సత్యం=కాఫీ; మతం=ఫిల్టర్ అడుగున మడ్డి


YVR's అం'తరంగం'

పూర్వం ఎప్పుడో ఎక్కడో ఒక వూరుండేదిట. ఆ వూరిచుట్టూ చాలా ఎత్తైన పెద్ద ప్రహరీ గోడ. అవతల ఏముందో అందరికీ విపరీతమైన క్యూరియాసిటీ. అయితే ఎవరూ దాటి వెళ్ళరు, అది పడగొట్టనూలేరు. దాంతో గోడవతల వున్నదానిపై ఊరంతా ఊహాగానాలే కానీ, ఖచ్చితంగా ఏఁవుందో తెలిసినవాడు ఒక్కడూ లేడు. చాలా ఏళ్ళకి ఓ ముగ్గురు సాహసించి, అసాధ్యం అనుకున్న ప్రహరీ గోడ ఎక్కేసారు. అవతల ఏం అద్భుతం కనిపించిందో ఏమో ఒకడు అవతలి పక్కకి దూకేసాడు. ఇంకొకడు గోడ మీదే అలా కూచుని చూస్తూండిపోయాడు. మూడోవాడు తను చూసింది అందరికీ చెప్పడానికి గోడ దిగి వూళ్ళోకి వచ్చేశాడు. జనం బ్రహ్మరధం పట్టారు వాడికి. వాడు చెప్పిందంతా విని కధలుగా చెప్పుకునే వాళ్ళు. నూటికి తొంభైతొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది తొమ్మిది మందికి ఆ కధలు ఎంతవరకు నిజమో నిర్ధారించుకునే ధ్యాస వుండేదికాదు. గో.ది.వీ (గోడ దిగిన వీరుడు) చెప్పిన విషయాలు చిలవలు పలవలు చేసి చెప్పుకుంటూ వుండేవారు. వాటి మీద మీమాంసలు, భాష్యాలు, కావ్యాలు, సిద్ధాంతాలు, ఫర్ & అగైన్స్ట్ టీవీ చర్చలు … రోజువారీ పన్లు ఐపోయాక గ్రామస్తులకి ఇవే కాలక్షేపం. అంతలో ఇంకో కొత్త గో.ది.వీ తయారయ్యాడు. మొదటి గో.ది.వీ చెప్పిందంతా తప్పన్చెప్పి పాత సారానే కొత్తసీసాలో పోసాడు. ఇంక అక్కణ్ణుంచీ ఫాక్షన్స్,వర్గాలు, రాజకీయాలు మొదలయ్యాయి. .. కొత్తగా ఒకడు గోడ ఎక్కి చూసి వెనక్కి వచ్చినప్పుడల్లా ఒక కొత్త వర్గం తయారయ్యేది…

అసలు టపాను చూడండి 862 more words