీటన్నిట్లోపడి వెర్రాళ్ళల్లా గడుపుతారా?”

“మరేం చెయ్యమంటావు స్వామీ? ఇంతకంటే ఏం చెయ్యగలం?”

“అంతరాత్మ పలికే వేదం వినండోయ్,  దాని ప్రకారం నడుచుకోండి”

“ఎలా?”

“విధాత తలపున ప్రభవించిన అనాది జీవన వేదం ఏం చెబుతోంది? అది అర్ధం చేసుకోండి. ప్రాణ నాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం ఏం చెయ్యమంటోంది? అది చెయ్యండి. కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసాన్ని తిన్నగా చూడండి. విశ్వరూపంలో మీ పొజిషన్, పాత్ర ఏంటో మొత్తం తెలుసుకోండి. ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానాన్ని వీనుల విందుగా వినండి, పాడండి.ఎవరికివాళ్ళు ఈ నాలుగూ చేస్తే కల్కిఅవతారం రావాల్సిన పనేముంది?”

“అంటే జ్ఞానవిజ్ఞానాల్ని సద్వినియోగం చేసుకోడానికి ఇంకా నాలుగులక్షల ఏళ్ళ  టైముందన్నమాట.”

“ఆఁ వుంది. ఆలోపు ఏ గ్రహశకలమో భూమ్మీద పడకపోతే!”

స్వామివారు ఇవాళ కొంచెం ఆవేశపడుతున్నారు ఒక బ్రేక్ ఇస్తే మంచిదనిపించింది. “స్వామీ! కాఫీ కప్పు నిండుకుంది. మీరు ఓకే అంటే వెళ్లి ముప్ఫైయ్యారో కాఫీ కలుపుకొస్తాను.”

“ఓకే” అంటూ స్వామివారు వైకుంఠపు కిచెన్ లోకి వెళ్ళారు. అక్కడ శ్రీమాత చేతి కాఫీ, నందనవనంలో ఇంద్రుడు పండించి పంపిన ఫ్రెష్ అరబికా కాఫీగింజల డికాక్షన్, పాలకడలి పాలు, అమృతపు పంచదారతో శ్రీమాత కలిపిన కాఫీ దేవదేవుడు ఆఘ్రాణించి ఆస్వాదిస్తున్న దృశ్యం ఊహించి, అలాంటి దివ్యకాఫీ (దుష్ట సమాసం! డివైన్ కాఫీ అనాలి) మనమెప్పుడు తాగుతామా అనికూడా అనిపించి, Heaven must be like fresh ground coffee అని జెస్సీ లేన్ ఆడమ్స్ గారి మాటల్ని తిరగేసి అనుకుంటూ నేనున్నూ ఈ పంచభూతాత్మకమైన కిచెనునందు ప్రవేశించితిని. ప్రవేశించి,తిని, ఆ పైన కాఫీకప్పుతో తిరిగివచ్చెదను. బై4నౌ. _/\_ 🙂

స’శేషం’

Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s