పవన్-కళ్యాణ్ కీ,సింహానికీ గడ్డం గీసుకోడంకంటే ఎక్కువ తేడాలున్నాయనీ..అనీ..అనీ..


పవన్ కళ్యాణ్ అభిమానులకి తొందరపడి/కష్టపడి మనోభావాలు దెబ్బతీసేసుకోవద్దని ప్రార్ధన. పూర్తిగా చదివాక అప్పుడు చూసుకోవచ్చు. ఓకే! ఫ్రాంక్లీ ఐ డింట్ లైక్ పీకే కంపేరింగ్ హిమ్-సెల్ఫ్ విత్ ఏ లయన్. ఇలా అన్నందుకు నేను బాలకృష్ణ అభిమానినని ‘లయన్’ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న ఎన్.బి.కె అభిమానులు పండగ చేసుకుంటారనే భయంలేదు. ఎందుకంటే, హూ యామ్ ఐ టు ఆల్ దోజ్ ఫాన్స్? అండ్ …

హూ యామ్ ఐ టు ఇన్ఫ్లుయెన్స్ ఎనీవన్’స్ ఒపీనియన్స్?

అర్జునుడు బాణం సంధించడానికి సందేహిస్తుంటే పరమాత్మ, “ఫ్రీగా నీ స్వధర్మం అనుసరించి బాణాలు వేసేయ్, ఫలితాలు నాకొదిలెయ్,” అన్నాడు. అలాగే చేసి అర్జునుడు చివరికి మంచి ఫలితాలే పొందాడు (అనుకోవచ్చు). వేసింది బాణాలు కనక అవి అర్జునుడివి కనక, అవి తగిలినవాడు రియాక్ట్ అయ్యే ప్రశ్నే లేదు కనక, రియాక్టయినా పక్కనే భగవంతుడున్నాడు కనక సరిపోయింది. అదే మనలాంటివాళ్ళం ఆ పని చేసి బతికి బయట పడడమే? మనకసలే కృష్ణుడు ఆమడ… నో, నో, వెయ్యామడల దూరంలోకూడా ఉండడయ్యే.

కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పి ఐదువేల + సంవత్సరాలైంది. అప్పుడు మీడియా లేదు, గొడవలొస్తే విజయమో వీర స్వర్గమో అనో , రాజ్యం వీరభోజ్యం అనో జస్టిఫై చేసేసుకుని యుద్ధం చేసేయడమే. ఇప్పుడా పరిస్థితిలేదు. బాణాలు పోయి వాగ్బాణాలు వచ్చాయి. వాక్స్వాతంత్రానికి బ్లాగ్స్వాతంత్రం తోడైయింది. వాగ్బాణాలు, బ్లాగ్బాణాలు ఎవరి ప్రాణాలు తియ్యకపోయినా అవి తగిలినవాళ్ళు మాత్రం ప్రాణాలు తీసేస్తున్నారు. పూర్వం ధర్మంవైపు దేవుడు- ఆయుధంతోనో, లేకుండానో – నిలబడేవాడు. ఇప్పుడాయనా కమిట్ అవట్లేదు, ఎందుకంటే తను చెప్పింది మొత్తం అర్ధం చేసుకుని ఆచరించేవాళ్ళ కన్నా అందులో ఏదో ఒక ముక్క పట్టుకుని తక్కినవి వదిలేసి సొంత భాష్యాలు చెప్పేవాళ్ళే మెజారిటీ. ఇవాళ ధర్మాత్ముడు అనుకున్నవాడు అనుకున్నపని కాగానే నెత్తెక్కుతున్నాడు. ధర్మరాజు & ఫామిలీలాగా కొన్నాళ్ళు పాలించి మహాప్రస్థానం చేసే ఉద్దేశం ఎవడికీ లేదు. అందుకే ఆయన న్యూట్రల్ స్టాండ్ తీసుకున్నాడు. కలియుగ ధర్మం, అంతే.

మరి

ప్రాణాలను తీసేసే
బాణాలేనా, చీకటి
కోణాలను త్రవ్వితీయు వా
గ్బాణాలకు కలుగు ప
రిణామాల మాట చెప్పు 
ప్రణామము కృష్ణా!

– అని అర్జునుడు స్పెసిఫిగ్గా అడిగాడా అంటే గుర్తులేదు కానీ కృష్ణుడు క్వాలిటీ ఆఫ్ స్పీచ్ గురించి –
అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియ హితం చ యత్
స్వాధ్యాయాభ్యసనంచైవ వాజ్మ్ఞయం తప ఉచ్యతే  — అన్నాడు.

ఎవరినీ నొప్పించకుండా సత్యమైనవి, ప్రియమైనవి, మేలు కలిగించేవి అయిన మాటలు మాట్లాడాలని స్థూలంగా అర్ధం. బానేవుంది. అలానే మాట్లాడతాం. మాట్లాడితేనే బాణం వేస్తామనే జనం తయారయితే ఎలాగో కృష్ణుడు చెప్పాడా? కృష్ణుడొక్కడిదేనా ఈ బాధ్యత? ఇతర దైవాంశ సంభూతులు, దూతలు, నేతలు … వీళ్ళూ మనిషి ప్రవర్తన ఎలా వుండాలో చెప్పారుగా. వాళ్ళేమన్నారో అదీ స్టడీ చెయ్యాలి.

Now,

Coming to the reality of the situation, వాగ్బాణం అంటేనే షార్ప్-నెస్ ఆఫ్ వర్డ్స్ అని. అలాంటి బాణాలు తగిలి నిజం బాణాలు వేసే స్తున్నారు. మొన్న అవిజిత్ రాయ్ హత్యే నిదర్శనం. అవిజిత్ ఫలితం గురించి ఆలోచించకుండా వాగ్బాణం వేశాడు. అవిజిత్ ఫలితం గురించి ఆలోచించకుండా వాగ్బాణం వేశాడు. ఆలోచించినా సొసైటీలో మార్పు అనే ఫలితం ఆలోచించాడుగానీ తనే మొదటి “ఫలితం” అందుకుంటా నను కోలేదు. అవిజిత్ ఏమిటి మూడువేల ఏళ్ళనాటి సోక్రటీజ్ నుంచి ఇప్పటి వరకూ వాగ్బాణాలు అవతలివాడి మనోభావాల్ని బట్టీ వేయాలనే జాగ్రత్త తీసుకునేవాళ్ళు తక్కువే. ప్రేమోన్మాది, మతోన్మాది, సిధ్ధాంతోన్మాది, అధికారోన్మాది … ఇలాంటి వాళ్ళ మీద పూలబాణాలు వేసినా వాళ్లకి గుచ్చు కుంటాయి. మన్మధుడైనా వీళ్ళంటే భయ పడాల్సిందే. (అలా అని శివుణ్ణి ఈ డిస్కషన్ లోకి తేవట్లేదండోయ్, మన్మధుడంటే మన లోకంలో తిష్ట వేసాడు గానీ శివ ఈజ్ అబౌ అండ్ బియాండ్ సచ్ మన్డేన్ మేటర్స్) ఉన్మాది టైపు మనోభావాలు లాజిక్కుకి లోంగేవి కావు. లాజిక్ అంటేనే భిన్నా భిప్రాయానికి అవకాశం ఉందని కదా అర్ధం. పై జాతి, అభిప్రాయాల్ని వినిపించటం ప్రజల నెత్తిన రుద్దటం తప్ప వినడం తెలీని జాతి. మనం పువ్వనుకుని వేసింది వాడికి బాణం అనిపిస్తుంది. బహుశా ఇది బాగా అర్ధమైనవాడు కనక కృష్ణమూర్తి దుర్యోధన & కో పై నిజం బాణాలు వేయిన్చేసాడు. నిజానికి రాయబార సమయంలో ప్రస్తుతప్రపంచంలో ఉన్న వితండతండాల స్వభావాన్ని దుష్టచతుష్టయం తన్ని చంపాలని చేసిన కుట్రల  రూపంలో గ్రహించాడు.

ఒకసారి సద్దాం హుసేన్ తన కాబినెట్ తో మీటింగ్ పెట్టి తను కొత్తగా పెట్టదల్చుకున్న పాలిసీ ఒకటి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి అందర్నీ ఒపీనియన్స్ చెప్పమన్నాట్ట. అందరూ నేలచూపులు చూస్తుంటే కొత్తగా చేరిన ఒకడు తన సూచనలు అంటూ ఏదో కొంచెం మాట్లాడాడు. అందరి ముందూ అతన్ని ఎప్రిషియేట్ చేసిన సద్దాం అతన్ని పక్క రూం లోకి రమ్మన్నాడు. వెళ్ళాక తలుపులేసి రివాల్వర్ తీసి ఆ సొంత అభిప్రాయం అనేది ఉంది/ఉంటుంది అని భ్రమపడిన మంత్రిని షూట్ చేసి వచ్చి మీటింగ్ లో కూచున్నాడు. మంత్రిని కాదు, సొంత అభిప్రాయం అలియాస్ స్వతంత్ర ఆలోచన అన్నదాన్ని చంపేశాడని మిగిలిన మంత్రులందరూ అర్ధం చేసేసుకున్నారు. చస్తారా? ఫ్రెడరిక్ ఫర్సిత్ రాసిన ఫిస్ట్ ఆఫ్ గాడ్ లో ఇది చదివాను. అతను రీసెర్చి చేసే రాస్తాడు, యూజువల్లీ, కనక నమ్మచ్చు.

పవన్ కళ్యాణ్ పేరు చూసి టపా ఓపెన్ చేస్తే ఈ సుత్తేంటి మధ్యలో అని అదుగోఎవరో విసుక్కుంటున్నారు. I have just realized I am digressing, చెప్పాలనుకున్న సబ్జెక్ట్ బుర్రలోంచి ఎగిరిపోయింది. గుర్తు చేసుకుని నెక్స్ట్ పోస్ట్ లో రాస్తా… (to be contd…)

****

PariNaamam