సముద్రవసనే దేవీ! _/\_ నీరుకంటే బీరు తేలిగ్గా … :-( ప్చ్!ప్చ్!ప్చ్!


YVR's అం'తరంగం'

ఇంట్లో అమ్మ నెలకి సరిపడా (అనుకుని) జంతికలు, మిక్స్చరూ వగైరాలు తయారు చేసి డబ్బాల్లో పోసిపెడితే మనం రెండుమూడువారాల్లో లాగించెయ్యడం మామూలే. రెండు వారాల్లో ఖాళీ డబ్బాలు చూసుకుని నిన్నకాక మొన్న చేసినవి, అప్పుడే ఖాళీ చేసేసారర్రా!?! అంటూ పాపం అమ్మలు ఆశ్చర్యం, ప్రేమతో కొద్దిపాటి అసహనం కలిపి నిట్టూర్చడమూ మామూలే. (ఇది తెలుగువాళ్ళకి, భారద్దేశానికే కాదు అన్ని దేశాలకీ మామూలేననుకుంటా. ప్రింగిల్స్ పొటాటో చిప్స్ వాడి అడ్వర్టైజింగ్ స్లోగన్, “Once you pop, you can’t stop” చూస్తే అదే అనిపిస్తుంది.) నెల తిరిగేప్పటికి అమ్మలకి మళ్ళీ చిరుతిళ్ళు తయారు చేసేసి డబ్బాలు నింపెయ్యాలనిపిస్తుంది. నింపేస్తారు కూడా. ఐతే ఒక అమ్మకి మాత్రం ఇలా పిల్లలక్కావాల్సినవన్నీ సమకూర్చడం మహా కష్టంగా వుందిట. అందరు అమ్మల్లాగా ఆవిడ నెలకోసారి కాదు సంవత్సరానికి సరిపడా అన్నీ తయారుచేసి పెట్టినా ఆవిడ పిల్లలు ఆర్నెల్లకే అన్నీ అవగొట్టేస్తార్ట. మిగిలిన ఆర్నెల్ల తిండికీ ఆవిణ్ణి నానా తిప్పలూ పెట్టేస్తార్ట.

పన్నెండువేల ఆరు వందల కిలోమీటర్ల వ్యాసమూ,
నలభైవేల కిలోమీటర్ల చుట్టుకొలత,
ఆరు పక్కన ఇరవైనాలుగు సున్నాలు పెడితే ఎంతో అన్ని కిలోల బరువూ వున్న ఆ తల్లికి ఏడు బిలియన్ల మంది పిల్లలు..పిల్లలకి అడిగినంత పెట్టడానికి నానా కష్టాలు పడుతోంది. ఎవరో తెలిసిపోయిందా? ఆ మాత భూమాత, ఆవిడ కన్న ఏడుబిలియన్ల పిల్లల్లో నేనూ ఒకణ్ణి. నేలతల్లి కష్టపడుతోందని తెలిసినా ఓ రెండు మూడ్రోజుల క్రితమే మరీ ఇంత కష్టపడుతోందని…

అసలు టపాను చూడండి 407 more words