PK in PK = పవన్ కళ్యాణ్ ఇన్ పంచెకట్టు


సినిమాల్లో పవర్ స్టార్ = పాలిటిక్సులో పవర్ బాలెన్సింగ్ స్టార్ = పవన్ కళ్యాణ్                                     గోపాల గోపాలలో గోపాలకృష్ణుడుగా వెంకటేష్ పాత్రకి అండగావుండి ముందుకి నడిపించిన పికె ఇప్పుడదే పాత్ర రాజకీయాల్లో ధరిస్తున్నాడా? ధరిస్తే ఎవరికీ పికె (పొలిటికల్ కృష్ణుడు) సారధ్యం? 2019 వరకూ ఆయుధం చేపట్టకుండా, ఐ మీన్ ఎలక్షన్స్ లో పాల్గొనకుండా, ఈ జగన్నాటక….. సారీ సారీ సారీ, జగన్+నాటక అంటే జగన్ అభిమానుల మనోభావాలు దెబ్బతింటాయేమో, ఎందుకొచ్చిన గొడవ? అసలే జనంలో తెలుగు సరిగ్గా అర్ధమయ్యేవాళ్ళ శాతం తగ్గిపోతోంది. రాష్ట్రనాటక సూత్రధారి అంటే సరి … 2019 వరకూ రాష్ట్రనాటక సూత్రధారి పోషించబోయే పాత్ర ఏమిటి? ఆయన సారధ్యం ప్రజలకా? చంద్రబాబుకా? బీజేపీకా? అందరికీ కలిపా?

అసలైనా నాకెందుకీ రాజకీయాల గోల? Arm Chair Generalలాగా ఊరికే తిని కూచుని కామెంట్లు చెయ్యడం తేలికే ఒక రాష్ట్రం, అదీ ఇప్పుడిప్పుడే తప్పటడుగులు వేస్తున్న పిల్లరాష్ట్రం, నడపాలంటే ఎన్ని తలనొప్పులుంటాయ్? అర్ధం చేసుకోకుండా ప్రతివాడూ పొలిటికల్ సెటైర్స్ వేసేవాడే అని బుద్ధిమంతులు విసుక్కోరూ?

తప్పకుండా విసుక్కుంటారు. తిట్టుకుంటారు. స్టిల్, పాలిటిక్స్ అబ్జర్వ్ చెయ్యడం, కామెంట్ చెయ్యడంలో వుండే థ్రిల్ అలాంటిది. ప్రపంచంలోని అన్ని అక్కర్లేని విషయాల్నుంచీ అతిముఖ్యమైనవాటి వరకూ అన్నిటి మీద తన అభిప్రాయాలు ప్రకటించాడు అరిస్టాటిల్ మహానుభావుడు. ఆయన చేసిన సిద్ధాంతాలు, అబ్జర్వేషన్స్ నూటికి తొంభై 90% తప్పులేట. (ఆయనకా సంగతి తెలీదు. ఎందుకంటే, ఆయన విశ్వదర్శనం అనే పుస్తకం చదవలేదు కనక. మనం చదివాం కనక మనకి తెలుసు.) కరెక్టయిన మిగిలిన పదిశాతం అరిస్టాటిలియన్ విజ్డమ్ లోమాన్ ఈజ్ ఎ పొలిటికల్ యానిమల్ అన్నది బెస్ట్ అబ్జర్వేషన్ అనుకోవచ్చు. మాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అనికూడా అన్నాడట. రెండిట్లో ఎక్కువగా ఏది అంటే పొలిటికలే అని బీహార్ ఎలక్షన్ రిజల్ట్స్ చెప్తున్నాయి కనక ఆ సంగతి ఎక్కువగా ఆలోచించాల్సిన పనిలేదు. అరిస్టాటిల్ బతికింది క్రీస్తుపూర్వం. అప్పట్నుంచీ ఇప్పటివరకూ కూడా మనిషి పొలిటికల్ జీవి అనే సత్యంలో ఏ మార్పూ వచ్చిన సూచనలు లేవు. కాకపొతే పొలిటికల్ జీవుల్లో కొన్ని పాలిటిక్స్ నడిపేవి, కొన్ని రాజకీయాల్ని సినిమాలు, కోడి పందాలు చూసినంత ఇంట్రెస్టుతో చూసేవి. సో, రాజకీయాలనేవి మనిషి జన్మహక్కు. అందువల్ల ది హిందూ పేపర్ రాజకీయాల్ని ఎంత బోరింగ్ గా, మసాలా లేకుండా రాస్తుందో ఆ రకంగా పొలిటికల్ అబ్జర్వేషన్లు రాసుకుంటే ఎవరూ తిట్టుకోరు. బట్, అలా రాయడం ఎవరివల్ల అవుతుంది? కాదు. కుఛ్ తో లోగ్ కహేంగే, లోగోంకా కామ్ హై కహనా అనుకుని ఎదో ఒకటి రాసుకోడమే. ఇంతకీ సబ్జెక్ట్ లోకి వస్తే –

సినిమాల్లో పవర్ స్టార్ = పాలిటిక్సులో పవర్ బాలెన్సింగ్ స్టార్ = పవన్ కళ్యాణ్ ఆంద్రప్రదేశ్ కి సంబంధించి నిర్వహిస్తున్న పాత్ర ఏమిటి? అయన రాష్ట్రనాటక సూత్రధారా? పాత్రధారా?

సూత్రధారి ఆయన కాదు చంద్రబాబని కొందరు, చంద్రబాబు కాదు మోడీ అని కొందరు అంటారు. తనే సూత్రధారి అన్నట్టు, రాష్ట్ర వ్యవహారాలు గాడి తప్పకుండా బాలెన్స్ చేస్తున్నట్టు వ్యవహరిస్తాడు పికె.

సీబీఎన్ కి ఒక సామాజికవర్గం దూరం కాకుండా నిలపడానికి తమ మధ్య సత్సంబంధాలున్నట్టు చూపడానికి వచ్చాడని; పంచె కట్టి రావడంతో రైతు జన బాంధవుడిగా వచ్చాడని; 2019 ఎలక్షన్లో నుంచుంటాననడంతో తన వోట్ బాంక్, whatever it may be, అప్పటివరకూ చెదిరిపోకుండా ఉంచుతున్నాడని; ఎవరివైపు స్పష్టమైన మొగ్గు చూపకపోవడం అటు కమలనాధులనీ ఇటు అమరావతీ నాధుడినీ (సీబీఎన్) సస్పెన్స్ లో వుంచుతాడనీ — ఇలా పొలిటికల్ దిక్సూచి రకరకాల సంభావ్యతలు –possibilities– చూపిస్తుంటే అంతుపట్టని ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ ఆం.ప్ర. రాజకీయ తెరపై మరో నాలుగేళ్ళపాటు సస్పెన్స్ థ్రిల్లర్ నడుస్తుందనిపించట్లా?

కమలనాధుడు కామినేని పవన్ని రిసీవ్ చేసుకోవడం వెనక ఏమైనా మసాలా ఉందా అనిచూస్తే –

బీహార్లో వోటు సూర్యుడు ఉదయించక విచ్చుకోని కమలానికి ప్రత్యేకహోదా లేక ఆంధ్రాచంద్రుడు కూడా దూరమైతే ఎలాగా అనే బెంగ పట్టుకుని పవన్ మావాడే అనో, ప్రత్యేక హోదా/పాకేజీ విషయంలో సీబీఎన్ కి బెంగ పడవద్దని చెప్పమనో సంకేతాలు పంపుతున్నట్టు అనిపిస్తోంది.

ఏది ఏమైనా ప్రస్తుతానికి- పికె’స్ రోల్ ఇన్ ఏ.పి పాలిటిక్స్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంటరెస్టింగ్. హోప్ ఫుల్లీ హీ విల్ ప్లే ఇట్ వెల్ లైక్ హి డజ్ ఇన్ హిస్ మూవీస్!

ఐ రియల్లీ ఫీల్ పవర్ స్టార్ ఈజ్ నౌ ఎ పవర్ బాలెన్సింగ్ స్టార్ ఆఫ్ ఏ.పి పాలిటిక్స్.
Blog things