సన్నాఫ్‌ సచ్చమూర్తిసినమా జూస్తాంటే…+ హర్యానాలో భగీరధుడు మళ్ళీ పుట్టాడు + నరసింహ నిందాస్తుతి :-(_/\_:-)


సన్నాఫ్‌ సచ్చమూర్తి సినమా జూస్తాంటే మంచి సందేశఁవీటానికి సినమా డైరట్టర్లు పడతన్న తంటాలు బాగ్గనబడతన్నాయ్. కత సరే బీ, సీ సెంటర్లోళ్ళ కోసం సానా పిల్లిమొగ్గలేసింది, డబ్బుల్రావాల్నంటే తప్పదుగా మరి! అంత కట్టపడ్నా డైలాగులినేటోడగపడ్డే! బన్నీ అగపడతానే ఈలలుగొట్టి గోలజేసే ఘూట్లేగాళ్ళెక్కువ, తిరిక్రం జెప్పేదినేటోళ్ళు తక్కువ. డైలాగులింటాకొచ్చినోళ్లకి ఈల్లే ఎక్కువినబడతన్నాయ్.

*********

భగీరధుడు మళ్ళీ పుట్టాడు హర్యానా గవర్నమెంటు రూపంలో. ఆకాశగంగ కోసం కాదు. సరస్వతినదిని తిరిగి ప్రవహింపజేయటానికి. ఐడియా బావుంది. ఫీల్ గుడ్ ఐడియా ఫర్ ద అడ్మైరర్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్,ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. ఆ సరస్వతి నది మళ్ళీ ప్రవహించ బోతోంది. మరో సరస్వతి నది ఇంకిపోతోంది. సరస్వతి(=చదువు), నది(= మంచినీళ్ళు) కార్పోరేట్ బిజినెస్సుల చేతుల్లో కమర్షియలైజయి పోయి చదువు జీతాలిచ్చే ఉద్యోగాల్లోకీ, భూగర్భజలాలు ప్లాస్టిక్ బాటిల్స్ లోకీ ఇంకిపోతున్నాయి. వాటినీ రివైవ్ చెయ్యాలి.

ఎవరు?

అదే తెలీదు 😦

*********

త్రిలింగ లేక తెలుగు నేలకి (నేలలకి అనాలేమో?) గవర్నర్ నరసింహన్ పై విమర్శనాస్త్రాలు పడ్డాయ్. అవి ఆయన మీద పడ్డానికి ఆయన బాధ్యత ఎంతో, అందులో న్యాయమెంతో తెలీదుకానీ ఆయన కార్యనిర్వాహకత్వంపై వచ్చిన ఒకానొక ఎడిటోరియల్లో మొదటిభాగం అంతా రాష్ట్ర గవర్నర్లు “పోషించే”రాజ్యాంగ విరుద్ధ రాజకీయపాత్రల పై , నరసింహన్ కేంద్రప్రభుత్వం ఏజెంట్ లా ప్రవర్తించడంపై విరుచుకుపడింది. బానేవుంది ఎవరి ఒపీనియన్ వాళ్ళది అనుకున్నా. రెండోభాగం చదివేప్పటికి ఎవరి డబుల్ టంగ్ వాళ్ళది అనుకోవాల్సొచ్చింది. రెండోభాగం నరసింహన్ మీద కాదు, గవర్నర్ పదవిపై అంతకంటే కాదు. తొంభై ఐదులో ఎన్టీయార్ స్థానంలో సీబీఎన్ ముఖ్యమంత్రి కావడంలో పీ.వీ.నరసింహారావు పాత్ర గురించి. ఆయన సాయంతో అప్పటి ఏపీ గవర్నర్ సీబీఎన్నుని ముఖ్యమంత్రిగా ఆహ్వానించారుట. ప్రధాని మాట గవర్నర్ వినడం వల్లే అది సాధ్యమైందిట. అందుకే సీబీఎన్ పీవీకి దిల్లీ లో స్మారక చిహ్నం కోసం ప్రయత్నించి, సాధించి పీవీ ఋణం తీర్చుకున్నార్ట.
రెండు రాష్ట్రాల్లోనూ “నిష్పక్షపాతంగా” ఏ పనిచెయ్యకుండా వుంటున్నాయన్ని తిట్టి , పీవీ మాట విని ఫేవర్ చేసిన గవర్నర్ ని సమర్ధించడవేంటో !!! పాఠకులకీ, గవర్నర్లకీ తికమక. ప్రధాని మాట కాదు, ముఖ్యమంత్రి మాట వినమనా? రాష్ట్రపతేంకావాలి మరి?
దీనిభావం తిరుమలేశుడికే వదిలేయ్యడం మంచిది. మనచేతిలోవున్నది ఆర్టికల్ కి మంచి పేరు పెట్టడం. అది నరసింహ నిందాస్తుతి. గవర్నర్ నరసింహ నింద, పీ.ఎమ్. నరసింహ స్తుతి.

*********