మానవశరీరంలో”సున్నితమైన”చింపాంజీ బుద్ధి పనిచేసినప్పుడు? – ఇరవైరెండో కాఫీ :-)


Seumas Mac Manus అనే షనాకీ (shanachie) “Better a bald head than no head at all,” అన్నాడు.ట! (మన హరికధలు, బుర్ర కధల్లాగా నోటితో ఐరిష్ జానపద కధల్ని చెప్పేవాళ్ళని షనాకీ అంటారు. మళ్ళీ, ట! ). బానేవుంది కానీ ఇన్-డైరెక్ట్ గా బట్టతలని ఒక లోపం అన్నట్టుగా వుంది కదూ. ఆ సంగతి తర్వాత. ముందుగా అసలు తల లేకపోవడం గురించి……
ఇన్ రియాలిటీ, ప్రపంచంలో జుట్టులేనివాళ్ళ కన్నా బుర్రలేనివాళ్ళే, to be precise, బుర్ర వాడని వాళ్ళే ఎక్కువుంటారు. At least that is what the trend is. మనిషన్నవాడికి రకరకాల సిద్ధాంతాలకి, మతతత్వాలకి, ఇజాలకి, ట్రెండ్లు, ఫాషన్లకి బుర్రని అంకితం, పునరంకితం చేసేయడం అలవాటై పోయింది. దీంతో బుర్రలో ఒరిజినల్ గా, ప్రకృతిసిద్ధంగా వుండే కామన్ -సెన్స్, నాచురల్ బాలెన్స్ పని చెయ్యడం మానేసే ప్రమాదం వుంది. సృష్టిలో ప్రతి జీవికి తన పరిసరాలకి, తన జీవన శైలికి సంబంధించిన కామన్ సెన్స్ ఉంటుందికదా! ఆ జీవికి ప్రకృతికి మధ్య చక్కటి బాలెన్స్, harmony with nature, ఏర్పడ్డంలో ఆ కామన్ సెన్స్ దే ప్రధానపాత్ర. ఇతర జీవులతో పోలిస్తే మనిషికున్న ప్రత్యేకతలవల్ల ఆ కామన్ సెన్స్ ని హ్యూమన్ సెన్స్ అనడం యాప్ట్. కాఫీత్వం చెప్పేదేంటంటే
ఈ హ్యూమన్ సెన్స్ సరిగ్గా పనిచేసినంత కాలం నాగరికత, సంఘనిర్మాణం, ఉత్తమ సంస్కారాలు, విలువలు, విజ్ఞాన సంపాదన, ప్రజాస్వామ్యం లాంటి ఉన్నతమైన విషయాల్లో మానవజాతి పురోగమిస్తుంది.

అది పంజెయ్యనప్పుడు?

దురాచారాల నుంచీ దుష్టచర్యల వరకూ ఇప్పుడు భూమ్మీదున్న వివిధ సాంఘిక, మానసిక రుగ్మతలకి హ్యూమన్ సెన్స్ పంజెయ్యకపోవటమే మెయిన్ రీజన్.

ఎలా అంటారా? అనకపోయినా సరే, ఇలా
చింపాంజీ డీ.ఎన్.ఏ ని మనిషి డీ.ఎన్.ఏ ని పక్కపక్కన పెట్టి చూస్తే 98.5% వరకూ రెండూ ఒకటేట. 1.5% తేడాలో మనిషి సూపర్ కంప్యూటర్లు, మార్స్ ఆర్బిటర్ మిషన్లు, నానో టెక్నాలజీల వరకూ వెళ్ళిపోయాడు. చింపాంజీ?
ఇప్పటి వరకూ నాలుగు కాళ్ళ నడక మానలేదు.గ్రూప్స్ గా విడివిడిగా వుంటూ తిండీ వగైరా నిత్యావసరాలకోసం కొట్టుకు చావడం మానలేదు. ఒకే గ్రూపులో వుంటున్న వాటి మధ్య గూండాయిజం, బుల్లీయింగ్ , ఆడచింపాంజీల కోసం ఒకదాన్నొకటి చంపుకోడం మామూలే.

డీ.ఎన్.ఏ క్వాలిటీలో జస్ట్ 1.5% మెరుగుదల = నాగరికత+సైన్సు+కళలు+కావ్యాలు+ఇతర గ్రహాలలో బుద్ధిజీవులకై అన్వేషణ+……..+టాలీవుడ్ మార్కెట్ రెండొందల కోట్లు దాటిపోవడం 😉 వరకూ!!!

ఈ వ్యత్యాసానికి మూలం మనిషిని జంతువునుంచి వేరు చేసే మనసు,బుద్ధి,జ్ఞానం.

ఇప్పుడు ప్రశ్నలు ఏంటంటే డీ.ఎన్.ఏ ల్లో ఉన్న 1.5% తేడాలో మనసు,బుద్ధి,జ్ఞానాల వాటా ఎంత? ఒకవేళ మనసు, బుద్ధీ, జ్ఞానాల స్థాయి, వాటి క్వాలిటీ 1.5% మేర పడిపోతే ఏమౌతుంది?
మొదటిప్రశ్నకి జవాబు తెలీదు కానీ రెండో దానికి జవాబులు యూనివర్సిటీ షూటింగులు, భయంకర ఉన్మాదాలు, అత్యాచారాలు, రాజకీయలబ్ధి కోసం కులమతజాతి బేధాలు రెచ్చగొట్టడం, అవి పట్టుకుని జనం రెచ్చిపోవడం, వెర్రితలలు వేస్తున్న మానసిక రుగ్మతలు, మత దురహంకారాలు ఎట్సెట్రా రూపాల్లో కనిపిస్తున్నాయ్.

బీపీయో, సుగరో పడిపోయినట్టు హ్యూమన్ సెన్స్ 100% నుంచి 98.5%కంటే తక్కువ లెవెలుకి పడిపోయినప్పుడు
మనిషి శరీరంలో “సున్నితమైన” చింపాంజీ బుద్ధి!! పాపం తన ఆలోచనలకి అనుగుణంగా స్పందించే శరీరమూ, పరిసరాలూ, కంపెనీలేక తల్లడిల్లి
ఫుట్-పాత్ లపై నిద్రిస్తున్నవాళ్ళ మీదకి కార్లు ఎక్కించచ్చు.
సవతిపిల్లల్ని, కొన్నిచోట్ల కన్నబిడ్డల్ని, రాసిరంపాన పెట్టచ్చు
ముసలి తల్లిదండ్రుల్ని రోడ్డు మీద వదిలెయ్యచ్చు
సీక్రెట్ కెమెరాలు పెట్టి అసభ్య వీడియోలు తియ్యచ్చు
ఇసక మాఫియాలు నడపచ్చు, క్రికెట్ బెట్టింగ్ కోసం పిల్లల్ని కిడ్నాప్ చెయ్యడాలు,
సినిమాయాక్టర్ల కోసం గుళ్ళు, పాలాభిషేకాలు, ఆత్మహత్యలు వగైరా లోకకళ్యాణ కార్యక్రమాలు
చెయ్యచ్చు……………..తక్కినవి పాఠకుల ఊహకే వదిలెయ్యాలని కాఫీత్వ సిద్ధాంతం. వదిలేసా!

ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ , ప్రాక్టీస్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ – ఈ రెండూ చింపాజీకి, మనిషికి మధ్య వున్న1.5% డీ.ఎన్.ఏ తేడాని అలా నిలబెడతాయనేది కాఫీత్వంలో వున్న ఒక “మూఢ” విశ్వాసం. హ్యూమన్-వాల్యూస్ లేని హోమోసేపియన్ కి తాటిచెట్టు నీడ (??) కోసం వెళ్ళిన అలనాటి ఖర్వాటుడికి, అంటే బాల్డ్-హెడెడ్ జెంటిల్మన్ కి పోలికేంటంటే విచక్షణా జ్ఞానం వాడకపోవడం/వాడలేకపోవడం/అసలు లేకపోవడం.
అరెరే! పద్యం కోట్ చేద్దామనుకుంటుంటే టైము, కప్పులోని కాఫీ రెండూ ఐపోయాయ్. పద్యం ఇంక నెక్స్ట్ కప్పులోనే. Bye4Now 😉

స’శేషం’