కప్పు కాఫీతో చతుర్దశ భువనాలనీ చుట్టి వచ్చిన అనుభవం ….పధ్నాలుగో కాఫీ.


జాన్ లాక్ అన్నాయన మేటర్, మైండ్ రెండూ ఉన్నాయన్నాడు. బెర్క్లీ ఏమో మేటర్ లేదు, మైండ్ ఒక్కటే ఉందన్నాడు. డేవిడ్ హ్యూమ్ మరీ తీవ్రవాది, మేటర్, మైండ్ రెండూ లేవన్నాడు. పొద్దున్నే కాఫీ ఆఘ్రాణించి, ఆ ఆవిరుల్లో క్షణంలో సగం సేపైనా ఊర్ధ్వలోకాల్లో విహరించి తిరిగొచ్చినవాడెవడూ డేవిడ్ హ్యూమ్ వాదన ఒప్పుకోడు. వేడి వేడి కాఫీ గొంతులోంచి జారి వెన్నుపాము చుట్టూ మెల్లగా వెచ్చదనం పరుస్తూ ఉదరంలోకి చేరుకొని అక్కడనుంచి కెఫీన్ కిక్కుని శరీరమంతటికీ సరఫరా చెయ్యగా పాతాళంలో వున్న మైండు తలాతల, మహాతల, రసాతల, సుతల, వితల, అతలాలు దాటుకుని భూలోకంలో వచ్చి పడడం అనుభవైకవేద్యమైన వాడెవడూ బెర్క్లీ లాజిక్కునీ ఒప్పుకోడు. ఇమాన్యుయేల్ కాంట్ ఎగ్జాక్ట్లీ అదే చేసాడు. దానికంటే ముందు కాంట్ కాఫీప్రియత్వం, కాఫీ అడిక్షన్ అనడం కరెక్ట్, గురించి చెప్పుకుంటే బావుంటుంది. The Last Days of Immanuel Kant అనే పుస్తకంలో థామస్ డ క్విన్సీ ఇలా రాసాడు –

At the beginning of the last year of his life, he fell into a custom of taking, immediately after dinner, a cup of coffee, especially on those days when it happened that I was of his party. And such was the importance that he attached to his little pleasure that he would even make a memorandum beforehand, in the blank paper book that I had given him, that on the next day I was to dine with him, and consequently “_that there was to be coffee_.” Sometimes in the interest of conversation, the coffee was forgotten, but not for  long. He would remember and with the querulousness of old age and infirm health would demand that coffee be brought “upon the spot.” infirm health would demand that coffee be brought “upon the spot.” Arrangements had always been made in advance, however; the coffee was ground, and the water was boiling: and in the very moment the word was given, the servant shot in like an arrow and plunged the coffee into the water. All that remained, therefore, was to give it time to boil up. But this trifling delay seemed unendurable to Kant. If it were said, “Dear Professor, the coffee will be brought up in a moment,” he would say, _”Will be!_ There’s the rub, that it      only _will_ be.” Then he would quiet himself with a stoical air,  and say, “Well, one can die after all; it is but dying; and in the next world, thank God, there is no drinking of coffee and consequently no waiting for it.” When at length the servant’s steps were heard upon the stairs, he would turn round to us, and joyfully call out: “Land, land! my dear friends, I see land.”

కప్పు కాఫీతో చతుర్దశ భువనాలనీ చుట్టి వచ్చిన అనుభవం కాంట్ మాటల్లో వ్యక్తమౌతోందిగా?

అవుతోంది 🙂

అందుకే కాంట్ హ్యూమ్, బెర్క్లీల వాదాలతో ఏకీభవించలేదు. “మనస్సు లేకపోవడమేంటి? నిస్సందేహంగా వుంది. అది లేకపోతే ప్రపంచాన్నెలా అర్ధం చేసుకోగలుగుతున్నాము? ప్రపంచాన్ని అర్ధం చేసుకునే విధానాన్ని మనస్సే నిర్ణయిస్తుంది,” అనేసాడు. అంతేకాదు, “Concepts without percepts are empty, Percepts without concepts are blind,” అనికూడా అనేసాడు. రఫ్ గా ఇలా అర్ధం చేసుకోవచ్చు – “కాఫీ రుచి చూడకుండా (తాగకుండా) దాని గుణగణాలు జడ్జ్ చెయ్యడం ఖాళీ కప్పు పట్టుకుని అందులోలేని కాఫీని తాగడమే అవుతుంది. ఆస్వాదించడం తెలియకుండా కాఫీ తాగితే కాఫీత్వ జ్ఞానం సిద్ధించదు”

Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s