నిన్న రాత్రి సింహం కల్లోకి వచ్చి ఈ పద్యం చదువుతూ, కళ్ళనీళ్ళు పెట్టుకుని ముక్కు చీదుకుంది.
గాడిని దప్పిన కొడుకును
గాడిద కొడుకంచు తండ్రి కటినము జూపన్
వీడా? నాకొడుకంచును
గాడిద యేడ్చెను గదన్న ! ఘన సంపన్నా !
‘ఎందుకా పద్యం చదువుతున్నావ్?’ అంటే ‘నా పరిస్థితీ పద్యంలోని గాడిద పరిస్థితిలాగే ఉందం’ది. ‘ప్లీజ్, ఎక్స్ప్లెయిన్,’ అన్నాను.
“అడవుల్లో ఉండే నేను ఇలా తప్ప ఎలా ఉండగలను? మీలా మాకు బుద్ధీ ,జ్ఞానం, సాంఘికజీవనం, మనోభావాలు, ఎట్సెట్రా డెవలప్ అయ్యే అవకాశం లేదు. అది తెలిసీ నా ఇమేజి డామేజ్ చేసెయ్యడం ఏం బాలేదు. ఇప్పుడు నా మనోభావాలు దెబ్బతిన్నాయ్. అయాం హర్టెడ్,” అంది. కంటిన్యూ చేస్తూ, ” పవన్ అంతటివాడు నాతో తనని కంపేర్ చేసుకుంటే ఎంత సంబరపడ్డానో, గాలి మొత్తం తీసేసావు. మీ సొసైటీలో పవన్, ఐ మీన్ గౌతమ్ నందా ఆఫ్ అత్తారింటికి దారేది ఎంత గొప్పో మా అడవిలో నేనూ అంతే. అడవికీ, సివిల్ సొసైటీకి వున్న అంతరాన్ని దృష్టిలో వుంచుకుంటే నువ్వు నన్ను అసహ్యించుకునేవాడివి కాదు గదా! ఇప్పుడర్ధమైందా? పద్యంలో గాడిదదీ, నాదీ ఒకటే పరిస్థితని ఎందుకన్నానో,” అంది. కొంచెం అర్ధమైనట్టేవుంది ఐనా ఇంకొంచెం క్లారిటీకోసం, “గౌతమ్ నందా అర్ధం చేసుకున్నట్టుగా నేన్నిన్ను అర్ధం చేసుకోలేదంటావ్, అంతేగా,” అన్నాను. “ఎగ్జాక్ట్లీ,” సింహం కళ్ళలో మెరుపు. మళ్ళీ అన్నాను, ” కొందరు మనుషులకుండే మృగ లక్షణాలు సింహంలో…
View original post 236 more words