ప్చ్! ప్చ్! ప్చ్! – ఒకటోసారి ;-)


YVR's అం'తరంగం'

>ఎక్కడో వేరే దేశంలో కుక్కపిల్ల పుట్టినా మనకి వార్తే. ఎక్కడో మునిసిపల్ కమిషనర్ పోయినా పెద్ద వార్తే?
>ప్రతీరోజూ ఎక్కడో ఒక చోట దేశనేతలు పోతూనేఉంటారు వాళ్ళందరికీ అసెంబ్లీ నివాళులివ్వడం భజన కాదా?
>పెద్ద లీడర్లకి నివాళి ఇవ్వచ్చు కానీ స్వర్గస్తులైన సినీప్రముఖులకీ ప్రభుత్వం నివాళి ఇవ్వాలి.
>ఇంకా నయం నివాళితో సరిపెట్టారు, సింగపూర్ వెళ్తాం అన్లేదు (P.N. పీ.ఎమ్, సీ.ఎమ్ ఇద్దరూ వెళ్తున్నారు)
ఇవి ఏపీ శాసనసభ సింగపూర్ మొదటి ప్రధాని లీ కువాన్ యూ నివాళులిచ్చిన సందర్భంగా ఓ తెలుగు వెబ్-జైన్ విమర్శ రాస్తే , దానిపై కొందరు పాఠకుల కామెంట్సు. వీటిలో పాఠకుల విజ్ఞత , విజ్ఞానం చూసి నవ్వాలా ఏడవాలాని తీవ్రంగా అలోచించి ఎటూ తేల్చుకోలేక చివరికీ టపా రాస్తున్నా.

విమర్శలు, వ్యాఖ్యానాలూ తప్పుకాదు కానీ బోడి గుండుకీ మోకాలికి ముడి పెట్టడం – అదీ గాంభీర్యత చూపాల్సిన విషయాల్లో – అసహ్యంగా ఉంది.
వెబ్-జైన్స్, సినిమాలూ, సెన్సేషన్ల మీద బతికేసేవి – ఇలాంటివాటిల్లో జర్నలిస్టిక్ స్టాండర్డ్స్ కోసం చూడ్డం, అవి ఫోర్త్ ఎస్టేట్ బాధ్యతలు నెత్తికెత్తు కుంటా యనుకోవడం బుద్ధి తక్కువే. But, కీర్తిశేషులైన వ్యక్తులని తక్కువ చేసి మాట్లాడ్డం అవసరమా ? వీళ్ళ కంప్లెయింట్ ఏంటంటే ఏపీ లో ఇప్పుడు పాలనంతా సింగపూర్ స్ఫూర్తితోనే నడుస్తోందిట, అందువల్ల ఏపీ ప్రభుత్వం ఓవరాక్షన్ చేస్తోందిట. అక్కడితో ఆపితే ఫ్రీడం ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని వదిలేయచ్చు…

అసలు టపాను చూడండి 461 more words