అందమే ఆనందం=ఖిల్తే హై గుల్ యహాఁ=Where Eagles Dare=11th cup


అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం .. పాడుకున్నప్పుడు, విన్నప్పుడు, అందులో ఏఎన్నార్ ఎక్స్ప్రెషన్స్ కి మురిసినప్పుడు

చల్లగా రావేలా , మెలమెల్లగ రావేల, వినీలా మేఘమాలా ... పాటలో బ్లాక్ & వైట్లో అందంగా పడే వర్షం చూసినప్పుడు

మేరె సప్నోంకి రానీ కబ్ ఆయేగీ తూ .. చూస్తూ, వింటూ ఆ సీన్లోకి వెళ్ళిపోయి రాజేష్ ఖన్నాతో జీపులోనో, షర్మిలా టాగోర్ తో టాయ్ ట్రెయిన్ లోనో ప్రయాణించేస్తున్నప్పుడు …

ఖిల్తే హై గుల్ యహా … పాడుకుంటూ శశికపూర్ తో సమానంగా రాఖీ కళ్ళల్లోకి చూస్తూ ఒళ్ళు మర్చిపోయినప్పుడూ

నవరంగ్ ధియేటర్లో Where Eagles Dare చూస్తూ రిచర్డ్ బర్టన్, క్లింట్ ఈస్ట్-వుడ్ తో కల్సి నాజీ ట్రూప్స్ ని నాశనం చేసేస్తూ పీకలోతు థ్రిల్లులో ములిగిపోయినప్పుడు

Raiders of the Lost Ark లీలామహల్లో చూసాక ఇండియానా జోన్స్ టైపు కెరీర్లో సెటిలైపోవాలని డిసైడ్ చేసుకుంటున్నప్పుడు..

(ఇవేకాదు ఇంకా చాలా వున్నాయి) … ఇవన్ని సందర్భాల్లోనూ కాఫీ గుర్తొస్తుంది,

వెంటనే వేడి వేడి కాఫీ తెల్లగా మెరిసిపోయే కప్పులో తాగాలనిపిస్తుంది.

అలా అనిపిస్తేనే పై సన్నివేశాలన్నీ నిజంగా, గాఢంగా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా చూసినట్టు.

కాఫీప్రియులే అలా చూడగలరు. అలా చూడగలిగిన వ్యక్తినే కాఫీత్వవాది అందురు. అతనికి కాఫీత్వ ఫిలాసఫీ తెలియకపోవచ్చు కానీ త్వరలోనే అతనికంటూ ఒక ఫిలాసఫీ, ఒక వరల్డ్ వ్యూ ఏర్పడిపోయి జీవితం కూడా అర్ధమైపోయి హాయిగా వుండగలుగుతాడు. జీవితంలో ప్రతీక్షణాన్ని – ఆ క్షణం తనకి కావలసినట్టు లేకపోయినానూ – ఎంజాయ్ చెయ్యడం ఎలాగో తెలిసినవాడై వుంటాడు.

ఇప్పుడు మీరు పదకొండో కప్పు కాఫీ(త్వ) తాగుతున్నారు.

KAAFEETVA9