దిల్లీ ఎలక్షన్లు, ఒబామా పీకిన క్లాసు కాని క్లాసు & జాతీయ ప్రార్ధనా ఫలహారం (నేషనల్ ప్రేయర్ బ్రేక్-ఫాస్ట్)


YVR's అం'తరంగం'

saseshamఒబామా ఇండియాలొ “ఉన్న” పరమత”అసహనం” పై మనకి చురకలేసాడా? వేసాడు అనుకుంటే వేసాడు. లేదనుకుంటే లేదు. అది తీసుకునే వాడి దృష్టిని బట్టీ ఉంటుంది. ఛ, ఇక్కడ దృష్టి అనచ్చా? చెవుల గురించి మాట్లాడుతూను. ముఖ్యంగా రాజకీయ కళ్ళు, చెవులు,నోరు అన్నీ దేని పని అది చేసుకుంటూ ఉంటాయి. తమ పని తాము చేసుకు పోతాయి. చట్టం లాగ. కళ్ళు చూసేది ఒకటి, చెవులు వినేది ఇంకోటి, నోరు మాట్లాడేది ఇంకా ఇంకోటి. అసలు రాజకీయాల్లో కరెక్టుగా పని చేసేది ముక్కొక్కటే. ఎందుకంటే సెన్స్ ఆఫ్ స్మెల్ జంతుప్రపంచంలో అతి ముఖ్యమైన సర్వైవల్ టూల్. కళ్ళు, చెవులు మోసం చేసే అవకాశం ఉంది కానీ ముక్కు మాత్రం కరెక్టుగా పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగడుతుంది.రాజకీయాల్ని బతికించేదే జంగిల్ లా. శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ రాజకీయాల్లో ఉండరని దేవరాజ్ అర్స్ చెప్పింది జంగిల్ లా ఉన్నచోట కాక మరెక్కడ అప్లై అవుతుంది? అందువల్ల ఒబామా మాటలు ఒకో రాజకీయ పక్షానికి ఒకలా వినబడతాయి. కాంగ్రెస్ కి ఒకలా, బీజేపీకి మరోలా, త్రిణాముల్ కాంగ్రెస్ కి ఇంకోలా, ఎస్పీకి వీనులవిందుగా, అవసరార్ధం ఎవరి చెవులెలా పనిచేస్తే అలా వినబడుతుంది. వినబడాలి. లేకపోతే వోటర్లకి ఎన్నుకోడానికి ఛాయిస్ ఉండొద్దూ. ఎలా వింటే వోట్లు పడతాయో రాజకీయచెవులు అలా వింటాయి. దాని ప్రకారమే వోట్ బాంకుల్ని విడగొడతాయి. అంతేకానీ ఒబామా అన్నాడు కదాని ఎలా పడితే…

అసలు టపాను చూడండి 1,346 more words