:-) మార్క్ ట్వైన్, ఆరుద్ర, Writer’s itch & మృగాళ్లు – This is about Pen, Gun and Men :-)


YVR's అం'తరంగం'

నువ్వు రాయాలనుకున్నదేదో పూర్తిగా రాసాకగానీ నువ్వేం రాయాలనుకున్నావో క్లారిటీ రాదు, నిజానికి రాయటం అప్పుడు మొదలౌతుంది అని మార్క్ ట్వైన్ ఉవాచ. ఇదేదో ఆరుద్ర గారి ఫిలసాఫికల్ ఉవాచ – నేనెక్కాల్సిన రైలు ఒక జీవితకాలం లేటుకి లిటరరీ ఈక్వలెంటులా ఉందే అనిపిస్తోందా. యూ ఆర్ రైట్. ఈ ఆర్టికిల్ ఇంతకుముందు పోస్ట్ చేసినప్పుడు ఆరుద్ర గారి పద్యం ఆధారంగా మృగాళ్ళని తిట్టడం నా ఉద్దేశం. రెండ్రోజులాగి రీ-బ్లాగ్ చెయ్యబోతూ ఎడిట్ చెయ్యడంలో రూపు మొత్తం మారిపోయింది. This is a ‘great’ writing experience for my small self. ఎంత చెట్టుకి మొక్కకి అంత ‘గాలి’ మరి.

ఆరుద్ర పద్యం ఇదీ –

మెన్‌
ఆమెన్‌
చెరపట్టన్‌
మ్రోగెన్‌
నీగన్‌
నా
పెన్‌
ఆపెన్‌ (త్వమేవాహం పుట 36-37)
Your gun shoots and my pen stops the molesters that are after the helpless woman -ఇదీ మీనింగ్ .
నాకున్న భాషాపరిమితుల్తో ఇంతకంటే బాగా రాయటం కుదరదు మరి.
ఆరుద్రగారి త్వమేవాహంలోదిట ఈ పద్యం. ఇవాళ విశాలాంధ్రలో చదివాను. ( ఇక్కడ కొంచెం పిడకల వేట – “ట” అన్న ఒక్క అక్షరం ఎంతగొప్పదో ఇప్పుడర్ధం అవుతోంది. పెద్ద పెద్ద వాక్యాలతో ఎక్స్ప్లనేషన్లూ, డిస్క్లైమర్స్ రాయవసరంలేకుండా జస్ట్ ఒక్క “ట” యాడ్ చేస్తే చాలు. విషయం మన సొంతం కాదని, ఆ పరిజ్ఞానం…

అసలు టపాను చూడండి 523 more words