చంబల్ లోయలో, ఒళ్ళంతా నగలతో- దోపిడీ చేసే హక్కు ఎవరికీ ఎప్పటికీ లేదు- అని, బందిపోట్లు “చదివేలా”, బోర్డు తగిలించుకుని


ఇండియాస్ డాటర్ రేపిన దుమారంతో మేధావులూ, సంస్కర్తలూ, రకరకాల ‘ఇస్టు’లు – అదేనండీ ఫెమినిస్టులు, సోషల్ ఎనలిస్టులు, కాలమిస్టులు, ఎట్సెట్రాలు ఒక్కసారి ఒంటికాలిమీద లేచారు. ఇన్ని రకాల ‘ఇస్టు’ల్నిరెచ్చగొట్టిన మరో ‘ఇస్టు’ ఒక రేపిస్టు. తనలోఉన్న పురుషాహంకార పంది (male Chauvinist pig)ని బీబీసీ ద్వారా బయటకొదిలి పరుగులు పెట్టించి వాడీ వివిధ ‘ఇస్టు’ల్ని “చైతన్య”పరిచాడు. ఇక్కడ “చైతన్యం” = గడ్డి మంట అనుకుంటే చాలు అది ఎందుకు రెండు మూడ్రోజుల్లో చతికిలబడిందనే డౌటు రాదు. రేపిస్టు తప్పించి ఇతర వివిధ మంచి ‘ఇస్టు’ల్లో పొంగిన చైతన్యం సడెన్ గా చతికిలబడిందంటే బడదా మరి? ఆ చైతన్యం కలిగేది వాళ్ళలోని రిఫార్మిస్టు వల్లకాక ఈగోయిస్టు వల్ల అయినప్పుడు అంతకన్నా ఎక్స్పెక్ట్ చెయ్యడం అనవసరం. ఇలా ఎందుకనుకోవాల్సొచ్చిందయ్యా అంటే –

వివిధ పడక్కుర్చీ సైన్యాధిపతులు (Armchair Generals) చేస్తున్న, మీడియాలో వస్తున్న వాద ప్రతివాదాలు చూస్తే మహా కన్ఫ్యూజింగా ప్లస్ ఫ్రస్ట్రేటింగా వుంటోంది మరి.  కన్స్ట్రక్టివ్ డిబేట్ కన్నా మేధోన్మత్తత, తెలివితేటల ప్రదర్శన, మిస్-ప్లేస్డ్ పేట్రియాటిజమ్, ఏదో ఒక ఐడియాలజీని మాత్రమే నెత్తికెత్తుకొనే ఆతృత ఎక్కువ కనిపిస్తాయి.

విచారణా గుడ్డా అలాంటి పశువుల్ని ఎన్ కౌంటర్ చేసెయ్యాలని – న్యాయ ప్రక్రియ, అదే లీగల్ ప్రాసెస్, జరగాలని,

వీణ్ణి ఉరి తియ్యకపోవడం వల్ల బీబీసీకి దేశాన్ని అవమానించే చాన్స్ వచ్చిందని, ఇదంతా విదేశీ హస్తాల కుట్ర అని,

ఇండియాస్ డాటర్ లాంటి ప్రోగ్రామ్స్ వలన జనంలో అవేర్ నెస్ పెరిగి, చైతన్యం వస్తుందంటే,
ముందు ఫోకస్ పెట్టాల్సింది రేప్ కల్చర్ పైన, అది అన్ని దేశాల్లోనూ ఉంది కనక ఇండియానే ఎత్తి చూపించడం అన్యాయం అనే కౌంటర్లు(What do we want? ఇండియాలో సాంఘిక సమస్యలకి పరిష్కారమా? అన్ని దేశాల్లోనూ ఉండే సమస్యే కనక అలా వదిలేయడమా?)

ఆడవాళ్ళు సభ్యతగా ఉంటే నేరాలు జరగవని బోధించి సాయంత్రం సినిమాలో ఐటం డాన్స్ నోర్మూసుకుని చూసే పెద్దమనుషుల శ్రీరంగనీతులు

మృగాళ్ళని ‘అన్నా’ అని పిలిస్తే అప్పటికప్పుడు వాడు పరివర్తన చెందుతాడనే దుర్’ఆశా(రాం)’వాదం .Vs. no outfit is an
invitation to rape / Dont tell me how to dress, tell them not to rape లాంటి వితండవాదం

ఇండియాలో జరిగే రేపులు తక్కువా, రిపోర్ట్ చెయ్యబడేవీ తక్కువ కానీ అమెరికాలో జరిగేవి ఎక్కువ, రిపోర్ట్ అయ్యేవి తక్కువ అని
పక్కదోవ పట్టించే అనలిస్టులు + రేపిస్ట్ సైకాలజీపై ఇంకా ఇంకా రీసెర్చి జరగాలనే ‘మేధో’న్మత్తులు

పడక్కుర్చీ సైన్యాధిపతులు అన్ని రకాల మీడియాల్లో చర్చోపచర్చలు చేసేస్తున్నారు. But, అన్నీ థియరీలే. సిట్యుయేషన్ని కంట్రోల్ చేసే మార్గాలు మాత్రం ఎవరి దగ్గరా లేవు. పాపం ప్రజా ప్రతినిధులకి పార్లమెంట్ సెషన్స్ స్తంభింపజేయడానికే టైం సరిపోట్లేదు చర్చలు, డిబేట్లు ఏం చేస్తారు?

ఇలాంటి వాళ్ళు తప్ప సునితా కృష్ణన్ గారిలా( _/\_ ) ధైర్యంగా అఫర్మెటివ్ యాక్షన్ తీసుకునేవాళ్ళు ఎంతమంది ఉన్నారు?
ప్రాణాలకి తెగించక్కర్లేదు, at least, ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, పోలీసులు, ప్రజలు – వీళ్ళందరి దృక్పధంలోంచి రేప్ కల్చర్ సమస్య జారిపోకుండా,
ప్రతీరోజూ వాళ్ళని ఉలిక్కిపడేలా చేసే ఒక్క సింపుల్ యాక్షన్ చాలు. అతివృష్టి అనావృష్టి లాగా వస్తే ఒక్కసారి అందరూ రోడ్లమీదకొచ్చేయ్యడం, లేకపోతే వ్యవస్థని తిట్టుకుంటూ కూచోడం. పాకిస్తాన్ ని పొగిడితే చావగొట్టమనే సాధ్వులేగానీ ఆడపిల్లల్ని – శిశుహత్యలు చేసే ఆడవాళ్ళని, కట్నాల కోసం హింసించే వాళ్ళని, అసభ్యంగా ఏడిపించేవాళ్ళని, హత్యాచారాలు చేసేవాళ్ళని – పిలకపట్టుకుని దుమ్ముదులిపే మామూలు స్త్రీలు ఎక్కువ కనపడరేంటి?

పోనీ, రూట్ కాజ్ ఎనాలిసిస్ జరగాల్సినంత తీవ్రంగా జరుగుతోందా అంటే కొన్ని విషయాల మీద ఏ మూల నుంచీ ఏ విధమైన సౌండ్స్  వినిపిస్తున్నట్టు లేదు. వాటిలో కొన్ని –

పార్లమెంట్ లో కానీ, రాష్ట్ర అసెంబ్లీల్లో కానీ మొత్తమ్మీద ఈ సమస్యలపై ఎన్ని గంటలు చర్చ జరిగింది?
పసితనంనుంచే పిల్లల్లో మోరల్ వాల్యూస్ పెంచే చదువు ప్రాముఖ్యత, అందరికీ ఆ చదువు అందాల్సిన అవసరంపై చర్చ ఎందుకు జరగదు?

సెన్సేషన్ కోసం అరుపుల గోల చర్చలే తప్ప దారుణాలపై దేశవ్యాప్తంగా జాతిలోనిజమైన కదలిక వచ్చేవరకూ కంటిన్యువస్ అండ్ కన్స్ట్రక్టివ్ డిబేట్ అన్ని మీడియాల్లో, సెలబ్రిటీల్లో, నాయకుల్లో, ప్రజాప్రతినిధుల్లో, కనీసం మంత్రివర్యుల్లోజరపాలనే ఆకాంక్ష, ఆసక్తి మీడియాకి ఉందా?

చదువులేనివాళ్ళని, అదివున్నా సంస్కారంలేని వాళ్లని, మానసిక పరిపక్వతలేనివాళ్ళని, డబ్బులెక్కువై ఏమీ తోచక తాగుడుకీ, డ్రగ్స్ కి బానిసలై తిరిగే దరిద్రులకి ఇంటర్నెట్టూ, అది అందుబాటులోకి తెచ్చే అన్నిరకాల పెర్వర్టెడ్ ఇన్ఫర్మేషనూ ఎంత వెర్రెక్కిస్తాయనే పాయింటు పై చర్చ???

ఎక్కడ అత్యాచారం జరిగినా బ్రేకింగ్ న్యూస్ లో వెంటనే చూపించే పేపర్లూ, ఛానల్సూ, ఆన్-లైన్ పత్రికలూ హాట్&స్పైసీ టైటిల్స్ పెట్టి అసభ్య ఫోటోలు వెయ్యడం పాఠకులు/ప్రేక్షకుల చేత మానసిక వ్యభిచారం చేయించడం కాదా?

సినిమాల్లో ఐటం డాన్సులూ, “స్క్రిప్ట్ ప్రకారం” చూపించే ‘అడల్ట్’ కంటెంట్ నిజంగా అవసరమా అని ఎవరైనా అడుగుతున్నారా?ఇలాంటివి స్త్రీని చీప్ గా చూపిస్తాయని కానీ, అవి రేప్ కల్చర్ ని ఎగదోసే అవకాశం ఉందని కానీ జనం అనుకుంటున్నారా?

ఇరవై ముప్ఫై ఏళ్ళ క్రితం బందిపోటు దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నప్పుడు సిటీల్లో రాత్రిళ్ళు జనం వాచ్-కీపింగ్ గ్రూప్స్ గా ఏర్పడి కాపలా కాసేవాళ్ళు. అలా రేప్-వాచ్ గ్రూప్స్ ఏర్పాటు చేసి మృగాళ్ళని కంట్రోల్లో ఉంచాలన్న ఆలోచన పోలీసులకి రాదా?

ఇవన్నీ జరగడం అంత తేలిక్కాదు గానీ ఈ సమస్య గురించి బాధపడుతున్న, భయపడుతున్న వాళ్ళు పదివేలమందిలో ఒకళ్లైనా, తమ ఇళ్ళ ముందు యాంటీ రేప్ కొవ్వొత్తి or యాంటీ రేప్ ఫ్లాగ్ ప్రతిరోజూ ఉంచడం మొదలుపెడితే?
అదొక ఫాషన్ లాగా, ఒక రూమర్ లాగా, సినిమాలూ, హీరోల పట్ల పిచ్చిలాగా, అంటువ్యాధిలాగా వ్యాపిస్తే?
సిటీల్లో యువతీయువకులతో మొదలైతే క్రమంగా అందరికీ దీనిపై ఆసక్తి పెరగదా?
ఐస్-బకెట్ లాంటి కాంపెయిన్స్ కి బ్రహ్మాండంగా స్పందించే జనం ఇలాంటివేవో ఎందుకు మొదలుపెట్టరు?

ప్రతీ ఇంటి ముందూ ప్రతిరోజూ ఓ యాంటీ రేప్ కొవ్వొత్తి వెలుగుతూ ఉంటే అటుగా వెళ్ళే నాయకులకీ, పోలీసులకి, టేకిట్ ఈజీ పాలసీ పెట్టుకున్న ప్రతీ వ్యక్తికీ ఒకరోజు కాకపోతే ఒక రోజైనా మనసులో గుబులు పుట్టకపోతుందా? ఆ గుబులు మొదలైనప్పుడు పరిస్థితిలో మార్పుకి మొదటి అడుగు పడుతుంది.
అమాయకుల్లా, మామూలు మనుషుల్లా చెలామణీ అయిపోతున్న అన్-ప్రూవెన్ రేపిస్టుకీ, పొటెన్షియల్ రేపిస్టుకీ ఎక్కడ చూసినా వెలుగుతూ కనబడే కొవ్వొత్తి తమని కాల్చేసే దావానలంలా కనబడడం మొదలౌతుంది.

(మహారాష్ట్ర బీఫ్ బాన్ చేసాక తెలిసింది, దీనికోసం వినోబా భావే ఫాలోవర్స్ అయినా కొందరు ముప్ఫై మూడేళ్ళపాటు ముంబై లో దేవనర్ కబేళా ముందు శాంతియుత సత్యాగ్రహం చేసార్ట. సాధించింది వీళ్ళు కాకపోవచ్చు కానీ ఆ ఎవేర్ నెస్ పోకుండా ఉంచారు కదా, I think that should be the spirit in dealing with any social issue)

కొవ్వొత్తి ఖర్చెక్కువనిపిస్తే ఇంటి ముందు యాంటీ రేప్ జెండా, చేతిపై బాండ్, చొక్కాపై బాడ్జ్, నెత్తిపై కాప్ … ఏదో ఒకటి ప్రతీ మృగాడికీ తన రోజులు మూడాయనే ఫీలింగ్ కలిగేలా … ఆడా, మగా అందరూ, రేప్ కల్చర్ ని, “నిర్భయ” నిందితుల్ని అసహ్యించుకునే ప్రతీ ఒక్కరు …
Do some thing, and now!
Do it until every sister, daughter, wife … simply every girl child feels, “Yes, people are behind me,
not chauvinist pigs.”

ఆఫీస్ లోనూ, ఆటో రిక్షాలోనూ , సినిమా హాల్లోనూ, కాలేజీ కారిడార్స్ లోనూ అసభ్య ప్రవర్తనకి, మృగత్వానికీ స్టాట్యూటరీ వార్నింగ్ లాగా యాంటీ రేప్ సింబల్స్ గా సభ్యజనం తిరుగుతుంటే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే సమయానికి పరిస్థితి మారుతుంది!

Ineffectiveness of Government and/or Society  IS DIRECTLY PROPORTIONAL TO  (Timidity or frailties of the victims+ degree of social apathy + depth of societal hypocrisy + extent of social fragmentation) X Criminals’ legal / illegal means of escape.

anti rape

************

కొసరు

లెస్లీ ఉడ్విన్ ఆఫ్ బీబీసీకి ఓ సందేశం –
ఇండియన్స్ లో మీ ప్రోగ్రామ్ చైతన్యం తెచ్చే మాటెలా ఉన్నా కొంతమందికి అది వెర్రెక్కించే అవకాశాలు ఎక్కువున్నాయేమో చూడండి మేడం! ఓ ఉచిత సలహా కూడా – స్త్రీ సాక్ష్యానికి విలువ ఇవ్వని సంస్కృతుల మీద, అత్యాచారానికి గురైన స్త్రీకి, నలుగురు మగవాళ్ళు సాక్షులుగా ఉంటే తప్ప ఆ నేరాన్ని నిరూపించలేని స్థితిఉన్న న్యాయ వ్యవస్థలనీ కూడా ప్రశ్నిస్తూ ఓ ప్రోగ్రామ్ తయారు చెయ్యరాదా? మీది సెన్సేషనలిజం కాదని జనం పూర్తిగా నమ్ముతారు.

No outfit is an invitation to rape / Dont tell me how to dress, tell them not to rape లాంటి స్టైలిష్ & ట్రెండీ స్లోగన్స్ ఇచ్చేవాళ్ళకి/ వాటిని నిజాయితీగా నమ్మేవాళ్ళకి ఒక ఉచిత సలహా-
చంబల్ లోయలో ఒళ్ళంతా నగలు దిగేసుకుని దొంగతనం, దోపిడీ చేసే హక్కు ఎవరికీ ఎప్పటికీ లేదు అని బందిపోట్లు చదివేందుకు వీలుగా మెళ్ళో ఓ బోర్డు కూడా తగిలించుకుని తిరగమని. పులులూ, సింహాలకి అహింసా పరమోధర్మః అని ఉపదేశించినట్టుండదూ?

అరె! మృగాలు తిరుగుతున్నాయని తెలిసీ వాటిని రెచ్చగొట్టడం అవసరమా? అలాంటి స్లోగన్స్ కృతయుగంలో పంజేస్తాయి, హ్యూమన్ వాల్యూస్ & రైట్స్ ని గౌరవించే వ్యక్తులకి అర్ధం ఔతాయిగానీ, కలియుగంలో, కలిపురుషుల దగ్గర ఎలా పనికొస్తాయి? స్ట్రీట్-స్మార్ట్ గా ఉండాలని తోచదా?

ఓవరాల్ గా ఏం జరుగుతోందో, ఏం జరగబోతోందో కానీ నాగాలాండ్ లో ఉన్నట్టుండి జనాల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. జైల్లో ఉన్న రేపిస్ట్ ని బయటకి లాక్కొచ్చి చావబాది చంపేశారు. వాడు బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ పాతుకుపోయిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్ కనక ‘ఆవేశం’ కట్టలు తెంచుకుందిగానీ లోకలోడైతే ఇంతగా తెంచుకుంటుందా? అన్నది పెద్ద ప్రశ్న. ఇది ముకేష్ సింగ్ ఇంటర్వ్యూ చూసి కట్టలు తెంచుకున్న చైతన్యం కాదు రాజకీయ కారణాలతో కూడుకున్న కావేషం అంటే చాలా డిజప్పాయింటింగా ఉంది. ఓ రకంగా ఉరుమురిమి మంగలం మీద పడినట్టుంది. But still, a rapist is a rapist whoever he is and wherever he is from. It was justice done to The Woman.

“””””””””””””” *******””””””””””””””

Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s