కాఫీత్వ33 – మత్స్యావతారం-DNA-జీవపరిణామం


YVR's అం'తరంగం'

“ఏమోయ్! కాఫీగత ప్రాణీ! కిందటి కాఫీత్వంలో సిరివెన్నెల శాస్త్రిగారి పాట ఎందుకు కోట్ చేసానో ఏమైనా ఆలోచించావా?,” ఆది దేవుడు, అభవుడు, సామవేదనాద వినోదుడు ఎదురుగా నిలబడి ఇలా అడిగితే మానవమాత్రుడైనవాడు తట్టుకోగలడా?
తప్పక తట్టుకోగలడు. తట్టుకోవాలి. ఆదిదేవుడు, అంటే ఆరిజిన్ ఆఫ్ దిస్ హోల్ క్రియేషన్, ఎదురుగా కనిపించినప్పుడు ఆయనతో సుబ్భరంగా మాట్లాడి అన్ని డౌట్లు తీర్చుకుని, మనం ఎలావుండాలని ఆయన అనుకుంటాడో అలా వుండడానికి ట్రై చెయ్యాలిగానీ మేనమామ చెవులో వెంట్రుకలు మొలిపించమనో, మోక్షం అంటే ఏంటో చిన్న క్లూ ఐనా లేకపోయినా సరే అదిచ్చెయ్యమనో అడిగిస్తే బావుంటుందా? అస్సలు బావుండదు. నొక్కి మరీ చెప్పాలంటే చా…లా…బాగోదు. (చాలా బాగోదు అను పదబంధమును-అనగా phraseను-ఉచ్ఛరించు విధానము సన్నాఫ్ సత్యమూర్తి చూసి అల్లు అర్జున్ ద్వారా నేర్చుకోవచ్చును. ఆయన ఈ విద్యను మంచు లక్ష్మీప్రసన్న వద్ద అభ్యసించెనని కొందరియభిప్రాయము) “మనం ఎలావుండాలని ఆయన అనుకుంటాడో అలా వుండడానికి ట్రై చెయ్యాలిగానీ”అన్నది ఎందుకంటే మనిషిపై దేవుడి ఎక్స్పెక్టేషన్ ఏంటో డైరెక్టుగా తెలుసుకునే వాళ్ళకన్నా వీళ్ళు వాళ్ళు చెప్పింది-ఇంక్లూడింగ్ టీవీ ధర్మసందేహాల్లో చెప్పేవి-వినేసి దేవుడికో కొబ్బరికాయ, అరటిపళ్ళు, అగరొత్తులు లంచం పెట్టేసి, దాంతో ఆయన సంతోషించి మేనమామల చెవుల్లో వెంట్రుకలు మొలిపించేస్తే బావుపడిపోదామనుకునే జనాభాయే ఎక్కువని ఆయా ఛానెళ్ళ టీఆర్పీ రేటింగులు తెలుపుచున్నవి. ఇదే విషయాన్ని పందొమ్మిదివందల డెబ్భైయ్యారులో వచ్చిన ముత్యాలముగ్గు సినిమాలో రావు గోపాలరావు అను కంట్రాక్టరు చేత ముళ్ళపూడి వెంకటరమణ…

అసలు టపాను చూడండి 438 more words