వంద రోజుల సినిమా ఎన్ని షోలు పడినా తిరిగే రీలూ, తిప్పే ‘చెయ్యీ’ ఒకటే ఒకటే


సంకీర్ణపుటడవిలో ‘మన’మోహనసింగం దాగినా, ప్రజనెత్తిన  సోనియమ్మ తుగ్లక్కుని రుద్దినా

అవి’నేత’లు జైల్-టు-బెయిల్ యాత్రా స్పెషలేసినా, టేకోవర్ చెయ్యమంటు పార్టీ నే(మే)తలు గోలెడుతున్నా

స్టేట్ ఆఫ్టర్ స్టేట్ ‘చెయ్యి’ జారిపోతున్నా,  2Gలు, తాజాగా మాజీలు ‘హస్త’ గతం అవుతున్నా

‘అమ్మ’మాట నీరెత్తిన నిమ్మకిప్పుడింత నిర్వేదం ఎందుకు? అజ్ఞాతపు రావి కింద జ్ఞానతపస్సెందుకు? తల్లీ,చెల్లీ,బావలతో కన్సెన్సస్ కుదరకా?

ఏమో మరి! ఏమో మరి! ఏమో మరి!

కాంగ్రెస్ టీ కప్పులోన సంస్కరణల తుఫానా? డైరెక్టుగ తిరుగుబాటు తల్లికి అవమానమా? తిరుగుబాటు కన్నా తిరుగుడు బాటే నయమా?

ఏమో మరి! ఏమో మరి! ఏమో మరి!

వంద రోజుల సినిమాఎన్ని షోలు పడినా తిరిగే రీలూ, తిప్పే ‘చెయ్యీ’ ఒకటే ఒకటే