దేవుడు చేసిన మనుషులా? మనుషులు చేసిన దేవుడా? మనుషులు ఈ ప్రశ్నలు వెయ్యటం ఆగిపోయింది. ప్రస్తుతం దేవుడే ఆ ప్రశ్నలు వేసుకోవాల్సిన పరిస్థితి మొదలైంది.
దేవుడే మనుషుల్ని చేసాడని చెప్పేది మనిషే
ఆ దేవుడు ఎలా వుంటాడో, ఎలా వుండాలో చెప్పేదీ మనిషే
దేవుడు ఏం చెప్పాడో, ఎవరికి చెప్పాడో చెప్పేది, అదీ ఓ మనిషే
దేవుడు నాకు తప్ప ఇంకెవరికీ కనబడడు, వినబడడు
అంచేత అందరూ నేఁచెప్పిన దేవుణ్ణే నమ్మాలంటాడో మనిషి
“ఇందుగలడందులేడను సందేహము వలద,”ను దేవుడే తనవాడని తెలిసీ
చెట్టుపుట్టారాయీరప్పల్లో ఆయన్ని కట్టేసేవాడూ మనిషే
తోటి మనిషికి దేవుణ్ణి చూసే హక్కు లేదనేవాడు మనిషి, అలా అంటే నమ్మేవాడూ మనిషే
ఒకడు తన దేవుణ్ణి భూమ్మీదకి రానివ్వడు,
వచ్చిన దేవుణ్ణి శిలువెక్కిస్తాడింకొకడు
దేవుణ్ణి చూడ్డానికి టికెట్లు కొనలేనివాణ్ని ‘నీ ఖర్మం’టాడు మరియొకడు
చేతల్లో దైవత్వం చూపలేడు, మాటల్తో దేవుడి కారెక్టర్ డిసైడ్ చేసేస్తాడు.
తను స్నానం చెయ్యడు కానీ పక్కవాడి ‘కంపు’ వదిలిస్తానంటాడు.
గబ్బిలాల కొంపకి కస్తూరీనిలయం పేరెడతాడు
మీ మొహాల్తగలెయ్యా! మీ హృదయాల్లోనే వున్నా!
నన్ను బయటికొదిలితే మీకు –
పాపాలు, క్షమాపణల పనులుండవురా!
అర్టిపళ్ళు, అగరొత్తులు అక్కర్లేదురా!
మూర్ఖత్వం, అతివాదం అవసరమే లేదురా!
అని ఎలుగెత్తే దేవుడికి అహంకారపు ఇటుకలూ, మమకారపు సిమెంటుతో అందమైన సమాధి ప్రతివాడూ కట్టేస్తుంటే –
“నేను మనిషిని చేశానా? మనిషే నన్ను చేసేస్తున్నాడా?” అని దేవుడికొచ్చిందో థాటు, ఆయనలో మొదలైందొక అస్తిత్వపు డౌటు.
(అలా దేవుడికి అస్తిత్వపు ప్రశ్నలు కల్పిద్దామని చూసిన హిరణ్యకశిపుడికి అలా ఇలా కాకుండా ‘అద్భుతం’గా విష్ణు’దర్శనం’ జరిగింది మరి!)
అంతా మనిషి చేసే చిత్రమే.
LikeLike
“నేను మనిషిని చేశానా? మనిషే నన్ను చేసేస్తున్నాడా?” అని దేవుడికొచ్చిందో థాటు, ఆయనలో మొదలైందొక అస్తిత్వపు డౌటు.” idi chaala bagundi. alage mee post motham kooda.
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike