ప్రత్యూషకి ప్రధమ ప్రత్యూషం


మానవుణ్ణి భయపెట్టే మరో స్కాము వ్యాపం
మానవత్వాన్నే మట్టుపెట్టేలా ప్రత్యూషకి విధి ఇచ్చిన శాపం.
కన్నబిడ్డని బానిస చేసిన క్షుద్రత్వం, తండ్రి అనే పదానికంటిన పాపం,
గొరిల్లాలు, తోడేళ్ళల్లో తప్పని ఆల్ఫా ఫిమేల్స్ కి సవతి తల్లి ప్రతిరూపం

మానవత్వం నేర్పని మతాలూ, సంస్కారం ఇవ్వని బతుకుతెరువు చదువులు
మనుషుల్ని మార్కెట్ ఫాక్టర్ చేసే గ్లోబల్ ఎకానమీలు, నరుల్ని వానరులుగ మార్చే రాజకీయ వ్యవస్థలు
పసిపిల్లలకిస్తాయా భవిష్యాన శుభం? మానవత మరుగయ్యాక చట్టాలెన్నుంటే ఏం లాభం?

ఏదెలావున్నా …

పంతొమ్మిదేళ్ళ ఒక హృదయంలో ఆశ అనే భావన మొదటిసారి కలిగింది
చీకటి సొరంగానికొక చివర, అక్కడ ఓ వెలుగు రేఖ వుండొచ్చని తెలిసింది
చిరునవ్వు నవ్వచ్చనే చిన్న ధైర్యం ఇపుడిపుడే కలుగుతోంది.
లోకం వదిలిన తన తల్లిని సమాజాన చూస్తోంది
ఆ అవకాశం కలిగించి, ప్రత్యూషకి ప్రధమ ప్రత్యూషాన్నిచ్చిన మనీషికి, బాలల హక్కుల పరిరక్షణ సమితికి హృదయాం’తరంగా’ల పాదాభిషేకం

4ksy