ఐన్-స్టీన్ చూసిన ఆదిశేషుడే శంకరుని స్పేస్-టైమ్ కంటిన్యువమ్ !!


తనీయాంసం పాంసుం తవచరణ పంకేరుహ భవం|విరించిస్సంచిన్వన్ విరచయతి లోకనవికలమ్||
వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం|హరః సంక్షుద్యైనం భజతి భసితోధ్ధూలనవిధిమ్||

తల్లీ! నీ పాదపద్మాలకంటిన ధూళికణాలతో బ్రహ్మ పద్నాలుగు లోకాలని ఎటువంటి లోపాలు లేకుండా సృష్టించగా విష్ణువు అతికష్టంతో ఆదిశేషుడిగా తన వెయ్యితలలపై వాటిని మోస్తున్నాడు. ఆ లోకాలని లయకారుడు, శివుడు పొడిపొడి చేసి విభూతిగా ధరిస్తున్నాడు.

సౌందర్యలహరిలో రెండో శ్లోకం. శ్రీ జీ. ఎల్.ఎన్. శాస్త్రిగారి సౌందర్యలహరి తెలుగు అనువాదంలో ఆయన ఇచ్చిన సైంటిఫిక్ వివరణ ఆలోచనా తరంగాల్ని పురికొల్పి సైన్సు, ఫిలాసఫీల సంగమప్రదేశానికి తీసుకుపోతుంది. శాస్త్రిగారు స్వయంగా ఫిజిక్స్ ప్రొఫెసర్ కావడం గమనార్హం. ఆదిశేషుడు పధ్నాలుగు భువనాలనీ మొయ్యలేక తన వెయ్యి తలలపై అటూ ఇటూ మార్చుకుంటూ అతికష్టంగా భరిస్తున్నాడన్న విషయాన్ని భూమి ఉత్తరదక్షిణాయనాల్లో ప్రవేశించడంతో పోల్చారు. ఉత్తరాయనంలో సూర్యుడు ఉత్తర దిక్కుగా, దక్షిణాయానంలో ఆ దిశగా సూర్యుడి కదలిక కనిపిస్తుంది కదా. నిజానికి పొజిషన్ మారేది భూమి. తన కక్ష్యలో తన యాక్సిస్ కి ఇరవై మూడున్నర డిగ్రీల కోణంలో వంగి ప్రయాణించడం వల్ల సూర్యుడు అలా కదిలినట్టు అనిపిస్తుంది. ఋతువుల మార్పు దీనివల్ల కలుగుతుంది. ఆదిశంకరుడు అదే విషయాన్ని పొయెటిక్ గా చెప్పారని అంటారు శ్రీ శాస్త్రిగారు. ఆదిశేషుడి వెయ్యి పడగల మీద భూమి ఒక ఏడాదిలో ఆ చివర నుంచి ఈ చివరికి, ఈ చివరనుంచి ఆ చివరకి దొర్లుతూ భూగోళపు ఊహాచిత్రం మనసులో మెదిలింది.
అద్వైతాన్ని ఔపోసన పట్టకపోయినా ఆదిశంకరుడన్న పేరు విన్నా, ఆ రూపం తలచుకున్నా ఎందుకో హృదయం ఉప్పొంగుతుంది. శివుడి అవతారంగా పరిగణించే శంకరుడికి ఖగోళ విజ్ఞానం ఒక లెక్కలోది కాదని తెలుసు. కానీ ఒక తత్త్వవేత్తగా, జీవాత్మ, పరమాత్మల మధ్య సరిహద్దు రేఖని చెరిపి ఇద్దరినీ విలీనం చేసిన అద్వైత శాస్త్రవేత్తగా చూసినప్పుడు ఆయనకీ ఖగోళ రహస్యాలు తెలిసే అవకాశం ఉందా? ఆయన కాలానికి ఇండియన్ ఆస్ట్రానమీ అంత అభివృద్ధి చెందిందా? ఇలాంటి ప్రశ్నలతో ఆలోచనలు అటు మళ్ళాయి.
శంకరాచార్యుడి కాలానికి ఇండియాలో ఆస్ట్రానమీ, దాని ఆధారంగా జ్యోతిష శాస్త్రం వృద్ధి చెందాయి. వరాహ మిహిరుడు అప్పటికే అయనాంశ (shift of equinoxes) లెక్క కట్టాడు. ఆర్యభట్ (I), భాస్కర (I) ప్రసిద్ధులయ్యారు. సో, శ్లోకరచనలో శంకరుడు దివ్యదృష్టితో కాక తన శాస్త్రజ్ఞానంతోనే ఈ ఆస్ట్రనామికల్ అంశం ఇమిడ్చే అవకాశం ఉందనుకోవచ్చు. ఇదంత ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. కానీ శూన్యమైన ఆకాశంలో గ్రహ గోళాల్ని ఏ అదృశ్యశక్తి మోస్తున్నదనే విషయానికే ఆయన ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకే భూకక్ష్యలో మార్పులకి ఆదిశేషుడు తలలు మార్చుకోవడమనే ఊహ(?) జోడించి అందంగా వర్ణించాడు. శంకరుడి వర్ణనకి, మోడర్న్ సైన్సు ఇచ్చిన వివరణకి పోలిక ఎంత దూరం వెళ్ళిందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ పెరిగిపోయింది.

ముందు భూమి ఇలా ఎందుకు పొజిషన్ మారుతుందో తెలుసుకుందామని గూగులించగా దొరికిన సమాచారంలో, నాకర్ధమైనంత వరకూ భూమికి మూడు రకాల మూవ్-మెంట్స్ ఉన్నాయని తెలిసింది. (తన చుట్టూ తన ఆత్మప్రదక్షిణాలు కాక)
ఒకటి – సూర్యుడి చుట్టూ ఒక కక్ష్యలో తిరగడం.
రెండు – ఉత్తర దక్షిణ ధ్రువాలు ఇరవై ఆరు వేల ఏళ్ళకొకసారి తారుమారవ్వడం (Axial Precession). హిపార్కస్ (190 – 120 B.C) తో మొదలుపెట్టి టాలెమి, భాస్కరులతో సహా అనేకమంది దీనిపై పరిశోధనలు చేశారు.
మూడు – భూకక్ష్య స్థిరంగా ఒకే పొజిషన్ లో ఉండదు. భూమితో సహా కక్ష్య కూడా సూర్యుడి చుట్టూ మెల్లిగా తిరగలి రాయిలా (eccentricగా) తిరుగుతుంది. ఇలా –

Perihelion_precession

(శాస్త్రిగారి సౌందర్యలహరి అనువాదం ఇక్కడ – https://archive.org/details/sondaryalahari023321mbp)

దీన్ని Apsidal precession అంటారు. హిపార్కస్ మొదటిగా చంద్రుడి కదలికల్లో దీన్ని గమనించాడట. బుధ గ్రహానికి ఈ precession లెక్కవేయ్యడంలో కెప్లర్ చిక్కులు పడ్డాడు. ఐన్-స్టీన్ తన జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రతిపాదించాక దాని ఆధారంగా బుధగ్రహపు precession సరిగ్గా లెక్క వెయ్యగలిగారు. సాపేక్ష సిద్ధాంతాన్ని ఋజువు చేసిన ప్రయోగాల్లో ఇదొకటి. భూకక్ష్య సూర్యుడి చుట్టూ ఒక రౌండు తిరిగి రావడానికి 29000 ఏళ్ళు పడుతుంది. ఇదంతా మామూలు కళ్ళతో, మహా అయితే టెలిస్కోపుతో అబ్జర్వ్ చెయ్యగలిగిన విషయాలే. బ్యూటీ అంతా ఐన్-స్టీన్ ప్రతిపాదించిన స్పేస్-టైమ్ కంటిన్యువమ్ లో ఉంది. కంటికి కనిపించని శూన్య ఆకాశాన్ని,ఊహకందని కాలాన్ని కలిపి వలగా అల్లి దానిపై గ్రహ నక్షత్రాలు కదలాడుతున్నాయని ఎలా ఊహించాడో ఈ ఫిజిక్స్ పాలిటి ఆదిశంకరుడు! ఊహించడమే కాదు ప్రయోగాత్మకంగా ఋజువైన వైనం మరీ విచిత్రం. గ్రహాలు, నక్షత్రాల వంటి వస్తువుల చుట్టూ ఉన్న స్పేస్ వంగుతుంది అన్న ప్రతిపాదన ఒకానొక సూర్యగ్రహణ సమయానికి సూర్యుడి వెనుక, అంటే ఆకాశంలో మనకి కనిపించకుండా ఉండే భాగంలో ఉండే ఒకానొక నక్షత్రం ఈ ఎఫెక్టు వల్ల కనబడుతుందని జోస్యం చెప్పారు శాస్త్రవేత్తలు, ఐన్-స్టీనే అనుకుంటా. అది నిజమయ్యింది. సంపూర్ణ సూర్య గ్రహణ సమయంలో మామూలుగా అయితే కనబడకూడదనుకున్న ఆ నక్షత్రం కనబడింది. దాన్నుంచి వచ్చే కాంతి సూర్యుడి పక్క వంపు తిరిగితే తప్ప అది సాధ్యం కాదు. మామూలుగా స్ట్రైట్ లైన్ లో ప్రయాణించే కాంతి వంగిన స్పేస్ తో పాటు వంగి భూమిని చేరింది. ఆకాశం వంగడమేమిటి? శూన్యం అని అనుకుంటున్నది శూన్యం కాదనేగా దీనర్ధం.

ఇదిగో ఆకాశం వంపు తిరిగేది ఇలా –

earth-around-sunwarp

బొమ్మలో భూమి చుట్టూ క్రుంగి ఉన్న స్పేస్-టైమ్ మాట్రిక్స్ ఒత్తుకున్న మెత్తటి పడగలా లేదూ? So, నిజంగానే కంటికి కనిపించని పడగల మీద భూగోళం దొర్లుతోంది. In fact, అంతరిక్షంలో ఉన్న గోళాలన్నీ.

శంకరుడు ఆదిశేషుడిగా వర్ణించిన అదృశ్యశక్తినే ఆధునికంగా space-time continuum అంటున్నామా?

అయితే శేషుడి పడగలు వెయ్యి కాదు అనంతం. It may be coincidental, but, ఆదిశేషుడి మరోపేరు అనంతుడు!

శతాబ్దాల క్రితం ఆదిశంకరుని ఆలోచనలు, ఇటీవలి ఐన్-స్టీన్ ఆలోచనలు మస్తిష్కంలో ఒకటైపోయాయి,
“Both religion and science require a belief in God. For believers, God is in the beginning, and for physicists He is at the end of all considerations… To the former He is the foundation, to the latter, the crown of the edifice of every generalized world view,” అని క్వాంటమ్ థియరీకి ఆద్యుడైన మాక్స్ ప్లాంక్ అన్న మాటలు గుర్తొచ్చాయి.

spacetime-travel

– సైంటిఫిక్ హిందూ.

Hi! Thank you for reading this post 🙂

Your kind feedback via LIKES button

will help me write better  _/\_

17 thoughts on “ఐన్-స్టీన్ చూసిన ఆదిశేషుడే శంకరుని స్పేస్-టైమ్ కంటిన్యువమ్ !!

 1. Jagadeesh Reddy

  మంచి ఆలోచనల్ని పంచుకున్నారు. ఐన్‌స్టీన్ మరో మాట కూడా అన్నారు. “ఎక్కడ విజ్ఞానం అంతం అవుతుందో, అక్కడ దైవం మొదలవుతుంది” అని. అది నిజమే.. ఏ శాస్త్రవేత్త అయినా చివరికి దేవునికి దాసోహం అనాల్సిందే.

  Like

  Reply
 2. A.K.Ramanji babu

  very good post.one thing i want to bring to your notice. thousand (sahasra in sanscrit) is used for anantha (infinity). if we see `purusha sukta` “sahasra seersha purush sahasraaksha sahasra paath” if thousand mean 1000 only, then a man having 1000 heads must have 2 * 1000 ie 2000 eyes and 2000 legs. but the above sloka decribes a man with 1000heads, 1000eyes and 1000 legs. which is clearly indicating that sahasra means anantha. thanks for a very good post.

  Like

  Reply
 3. hari.S.babu

  Where reason ends belief starts.Religion also has logic and scientific spirit!
  where belief confuses logic plunges.Science also has myth and religious spirit!

  Like

  Reply
 4. అం'తరంగం' Post author

  వ్యాఖ్యాతలందరికీ ధన్యవాదాలు.
  @hari.S.babu – you are right.
  @A.K.Ramanji babu – Thanks for your elaboration.
  @Jagadeesh – మనుషులు మనసా, వాచా, కర్మణా దాసోహం అనట్లేదని నా ఉద్దేశం. దాసోహం అనికూడ ఫత్వాలిచ్చే మత’పెద్ద’ల కంటే నాస్తికులైనా మంచివర్తన ఉన్న సైంటిఫిక్ పర్సన్స్ బెటర్ అనుకుంటున్నాను.

  Like

  Reply
 5. Edge

  @ hari.s.babu

  “Where reason ends belief starts.Religion also has logic and scientific spirit!
  where belief confuses logic plunges.Science also has myth and religious spirit!”

  Awesome word salad!!!

  Like

  Reply
 6. K Ramapathi Rao

  During His times, Adi Shankara had dealt with Vaiseshikaas, who were considered to be the scientists of those times. Their theory was The gross observed world is constituted of four elements which have parts. These elements are gross Prithvi with four qualities of Gandha, Rasa, Rupa and Sparsha; Subtle Jala with the qualities of Rasa, Rupa and Sparsha; subtler Tejas with the qualities of Rupa and Sparsha; the subtlest Vayu with a single quality of Sparsha. At the time of dissolution, the parts go on seperating till that stage when they have no more size, i.e. they become dimensionless particles. These are called Anu, the automs. In other words, these atoms are the ultimate cause of the universe – i.e. the inherent nature of the Jagat. Just like these elements, the atoms have also got the comparative differences in their subtlety as in the gross universe. During creation they once again assemble together to produce the gross world. These atoms which they call as rather Paramanu are eterneal.
  Adi Shankara proves this theory to wrong.

  Vaiseshikas’ theory is not correct for many reasons. The conceived process of creation or of dissolution or their conception of the conjunction of the atoms together or even the properties of the atoms are irreconcilable.
  (i) Creation of the world is not possible because the atoms cannot conjoin with each other by themselves, since they are still inert. To overcome this objection to their theory, the Vaiseshikas infer the Atman as existing even before creation. He is a Karta – doer and a Bhokta – enjoyer. He is the Nimitta for the atoms to come together. But this is not reasonable because, in order to juxtapose these atoms, this Atman must already have a body and a mind. But the body and mind themselves have to come into existence only by a conglomeration of atoms. Therefore, he cannot putforth any effort to effect the process of conjunction.
  (ii) Even the process of dissolution is not logical. Granting that ‘somehow’ this Atman has acquired the body and the mind, he could perform dissolution. But he would not, because the world is created precisely for his own needs. It would be unreasonable to say that what has been created for himself, by himself, is also destroyed by himself.
  (iii) Even the process of the combination of the atoms is faulty for the following reasons: the combination of the atoms can either be total or partial. It cannot be in any other way. If it is total, then the two dimensionless atoms will merge and produce only another dimensionless atom. Therefore, atoms combining in this way can never give rise to three dimensional objects. To avoid this objection if it is told that the combination is partial, then it will imply that the atoms have parts. But this would go against their own assertion that the atoms are partless/dimensionless.
  (iv) Their statement that the four atoms have comparative subtlety and that they are eternal, are mutually contradictory. Experience tells us that objects with qualities of touch etc are only effects and not ultimate causes. For e.g. a cloth with properties of touch etc is an effect of threads and the threads with these properties are effects of fibres. On this basis, we will have to infer that the atoms with these qualities could only be effects, but not ultimate causes. If they are only effects, they are obviously not eternal because all effects are transient compared to their causes. For e.g. cloth is more transient than the thread; the thread is more transient than the fibre. (Adi Shankara’s Brahma Sutra Bhashyam – 2.2.12-17).

  The above is only an extremely brief summery of the discussion in the Shankara Bhashya.

  I would like to add a small thing here:
  After rejecting the theory, Shankara comments at the end “This atomic theory is based on insipid logic – not in accordance with Shruti and not accepted by the stalwarts like Manu. Therefore, wise people should discard it”.
  Some modern people who are not able to understand the nuances in the foregoing criticism, have commented that Shankara’s attack on the atomic theory weakened the growth of scientific thought in the country. But one should remember that Shankara did not discard the atoms. He makes a mention of them very clearly in many places. He has only denied the claims that the atoms are the primordial cause of the universe and shown that the features of the atoms propounded by them are contradictory. On the other hand, it is my belief that had the scientists taken guidance from Shankara’s criticism of the Vaiseshikas’ theory, many of the modern scientific thoughts could have been anticipated much earlier.

  Like

  Reply
   1. K Ramapathi Rao

    No other name comes to my mind for the greatest person to walk on this land after Lord Krishna, than Adi Shankaracharya. I get thrilled whenever even a thought of Him comes to my mind. An amazing personality, who could influence so many people, cutting across so many geographic zones, in a short span of time. Whatever he has done is an yardstick now even after a lapse of over 1000 years.

    Like

    Reply
   2. K Ramapathi Rao

    By the way, if you happen to be in Delhi, you can attend to the session on Maandukya Karika Bhashyam of Adi Shankara from 1st April to 31 May (07:15 – 08:45 AM) at Chinmaya Mission. Maandukya Upanishad is the key one and most mis-understood of all the Shankara-bhashyas.

    Like

    Reply
  1. madhavaraopabbaraju

   శ్రీ రమాపతిరావుగారికి, నమస్కారములు.

   చక్కటి వివరాలు చెప్పారు. అయితే, `ఛాందోగ్యోపనిషత్’ లో ఈ విశ్వంయొక్క సృష్టిక్రమం గురించి, EXISTENCE గురించీ వివరంగా చెప్పబడింది. – మాధవరావు.

   Like

   Reply
   1. K Ramapathi Rao

    Dear Madhava Rao Garu,
    Namaskaram! You are absolutely right that Chandogya explains evolution, which further detailed by Adi Shankara in His Bhasya. But, in the larger scheme of things, if the Advaita theory is understood, all these systems would automatically fall into place. To correctly grasp Advaita, theoretically, one should go through the Prastana-traya (Vedopanishads, Brahma Sutras & Bhagawad Gita) Bhashya of Adi Shankara. If in anywhere in His bhashaya a doubt arises, instead of jumping to inferences, one needs search for explanation of Him somewhere in the Prastana-Traya Bhashya only. Present-day misconceptions about Advaita have arisen primarily due to commentators on Shankara Bhashya have jumped to their own inferences.

    Liked by 1 person

    Reply
   2. madhavaraopabbaraju

    శ్రీ రమాపతిరావుగారికి, నమస్కారములు.

    Prastana-traya (Vedopanishads, Brahma Sutras & Bhagawad Gita) Bhashya of Adi Shankara. – ఈ పుస్తకాన్ని హైద్రాబాదులో కోనాలంటే, ఏ పబ్లిషరుది కొనవచ్చు; ఎవరు వ్రాసింది (అంటే ఆదిశంకరులవారి ఈ భాష్యాన్ని మనకు అందించిన రచయుత ) కొనవచ్చు; ఇది తెలుగా లేక ఇంగ్లీషు పుస్తకమా? వివరాలు తెలియచేయగలరు.
    * ఈ ప్రశ్నలను అడగటానికి `అంతరంగం’వారి బ్లాగ్ ని వాడుకుంటున్నందుకు వారు క్షమించాలి.
    * మీ బ్లాగ్ ఏదైనా వుంటే, వివరాలు ఇవ్వగలరు. లేదా మీ e-mail id (అభ్యంతరంలేకపోతే) ఇవ్వగలిగితే, తద్వారా, మిమ్మల్ని అవసరమైతే సంప్రధించగలవాడను.
    మీ స్నేహశీలి,
    మాధవరావు.

    Like

    Reply
 7. madhavaraopabbaraju

  అంతరంగంలో కనిపించకుండా దాగివున్న మీకు నమస్కారములు.

  మీరు, మీ బ్లాగ్ పరిచయానికి సంతోషం. మొదటగా ` ఆ, మెన్….’ : అనే శీర్షిక చదివాను. బాగుంది. తరువాత ఈ వ్యాసం చదివాను. ఇదికూడా చాలా బాగుంది.

  1. ఆదిశేషుడు 14 భువనాలను తన వేయి తలలపై మొస్తూ, మధ్యమధ్యలో అటుఇటు మార్చుకుంటున్నాడు అని వ్రాశారు. అంటే ఉత్తరాయణం, దక్షిణాయణం :వీటికి సమన్వయ పరుస్తూ. బాగుంది. అయితే, భూమి ఆ వేయి తలలపైన అటుఇటు కదులుతూవుంటే, మరి మిగిలిన పదమూడు భువనాలుకూడా అదే సమయంలోనే కదులుతూ వుండాలికదా? మరి వాటి మాటేమిటి? అలా 14 భువనాలు అటుఇటు విసిరివేయబడుతూ వుంటే, భూమితోపాటు మిగిలిన భువనాలపై జరిగే లేదా కలిగే చర్యలు ఏమిటి? అవి మన భూమిపైకి ఎలా కనిపిస్తాయి? మరొక కోణంలో ఆలోచిస్తే, నాకు అనిపించింది ఏమిటంటే:- ఆదిశేషుడు లేదా అనంతుడు : వేయి తలలు అంటే అసంఖ్యాకమైన తలలు కలిగివున్నవాడు, ఈ 14 భువనాలను, 14 తలలపై మొస్తుండగా ఇంకా చాలా తలలు ఖాళీగావుంటాయి. ఇప్పుడు, ఉదాహరణకు భూమి ఒకటవ తలమీద వున్నదనుకోండి; భారాన్ని మార్చుకోవాలన్నప్పుడు, ఒకటవ తలపైవున్న భూమిని వెయ్యెవ తలపైకి విసిరాడు అని అనుకోండి; అప్పుడు ఈ తలనుంచి ఆ చివరి తలకు భూమి ప్రయాణించటానికి కొంత సమయం పడుతుందికదా; మళ్ళీ అటునుంచి ఇటు రావటానికికూడా అంతే సమయం పడుతుందికదా; ఈ సమయంలోనే ఉత్తరాయణం, దక్షిణాయణం ఏర్పడుతుండాలి. అయితే నేనే ఒక ప్రశ్న వేశాను: మరి మిగిలిన 13 భువనాల కదలిక మాటేమిటని; భూమిని 1వ తలనుంచి వెయ్యవ తలపైకి విసిరివేసినప్పుడు ఒకటవ, వెయ్యవ తలలుమాత్రమే కదలుతాయి; అంటే, మిగిలిన తలలూ, వాటిపైవున్న 13 భువనాలూ అప్పటికి కదలకుండానే వుండివుండాలికదా! కాబట్టి, మిగిలిన భువనాల కదలికలూ, వాటి చర్యలూ తరువాత కలుగుతాయి.

  2. ఇక `ఆకాశం వంపు తిరగటం’ గురించి:- ఆకాశం, లేదా శూన్యం లేదా space: ఇది అనంతమైనది; అనంతమైన గోళాలను కలిగివున్నది. సాకారంగావున్న గోళాలు అంటే పదార్ధం, వాయువులు, ధూళి మొదలైనవన్నీ కలిసి దట్టంగా ఏర్పడటమే. శూన్యంలో సాకారంగా వ్యాపించివున్న ఈ గోళాలు ఆక్రమించిన స్థలం పోగా, ఇంకా ఎంతో స్థలం వుండివుండాలికదా? అదంతాకూడా ఏదో ఒక పదార్ధంతోనే నిండివుండాలి; ఆ పదార్ధంలో కొంత భాగం దట్టంగా ఏర్పడినప్పుడు (consolidation) మనకు గోళాలుగా కనిపిస్తాయి. మిగిలినదంతా శూన్యం లేదా space. ఆధునిక సైన్స్ చెప్పింది ఏమిటంటే:- MOST OF THE UNIVERSE’S MATTER IS DARK MATTER, COMPOSED OF PARTICLES OF A CURRENTLY UNKNOWN TYPE. కాబట్టి నేను చెప్పేదేమిటంటే, ఈ DARK MATTER వాయువులు, ప్లాస్మా మొదలైనవాటితో నిండివుండివుండవచ్చును. అట్టి పదార్ధాలకి ఒక net లాగా ఎటుబడితే అటు సాగే, వంగే గుణాలు కలిగివుంటాయికాబట్టి, ఆకాశం వంపు తిరగటం అనేది జరగటానికి అవకాశం వున్నదని నా భావన. దీనినిబట్టి మనకు తెలిసేది ఏమిటంటే ఈ విశ్వమంతా ఏదో ఒక లేదా అనేక పదార్ధాలతో నిండి, వ్యాపించివున్నదని. అందుకు సారూప్యంగా చెప్పబడింది “విష్ణువు” అనగా సర్వమూ వ్యాపించివున్నవాడు అని అర్ధం. మరి ఈ విష్ణువుతోపాటు ఆదిశేషుడుకూడా తోడు వుండే వుంటాడుకదా. మనం `విష్ణు సహస్రనామాల్ని’ చూస్తే, మొట్టమొదటగా మనకు చెప్పబడింది:- “విశ్వం విష్ణుర్వషట్కారో…” అని. అంటే, విశ్వం అనేది ఒకటి వున్నదనీ; అది విష్ణువుచే వ్యాపింపబడివున్నదనీ అర్ధమవుతుంది. విష్ణు సహస్రనామాల్లో ఎంతో సైన్స్ నిగూఢంగా వున్నది. ( నా బ్లాగ్ లో `ఆధునిక సైన్స్ – విష్ణు సహస్రనామాలు’ 04-03-2011 న చూడగలరు. BLOG LINK :-https://madhavaraopabbaraju.wordpress.com/2015/03/21/%E0%B0%AE%E0%B1%81%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B1%8B%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B0%A4%E0%B0%B2%E0%B1%81/ ).

  మీ స్నేహశీలి,
  మాధవరావు.

  Like

  Reply
  1. అం'తరంగం' Post author

   నమస్కారం మాధవరావు గారూ,
   మీరాకతో అం’తరంగం’ ఆనందాతరంగమైంది.
   మిగిలిన పదమూడు భువనాల గురించిన ఆలోచన వచ్చిందండి అంతలో universeని ఇప్పటి సైన్సు multiverse గా గుర్తిస్తున్న సంగతి గుర్తొచ్చి ఆ పధ్నాలుగు భువనాలు ఓకే విష్ణువులో పొరలు గా ఉన్న విశ్వాలు విశ్వంవిష్ణుః అనిపించి ఇక ఊరుకున్నాను.
   ఐనా నాకు తెలిసింది తక్కువ కనుక రాసేది దానికి అనుగుణంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను. తప్పులు రాస్తానని భయం.
   డార్క్ మేటర్ విషయం – మీరన్నది కరెక్టు.
   ఆ మెన్ ఆమెన్ … > నా పోస్టుల్లో నాకు నచ్చిన మొదటి పోస్టు ఇదేనండి. మీకూ నచ్చిందంటే సంతోషంగా ఉంది.

   Like

   Reply

Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s