తనీయాంసం పాంసుం తవచరణ పంకేరుహ భవం|విరించిస్సంచిన్వన్ విరచయతి లోకనవికలమ్||
వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం|హరః సంక్షుద్యైనం భజతి భసితోధ్ధూలనవిధిమ్||
తల్లీ! నీ పాదపద్మాలకంటిన ధూళికణాలతో బ్రహ్మ పద్నాలుగు లోకాలని ఎటువంటి లోపాలు లేకుండా సృష్టించగా విష్ణువు అతికష్టంతో ఆదిశేషుడిగా తన వెయ్యితలలపై వాటిని మోస్తున్నాడు. ఆ లోకాలని లయకారుడు, శివుడు పొడిపొడి చేసి విభూతిగా ధరిస్తున్నాడు.
సౌందర్యలహరిలో రెండో శ్లోకం. శ్రీ జీ. ఎల్.ఎన్. శాస్త్రిగారి సౌందర్యలహరి తెలుగు అనువాదంలో ఆయన ఇచ్చిన సైంటిఫిక్ వివరణ ఆలోచనా తరంగాల్ని పురికొల్పి సైన్సు, ఫిలాసఫీల సంగమప్రదేశానికి తీసుకుపోతుంది. శాస్త్రిగారు స్వయంగా ఫిజిక్స్ ప్రొఫెసర్ కావడం గమనార్హం. ఆదిశేషుడు పధ్నాలుగు భువనాలనీ మొయ్యలేక తన వెయ్యి తలలపై అటూ ఇటూ మార్చుకుంటూ అతికష్టంగా భరిస్తున్నాడన్న విషయాన్ని భూమి ఉత్తరదక్షిణాయనాల్లో ప్రవేశించడంతో పోల్చారు. ఉత్తరాయనంలో సూర్యుడు ఉత్తర దిక్కుగా, దక్షిణాయానంలో ఆ దిశగా సూర్యుడి కదలిక కనిపిస్తుంది కదా. నిజానికి పొజిషన్ మారేది భూమి. తన కక్ష్యలో తన యాక్సిస్ కి ఇరవై మూడున్నర డిగ్రీల కోణంలో వంగి ప్రయాణించడం వల్ల సూర్యుడు అలా కదిలినట్టు అనిపిస్తుంది. ఋతువుల మార్పు దీనివల్ల కలుగుతుంది. ఆదిశంకరుడు అదే విషయాన్ని పొయెటిక్ గా చెప్పారని అంటారు శ్రీ శాస్త్రిగారు. ఆదిశేషుడి వెయ్యి పడగల మీద భూమి ఒక ఏడాదిలో ఆ చివర నుంచి ఈ చివరికి, ఈ చివరనుంచి ఆ చివరకి దొర్లుతూ భూగోళపు ఊహాచిత్రం మనసులో మెదిలింది.
అద్వైతాన్ని…
View original post 517 more words