కాఫీ కలపడం బ్రహ్మవిద్యా? రాకెట్ సైన్సా? నైమిశారణ్యంలో 17th cup


YVR's అం'తరంగం'

పదహారో కప్పులో మతం, మత్తుమందు ఎట్సెట్రా ఎట్సెట్రాలతో చిక్కటి ఇంటలెక్చువల్ కాఫీ అయింది కనక పదిహేడో కప్పు కాస్త లైటుగా –

ఒకప్పుడు నైమిశారణ్యంలో జరిగిన విషయం() ఇది. కాఫీ కలపడం ఏమన్నా బ్రహ్మవిద్యా? రాకెట్ సైన్సా? అని అక్కడి విద్వత్లోకం / విద్వల్లోకం (రెండిట్లో ఏది కరెక్టో తేల్చుకొనే బాధ్యత చదువరికి వదిలివేయడమైనది, తేల్చుకోవాలనిపించడం తెలుగుతల్లి చేసుకున్న పుణ్యమనీ, విద్వల్లోకం అనుటయే సరియనీ నాయనుమానము) లో చర్చోపచర్చలు జరిగి అన్నం పరబ్రహ్మ స్వరూపం కనకా, మనుషుల ఆహారములో కాఫీ ప్రధానభాగం కనకా – దేర్ ఫోర్, యెస్స్! కాఫీ కలపడం బ్రహ్మవిద్యే అనవచ్చని తేల్చారట. (ఇంచుమించు అను prefix = ఉపసర్గ = పూర్వప్రత్యయము=టిత్తు వాడటం మస్ట్ అని నియమం ఏర్పరచారట. ‘ఇంచుమించు’ వాడని వాడు ఎప్పుడు పడితే అప్పుడు కప్పెడు కాఫీ నొసంగని సుజనులు చొప్పడనట్టి వూరిలో అఘోరించెదరని కూడా సెలవిచ్చారట. ఎందుకనగా ఆ కాలములో కాఫీ త్రాగడం అంటే భ్రష్టత్వమని అనేకులు – ప్రాచ్యులు, పాశ్చాత్యులూ కూడా – నమ్మేవారుట.) అంతేకాక ఇది విష్ణువు వద్ద బ్రహ్మ నేర్చిన విద్య కూడా కనుక ఇది ఇంచుమించు బ్రహ్మవిద్యేనని నిర్ణయించారట.

అదెట్లన, ఇట్లు –

ఒకానొక సందర్భంలో బ్రహ్మ సృష్టికర్త బాధ్యతల్లో తలమునకలైపోయి అలిసి కునుకుతీస్తూ ఆవలించినప్పుడు ఆవలింతలోంచి ఒక రాక్షసుడు ఊడిపడతాడు. విష్ణువు ఏ…

అసలు టపాను చూడండి 382 more words