తెలుగు నేలపై వెలుగు ముఖ్యమంత్రులు – ఇరవయ్యో కప్పు కాఫీత్వ


YVR's అం'తరంగం'

బ్రిటీష్ సామ్రాజ్యానికి తెలుగు రాష్ట్రాలకి తేడాలాంటి సామ్యం లేక పోలిక లాంటి బేధం ఏంటో తెలుసా?
బ్రిటీష్ సామ్రాజ్యంపై రవి అస్తమించడు. తెలుగు నేలపై చంద్రుడస్తమించడు.
నిజానికి తెలుగుదేశానికీ వెలుతురుతో, సూర్యచంద్రులతోఏందో ప్రత్యేక సంబంధమే ఉన్నట్టుంది. టాపిక్ ఇంట్రెస్టింగా వుందా?

అలాయితే కాస్త కాస్త సిప్ చేస్తూ ఈ ఇరవయ్యో కప్పు కాఫీత్వాన్నాస్వాదించండి. చిన్న చిరునవ్వు వచ్చినా కాఫీ బావున్నట్టే –
ఈ పూట కాఫీ బ్రేక్కి కొంచెం లైట్ సబ్జెక్ట్ ఏమైనా ఉంటే బావుంటుంది కానీ అందరూ అన్ని లైట్ సబ్జెక్ట్లూ ఎవరో ఒకరు డిస్కస్ చేసేస్తూనే వున్నారు. పోనీ బాహుబలికి రివ్యూ రాద్దామా అంటే అబ్బో గిన్నెస్ రికార్డ్ ఫర్ హైయ్యెస్ట్ రివ్యూస్ కోసం చూస్తే బాహుబలే గెలిచేలా వుంది. అన్ని రివ్యూలు. పుష్కరాల గురించి రాద్దామా అంటే తొక్కిసలాట గొడవతో అది హెవీ మాటర్ అయికూచుంది. లైట్ సబ్జెక్ట్ ఏముందిరా నిజంగా లైటు – వెల్తురు- కి సంబంధించినది
అని బుర్ర వేడెక్కించుకుంటుంటే నా ముందునుంచి ఒక ఖర్వాటుడు, అంటే బట్టతలాయన, వెళ్ళాడు.ఆయనగారి ఇంద్రలుప్తకము = కేశఘ్నము=ఖల్వటము=ఖలాత్యము=చెంబుతల=నూలిగరసు, అంటే బట్టతలపై ఆఫీసు లైట్ల రిఫ్లెక్షను చూసి ఒకానొక ముఖ్యమంత్రిగారి బాల్డ్-హెడ్డు గుర్తొచ్చింది. లైట్ సబ్జెక్ట్ అనుకున్నాం కదా బట్టతల, బీయింగ్ ఎ రిఫ్లెక్టివ్ సర్ఫేస్, ఈజ్ ఎ లైట్ సబ్జెక్ట్ అనిపించిందిదాంతో ఎందరు సీఎమ్ములకి బట్ట తల లున్నాయా అనే ఒక ఉత్తర మీమాంస మొదలయింది. (పూర్వ మీమాంస ఏదంటే…

అసలు టపాను చూడండి 163 more words