ప్చ్! ప్చ్! ప్చ్! – ఒకటోసారి ;-)


>ఎక్కడో వేరే దేశంలో కుక్కపిల్ల పుట్టినా మనకి వార్తే. ఎక్కడో మునిసిపల్ కమిషనర్ పోయినా పెద్ద వార్తే?
>ప్రతీరోజూ ఎక్కడో ఒక చోట దేశనేతలు పోతూనేఉంటారు వాళ్ళందరికీ అసెంబ్లీ నివాళులివ్వడం భజన కాదా?
>పెద్ద లీడర్లకి నివాళి ఇవ్వచ్చు కానీ స్వర్గస్తులైన సినీప్రముఖులకీ ప్రభుత్వం నివాళి ఇవ్వాలి.
>ఇంకా నయం నివాళితో సరిపెట్టారు, సింగపూర్ వెళ్తాం అన్లేదు (P.N. పీ.ఎమ్, సీ.ఎమ్ ఇద్దరూ వెళ్తున్నారు)
ఇవి ఏపీ శాసనసభ సింగపూర్ మొదటి ప్రధాని లీ కువాన్ యూ నివాళులిచ్చిన సందర్భంగా ఓ తెలుగు వెబ్-జైన్ విమర్శ రాస్తే , దానిపై కొందరు పాఠకుల కామెంట్సు. వీటిలో పాఠకుల విజ్ఞత , విజ్ఞానం చూసి నవ్వాలా ఏడవాలాని తీవ్రంగా అలోచించి ఎటూ తేల్చుకోలేక చివరికీ టపా రాస్తున్నా.

విమర్శలు, వ్యాఖ్యానాలూ తప్పుకాదు కానీ బోడి గుండుకీ మోకాలికి ముడి పెట్టడం – అదీ గాంభీర్యత చూపాల్సిన విషయాల్లో – అసహ్యంగా ఉంది.
వెబ్-జైన్స్, సినిమాలూ, సెన్సేషన్ల మీద బతికేసేవి – ఇలాంటివాటిల్లో జర్నలిస్టిక్ స్టాండర్డ్స్ కోసం చూడ్డం, అవి ఫోర్త్ ఎస్టేట్ బాధ్యతలు నెత్తికెత్తు కుంటా యనుకోవడం బుద్ధి తక్కువే. But, కీర్తిశేషులైన వ్యక్తులని తక్కువ చేసి మాట్లాడ్డం అవసరమా ? వీళ్ళ కంప్లెయింట్ ఏంటంటే ఏపీ లో ఇప్పుడు పాలనంతా సింగపూర్ స్ఫూర్తితోనే నడుస్తోందిట, అందువల్ల ఏపీ ప్రభుత్వం ఓవరాక్షన్ చేస్తోందిట. అక్కడితో ఆపితే ఫ్రీడం ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని వదిలేయచ్చు. ఆగలేదు. మనకి సంబంధం లేని వ్యక్తికి, భారత్ తో పరిచయంలేని వ్యక్తికి అంత ఎత్తున నివాళి ఘటించాలా అని ప్రశ్నించారు. ఈ పార్ట్ అత్యనవసరం. ఎందుకంటే లీ కువాన్ యూ అనే పర్సనాలిటీ ఇండియాలో ఉన్న ప్రతీ రాజకీయ పార్టీకి ఒకళ్ళు ఉండాల్సినంత పవర్ ఫుల్ పర్సనాలిటీ. గాసిప్స్ తో బతికే వెబ్-జైన్స్ కి అందనంత స్థాయి ఉన్న పర్సనాలిటీ. చిత్తశుద్ధి ఉన్న ప్రతీ మంత్రి, లేజిస్లేటరు, నాయకుడూ తప్పనిసరిగా స్టడీ చెయ్యాల్సిన ‘లీ’డర్. ‘లీ’డర్ ఎందుకంటే అనవసర రాజకీయాలు చేసేవాళ్ళకి, ఎఫిషియెన్సీ, డిసిప్లిన్ లేనివాళ్ళకి లీ అంటే డర్, హడల్!

>అవినీతి, రాజకీయ మాల్ ప్రాక్టీస్ లపై నోరెత్తడానికి భయపడే నిజాయితీపరులు
>ప్రజలతో టచ్ గానీ, సమస్యల పై ప్రత్యక్ష అవగాహనగానీ లేని లీడర్లు
>సినీగ్లామర్ వాడుకుని వోట్లు సంపాయించుకోవాలనుకునే పార్టీలు
>మతాలూ, దేవుళ్ళు, ప్రాంతీయత, భాష లాంటి సెన్సిటివ్ ఇష్యూలని కెలికి వోట్ బాంకుల్ని తయారుచేసుకునే ప్రజాప్రతినిధులు
ఈ టైప్స్ కన్నా కనీసం లక్ష రెట్లు గొప్ప పర్సనాలిటీ మిస్టర్ లీ. నాయకుడికి మంచితనంతోపాటు, అన్ని విషయాలపై అవగాహన, ఆచరణలో పెట్టగల సమర్ధత, తన పార్టీపై తిరుగులేని పట్టు ఎలా వస్తుందో ఆచరణలో చూపించిన యూనివర్సిటీ మిస్టర్ లీ.

మలయాకి 1965లో స్వతంత్రం వచ్చే సమయానికి ఆ దేశంలో అంతర్భాగంగా ఉన్న సింగపూర్ ని రాజకీయ కారణాలతో బయటికి వెళ్ళగొట్టినప్పుడు లీ కాక ఇంకే నాయకుడైనా ఆయన స్థానంలో ఉండివుంటే సింగపూర్ పరిస్థితి ఎలావుండేదో ఊహించడం కష్టం. ఏ విధమైన సహజవనరులు లేని, ప్రజల్లో చదువున్న వాళ్ళు ఎక్కువగా లేని(1965లో) అతి చిన్నదేశం, దేశంగా తన అస్తిత్వాన్ని యాభై ఏళ్ళపాటు నిలుపుకుందంటే లీ తీసుకున్న నిర్ణయాలు, అమలుచేసిన విధానం మూలకారణాలు.
నెహ్రూ అభిమానిగా ఆయన పాలిసీలని ఆదర్శం చేసుకుని తన దేశాన్ని మల్చుకుందామనుకున్నా త్వరలో ఆ అభిప్రాయం మార్చుకుని సోషలిస్టు విధానాలు లాంగ్ టర్మ్ లో పనికిరావని గ్రహించి దేశాన్ని తిరుగులేని అభివృద్ధి మార్గంలో నడిపిన దూరదృష్టి, అనుభవం, pragmatism (వ్యవహారజ్ఞానం) ప్రతీ లీడరుకీ ఉండవు.
తను ప్రధాని అయిన కొత్తలో బెంగుళూరుచూసి తన దేశాన్ని అలా గార్డెన్ సిటీగా తయారుచెయ్యాలనుకున్న ఆయన సంకల్పం ఇప్పుడు సింగపూర్ కి ప్రపంచమంతటా అభిమానుల్ని సంపాదించి పెట్టింది. ఇప్పటి బెంగుళూరు సంగతేమిటి? నాయకులకి టేస్టు, విజన్, డిటర్మినేషన్ లేకనే కదా అలా వుంది?

కొన్ని మంచిపనులు ప్రజలకి మొదట అంతగా రుచించకపోయినా వీలయినంత ఎక్కువగా వివిధ ఫోరాల్లో చర్చించి , చర్చించి అమలుచేసి మంచే జరిగిందని ఫలితాల ద్వారా ప్రజల్ని కన్విన్స్ చెయ్యగల ముక్కుసూటితనం, ఆత్మవిశ్వాసం ఆయన సొంతం.

పీ.ఎమ్, సీ.ఎమ్ ఇద్దరూ సింగపూర్ వెళ్తున్నారు. ఇద్దరికీ, ముఖ్యంగా ఏపీకి లీ కువాన్ యూ విధానాల అవసరం ఇప్పుడెంతో ఉంది. సింగపూర్ యాభై ఏళ్ళపాటు సహజవనరులు లేకుండా ఎలా ప్రపంచంలోనే అతి ఎక్కువ తలసరి జాతీయ ఆదాయం ఉన్న దేశంగా ఉందంటే ఇండియాకి సంబంధించి సింగపూర్ ప్రాధాన్యత ఎంతో ఉంది.
“Singapore is Asia’s future. It represents a level of excellence that even huge countries like India and China envy. And that is largely because of Lee who transformed what a British politician called a ‘pestilential and immoral cesspool’ into a glittering global city with the world’s highest per capita income as well as the highest percentage of home ownership,” అని రెడిఫ్ లో సునందా కే. దత్తా రే అన్నారు. (http://www.rediff.com/news/special/its-ok-lah-lee-kuan-yew-sleeping-now/20150325.htm)

దీన్నిబట్టీ సీ.ఎమ్, పి.ఎమ్ లు సింగపూర్ మోడల్ కి, దాన్ని తీర్చిదిద్దిన ఆర్కిటెక్టుకి ప్రాధాన్యత ఇవ్వడంలో తప్పేమిటో ఆ వెబ్-జైన్ వాళ్ళకే తెలియాలి.

ఇవన్నీ తెలియకుండా (తెలిసినా తమకిష్టంలేనివాళ్ళని తిట్టడానికి తెలీనట్టుండి) ఆయన్నో అల్లాటప్పా మనిషిలా మర్యాదలేకుండా ఇంకెవరిపైనో చేసే విమర్శ లోకి తీసుకురావడం అవసరమా? భావ్యమా?
Please note, మంచి సాంప్రదాయమా అనట్లేదు ఎందుకంటే జర్నలిజంలో మంచి సాప్రదాయాలుంటాయని జనమూ, జర్నలిస్టులూ మర్చిపోయే ప్రాసెస్ వేగంగా జరిగిపోతోంది. మీడియా కమర్షియల్ అయిపోయి జర్నలిజం స్టాండర్డ్స్ అడుగంటుతున్నాయి.

మరి జనం సంగతీ? వాళ్లకి ఈ స్టాండర్డ్స్ ఏమిటో ఎందుకో తెలీని పరిస్థితి. ఐడియాలజీ తో పనిలేని కమర్షియల్ రాజకీయాలు + గాసిప్స్+సినిమా క్రేజ్ + కన్జ్యూమరిస్ట్ లైఫ్ స్టైల్ – ఇవి వాళ్ళ దృక్పధాన్ని డామినేట్ చేస్తుంటే విలువల అవసరం ఎలా తెలుస్తుంది? ప్చ్!

******