దిల్లీ ఎలక్షన్లు, ఒబామా పీకిన క్లాసు కాని క్లాసు & జాతీయ ప్రార్ధనా ఫలహారం (నేషనల్ ప్రేయర్ బ్రేక్-ఫాస్ట్)


sasesham

ఒబామా ఇండియాలొ “ఉన్న” పరమత”అసహనం” పై మనకి చురకలేసాడా? వేసాడు అనుకుంటే వేసాడు. లేదనుకుంటే లేదు. అది తీసుకునే వాడి దృష్టిని బట్టీ ఉంటుంది. ఛ, ఇక్కడ దృష్టి అనచ్చా? చెవుల గురించి మాట్లాడుతూను. ముఖ్యంగా రాజకీయ కళ్ళు, చెవులు,నోరు అన్నీ దేని పని అది చేసుకుంటూ ఉంటాయి. తమ పని తాము చేసుకు పోతాయి. చట్టం లాగ. కళ్ళు చూసేది ఒకటి, చెవులు వినేది ఇంకోటి, నోరు మాట్లాడేది ఇంకా ఇంకోటి. అసలు రాజకీయాల్లో కరెక్టుగా పని చేసేది ముక్కొక్కటే. ఎందుకంటే సెన్స్ ఆఫ్ స్మెల్ జంతుప్రపంచంలో అతి ముఖ్యమైన సర్వైవల్ టూల్. కళ్ళు, చెవులు మోసం చేసే అవకాశం ఉంది కానీ ముక్కు మాత్రం కరెక్టుగా పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగడుతుంది.రాజకీయాల్ని బతికించేదే జంగిల్ లా. శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ రాజకీయాల్లో ఉండరని దేవరాజ్ అర్స్ చెప్పింది జంగిల్ లా ఉన్నచోట కాక మరెక్కడ అప్లై అవుతుంది? అందువల్ల ఒబామా మాటలు ఒకో రాజకీయ పక్షానికి ఒకలా వినబడతాయి. కాంగ్రెస్ కి ఒకలా, బీజేపీకి మరోలా, త్రిణాముల్ కాంగ్రెస్ కి ఇంకోలా, ఎస్పీకి వీనులవిందుగా, అవసరార్ధం ఎవరి చెవులెలా పనిచేస్తే అలా వినబడుతుంది. వినబడాలి. లేకపోతే వోటర్లకి ఎన్నుకోడానికి ఛాయిస్ ఉండొద్దూ. ఎలా వింటే వోట్లు పడతాయో రాజకీయచెవులు అలా వింటాయి. దాని ప్రకారమే వోట్ బాంకుల్ని విడగొడతాయి. అంతేకానీ ఒబామా అన్నాడు కదాని ఎలా పడితే అలా వినేస్తాయేంటి?
ఇలా అంటే గుర్తుకొచ్చింది, ఒక M.S. నారాయణ డైలాగు. ” చిన్నపిల్ల చెప్పింది కదాని ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్ తాగేస్తానేంటన్నయ్యా,” అని ‘నువ్వు నాకు నచ్చావు’లో డైలాగు. డైలాగ్ మాత్రమే కామన్. రాజకీయుడు ఆ సినిమాలో ఎమ్మెస్ కారెక్టర్లా అమాయకుడు కాదు గదా? మళ్ళీ అదే సినిమా డైలాగ్ గుర్తొస్తోంది. ఎమ్మెస్ దే, వెంకీ కారెక్టర్ గురించి, “ఇతనికి నోట్లో నాలిక లేదనుకుంటే మనకి బుద్ధి లేనట్టు.” అంటాడు కదా.

నిజానికి ఒబామా అన్నాడు కనక ఇంత ప్రొజెక్షన్ వచ్చిందిగానీ ఆర్కే నారాయణ్’స్ కామన్ మాన్ అంటే వస్తుందా? ఒబామా అంతటివాడు ఇలా అనేసాడేంటబ్బా అని ఆలోచించేవాడుంటాడెమోననే అనుమానంవల్ల సో-కాల్డ్ సెక్యులరిస్టులు ఒంటికాలి మీద లేస్తారు. అదే అనుమానంవల్ల సో-కాల్డ్ మతతత్వవాదులు ఆయనందర్నీ అన్నాడు, మమ్మల్ని స్పెప్సిఫిగ్గా అన్లేదు అనేస్తారు. నిజానికి అందర్నీ అన్నాడనుకోవచ్చు. ఒబామా అసలుద్దేశం ఏంటో అనేది పక్కనపెట్టి ఆ మాట ఓ ఇండియనే అన్నాడనుకుంటే? ఆ దిశలో ఆలోచించేవాళ్ళుంటారు కదా. వర్గాలకతీతంగా గాంధీని గౌరవించే, అభిమానించేవాళ్ళు దేశంలో కొల్లలు. గాంధీ’స్ వెర్షన్ ఆఫ్ హిందూయిజంని యాక్సెప్ట్ చేసేవాళ్ళు కోకొల్లలు. గాడ్సేకి గుడి కట్టమంటే వీళ్ళందరికీ ఏమనిపిస్తుంది? ఏదో ఒకటనిపిస్తుంది. అలా అని వీళ్ళంతా ఉద్యమాలూ గట్రా చెయ్యరు. చూసీ చూడనట్టు వదిలేస్తారు. పట్టించుకునే తీరిక, తాహతూ ఉండాలిగా. అవున్నవాళ్ళు పేపర్లలో, ఇంటర్నెట్ ఫోరాల్లో రాసుకుంటారు. అంతే. ఆ రాతలేవీ బాలెట్ బాక్సుల్ని గల్లంతు చేసే పరిస్థితి ఇప్పటికైతేలేదు. అదే ఒబామా పొజిషన్లో ఉన్నవాడికి పబ్లిగ్గా అనాల్సిన నైతిక, రాజకీయ, సాంఘిక, మౌలిక అవసరాలన్నీ కనిపిస్తాయి. (కనపడకపోయినా థింక్ టాంకులు అంజనం వేసి చూపిస్తాయి.) చురకలేసినా యూ.ఎస్. మీద ఈగకూడా వాలదన్న క్లారిటీ ఉంది. ఇండియాలో ఇన్వెస్ట్-మెంట్లకి, యూ. ఎస్. టూ ఇండియా ఎ(ది)గుమతులు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్లకి ఢోకా లేకుండా నేషనల్ ప్రేయర్ బ్రేక్-ఫాస్ట్ వంటి వేదికలపై ఇతర మతాలపైనా కామెంట్స్ చేసి మాకందరూ సమానమే అని ఇండియా కళ్ళు తుడిచే నేర్పూ ఉంటుంది. సో, ఆయన అనాలని ప్లాన్ చేసుకునే ఉంటాడు. దానికి సంబంధించిన యాక్షన్ – రియాక్షన్లు డిప్లొమాటిక్ ఛానెల్స్ లో జరిగిపోతాయి. ఆ విషయం అందరూ మర్చిపోవడం కూడా జరిగిపోతుంది. ఎన్ని చూసాం? రాష్ట్రపతులు, మంత్రుల స్థాయి నుంచీ సెలబ్రిటీల వరకూ ఎంతమందిని యూ.ఎస్. ఎయిర్-పోర్టుల్లో సెక్యూరిటీ చెక్స్ పేరుతో అవమానించలేదు? ఏం చేసాం? So,అధ్యక్ష హోదాలోనే అన్నాడు కనక దాన్నీ స్ట్రాటజిక్ కళ్ళద్దాల… సారీ, హెడ్ ఫోన్స్ తోనే వినాలి.
ఆ “విన్న”దానికి దిల్లీ ఫలితాలు జోడిస్తే తక్షణ కర్తవ్యం బోధ పడుతుంది.
ఈ మధ్య దిల్లీలొ జరిగిన ఒక క్రైస్తవ సభకి మోడీ హాజరయ్యి మతసహనానికి సంబంధించి తన ప్రభుత్వపు విధానాన్ని వివరించడంలో భాజపా ఒబామా కామెంట్స్ + దిల్లీ రిజల్ట్స్ ని ఎలా విశ్లేషించుకుందనే దానిపై క్లూస్ ఉన్నాయి. మోడీ వివరణ రాబోయే నాలుగేళ్లలో భాజపా & సంఘ్ పరివార్లు ఎలా ప్రవర్తించాలనే దానికి రోడ్-మాప్ లాగా ఉంది. 

“My government will ensure that there is complete freedom of faith and that everyone has the undeniable right to retain or adopt the religion of his or her choice without coercion or undue influence. My government will not allow any religious group, belonging to the majority or the minority, to incite hatred against others, overtly or covertly. Mine will be a government that gives equal respect to all religions. India is the land of Buddha and Gandhi. Equal respect for all religions must be in the DNA of every Indian. We cannot accept violence against any religion on any pretext and I strongly condemn such violence. My government will act strongly in this regard” అని క్లియర్-కట్ స్టేట్మెంట్ ఇవ్వడం వెనక గత నెల రోజుల్లో జరిగిన రెండు పరిణామాలు – ఇండియాలో మతసహనంపై ఒబామా రిమార్కులు, డిల్లీ ఎలక్షన్స్ ఫలితాలు – కారణం అనుకోవచ్చా? కోవచ్చు, కోకపోవచ్చు.

కోకపోవచ్చు అనుకుని ఫర్దర్ రిస్క్ తీసుకునే కన్నా కోవచ్చు అనుకుని జాగ్రత్తపడడం మంచిది అని తెరవెనక జరిగిన జ్ఞానసాక్షాత్కారం అనిపించేట్లా ఆ పరిణామాలు జరిగాకే పై స్టేట్-మెంట్ వచ్చింది. లేకపోతే ముందే వచ్చేదేమో? ఏదో ఒకటి అసలు వచ్చింది కదా? ఆ రావడానికి ఇంటర్నల్ గా ఎంత కష్టపడాల్సోచ్చిందో. ఎన్ని పెద్దనోళ్ళకి తాళాలు వెయ్యాల్సోచ్చిందో, ఎన్ని పెద్ద తలకాయలకి డిప్లొమాటిక్ మొట్టికాయలు వెయ్యాల్సోచ్చిందో.
ఒబామా రిమార్కులే తీసుకుంటే ఆయన చురకలు వేశాడా, వేస్తే ఎవరికీ వేసాడు అన్నది మొదటి సమస్య. వేసాడు, అదీ భాజపా + సంఘ్ పరివారానికి అని కనక అర్ధం చేసుకుంటే లేదా బయటి ప్రపంచం i.e. ప్రజలు అలాగే అర్ధం చేసుకుంటారనిపించి ఉంటే దానికి ఎలా రియాక్ట్ అవ్వాలనేది రెండో సమస్య.
మనం ఎలా అర్ధం చేసుకున్నా సో-కాల్డ్ సెక్యులరిస్టులు ఎడ్వాంటేజ్ తీసుకోకుండా చూడాల్సిన అవసరం ఒకటుంది.
అంతేకాదు, రోజు రోజుకీ పార్టీ పేరున చెలరేగుతున్న తలతిక్క స్లోగన్లు, వాదనలు ఎలాంటి సమస్యలు సృష్టించకుండా చూడాలి. ఎందుకంటే అవి హిందూ వోట్లని ఆకర్షించకపోగా దళిత, మైనారిటీ వోట్లని వికర్షించే ప్రమాదం ఎక్కువ.
ఈ లాస్ట్ పాయింట్ కి సంబంధించినంత వరకూ ఒబామా రిమార్కులు వోట్ స్వింగులు సృష్టించే ప్రమాదం ఉంది. డిల్లీ ఎలక్షన్ల మటుకు అవి అంతగా పని చేసి ఉండకపోవచ్చు కానీ ముందు ముందు పెద్ద రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ డామేజ్ చేసే ప్రమాదం ఉంటుంది. మోడీవేవ్ కి, సెక్యులర్ ఎజెండాకి మధ్య అన్-డిసైడెడ్ గా ఊగిసలాడే సెక్యులర్, దళిత, మైనారిటీ వోట్లని ఇలాంటి స్టేట్మెంట్స్ ప్రభావితం చెయ్యొచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మోడీ స్టేట్-మెంట్ లొ బుద్ధుడూ, గాంధీలకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందేమో.
ఒబామా స్టేట్-మెంట్ పడేసింది దిల్లీ ఎలక్షన్లకి పది రోజుల ముందు. కాంగ్రెస్ ని వదిలి బీజేపీకి వోటేద్దామా అని ఊగిసలాడుతున్న వాళ్లైన ఈ స్టేట్-మెంట్ కి ప్రభావితులయ్యె చాన్సుంది. అలా వోట్ స్వింగ్ తెప్పించాలన్న ఐడియా ఒబామాకి ఇచ్చే ఇంటరెస్టెడ్ పార్టీలు కూడా ఉన్నాయని అనుమానం. ఎందుకంటే, ఒబామా బీజేపీనే అన్నాడని కాంగ్రెస్సూ, అనలేదని బీజేపీ కిందామీదా పడుతుంటే ఒబామా యూఎస్సెళ్ళిపోయి అక్కడ నేషనల్ ప్రేయర్ బ్రేక్-ఫాస్ట్ మీటింగ్ లో మళ్ళీ ఆ టాపిక్ లేవనెత్తాడు. స్వహస్తాలతో టీ కలిపిచ్చానన్న కృతజ్ఞత కూడా లేకుండా ఇలా డామేజింగ్ స్టేట్-మెంట్స్ ఇస్తావా అని మోడీ అడక్కుండా డామేజ్ కంట్రోల్ చేస్తున్నట్టు పరమత అసహనం అనేది క్రిస్టియానిటీలోనూ, ఇతర మతాల్లో కూడాను ఉందని వ్రాక్కుచ్చి బాలెన్స్ చేసేశాడు. అంతవరకూ బానేవుంది. బాలన్సింగ్ స్టేట్మెంట్ ఇచ్చిన వేదికే కొంచెం అనుమానాస్పదం. ఆ వేదిక పేరు The Fellowship. జాతీయ ప్రార్ధనా ఫలహారం, ఐ మీన్, నేషనల్ ప్రేయర్ బ్రేక్-ఫాస్ట్ – horrible translation, right?– దాన్ని స్పాన్సర్ చేసే ఒక క్రిస్టియన్ సంస్థ. One of the most politically well-connected ministries in the United States అనిపించుకున్న సంస్థ. దాని కార్యకలాపాలు మోస్ట్లీ లో-ప్రొఫైల్ గా జరుగుతాయి ఒక్క నేషనల్ ప్రేయర్ బ్రేక్-ఫాస్ట్ తప్ప. ఈ ఈవెంట్ మాత్రం యూ ఎస్ ప్రెసిడెంటు, అమెరికన్ కాంగ్రెస్ మెంబర్స్, విదేశీ ప్రభుత్వాధినేతలు, డిప్లొమాట్స్ – వీళ్ళందరూ హాజరయ్యే సంవత్సరీకం(ఆన్యువల్ ఈవెంట్ అని కవి హృదయం). అందులో ఫెలోషిప్ వారి పాత్ర మాత్రం పైకి కనిపించదట. ఇప్పటికీ చాలా మంది ఈ ప్రార్ధన ఫలహార సమావేశం ప్రెసిడెంట్ మరియు కాంగ్రెస్ సభ్యులు నిర్వహించే కార్యక్రమం అనుకుంటార్ట. ఐతే ఫెలోషిప్ వారికి ప్రపంచంలో జరిగే విదేశీ వ్యవహారాల్లో ఏదో జోక్యం ఉందని, యూ ఎస్ గవర్నమెంటునీ, పొలిటీషియన్సునీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనీ అంటారు. లాస్ ఏంజెల్స్ టైమ్స్ వాళ్ళు ఫెలోషిప్ కార్యకలాపాలపై చేసిన రీసెర్చిలో the organization has had extraordinary access and significant influence on foreign affairs for the last 50 years అని తేలిందిట. ఈ గ్రూప్ కి లీడర్ అయిన డేవిడ్ కొ ప్రకారం, ఈ గ్రూపు ధ్యేయం ఏంటంటే క్రీస్తు ‘సువార్త’ని ప్రచారం చేయడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఒక family of friendsని తయారు చెయ్యడంట. జీసస్ బోధలకి అన్ని మతాల వాళ్ళూ ఆకర్షితులౌతారని వాళ్ళ నమ్మకంట. దేశాధినేతల హృదయాల్లో మార్పు తెస్తే అట్టడుగు వర్గాలు, అణగారిన వర్గాలకి ఊరట కలుగుతుందిట. ఇంకా నెట్లో చాలా డిటైల్స్ ఉన్నాయి. నోట్ చెయ్యాల్సిన విషయం ఇదీ- కొందరు ఈ ఆర్గనైజేషన్ కేవలం జీసస్ పై ప్రపంచంలో అందరికీ ఉన్నప్రేమ ఆధారంగా పనిచేస్తుందని నమ్మితే, మరికొందరు ఈ ఫెలోషిప్ Secret fundamentalism at the heart of American Power అనుకుంటారు. మరొక విషయం ఏంటంటే ఒబామా మాటల వెనక ఈ సంస్థ ప్రోత్సాహం ఉందా అనేది. ఇండియాలో హిందూ అభిమానం కలిగిన పార్టీ అధికారంలో ఉంది కనక ఒబామా స్థాయి వ్యక్తి అక్కడి మైనారిటీల తరఫున మాట్లాడ్డం మంచిదని వీళ్ళు సలహా ఇచ్చి ఉండొచ్చు కదా? ఒబామాకీ ఇది బానే ఉందనిపించి ఉంటుంది కదా? ఎంతైనా అమెరికన్ వీసా నిరాకరించబడిన వ్యక్తి దేశప్రధాని అవ్వడం, అతనితో కల్సి పనిచేయ్యాల్సి రావడం, అది కొందరికి కంటగింపుగా ఉండటం, ఎట్సెట్రా ఎట్సెట్రాలన్నీ కలిపి చూస్తే ఓ మాటనేసి మోడీకి ఓ చిన్న ఝలక్ అయినా ఇవ్వచ్చులే అనిపించి ఉంటుంది. ఫ్యూచర్లొ నడపవలసిన రాజకీయాలకి ఏదో ఒక దశలో ఇదొక అస్త్రంగా వాడుకోవచ్చనీ అనిపించుంటుంది. ఒక వేళ కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకొస్తే వాళ్ళని అమెరికా విషయంలో మంచి మూడ్ లొ ఉంచడానికీ ఇది పనికి రావచ్చు. ఇలా రకరకాల అలోచించి ఓ ముక్క వదిలి చక్కా వెళ్ళిపోయాడు ఒబామా. మోడీ రెస్పాన్స్ కూడా బానే ఉంది, దానికై ఎంచుకున్న వేదికా యాప్ట్ గానే ఉంది. కానీ అదేదో ముందే – చర్చిల మీద ఎటాక్స్ జరిగినప్పుడే, గాడ్సేకి గుళ్ళు కట్టె ప్రపోజల్స్ వచ్చినప్పుడే – ఇచ్చేస్తే బావుండేదేమో. ఎట్ లీస్ట్, కాంగ్రెస్ పార్టీ రెచ్చిపోయి తనేదో మహాత్మురాలన్నట్టు లెక్చర్లివ్వకుండా ఉండేది. Probably they waited to test the waters first before deciding to put the religious card on the back burner. 

మొత్తమ్మీద ఈ పరిణామాలు ఒక విధంగా బీజేపీకి హిందుత్వ కార్డు ఎప్పుడు ఎలా ఉపయోగించాలన్న విషయంలో ఒక దిశా నిర్దేశం ఇచ్చాయనుకోవచ్చు.
ఒబామా డైలాగ్స్ వల్ల వోట్ స్వింగ్ జరిగిందని ఎవరూ అనట్లేదు కానీ వచ్చే నాలుగేళ్లలో రాబోయే ఎన్నికల్లో ఎంతో కొంత ఎఫెక్ట్ చూపించొచ్చు. అమెరికానుంచి మళ్ళీ మళ్ళీ ఈ టైపు స్టేట్మెంట్స్ రానూ వచ్చు, పెద్ద డామెజే జరగచ్చు అనిపించుంటుంది.
2014 లోక్-సభ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన మెజారిటీ మోడీ వేవ్ వలనా, కాంగ్రెస్ వ్యతిరేక పవనాల వలనా, ప్రజల్లో హిందూత్వపై అర్జెంట్ గా పుట్టిన ప్రేమ వలనా అనేది కూడా క్లియర్ ఐడియా వచ్చుంటుంది.
పూర్వం కాంగ్రెస్ కి పడిన వోట్లు, కిరణ్ బేడీ వ్యతిరేక వోట్లు కలిసి ఆప్ గెలిచిందని విశ్లేషించుకున్నా ఆప్ కి పడిన పాజిటివ్ వోట్ ఇది అని మొత్తమ్మీద తేలింది. ఎనిమిది నెలల పాలన తర్వాత మోడీ వేవ్ కానీ, హిందూత్వ కార్డు కానీ వోటర్లని ప్రభావితం చెయ్యలేదని, పనిచేస్తుందని నమ్మిన పార్టీని మతాలకి, వేవ్-లకీ అతీతంగా ప్రజలు గెలిపిస్తారని క్లారిటీ వచ్చుంటుంది.
సౌతిండియాలో ప్రాంతీయ పార్టీలకి ఎసరుపెట్టి బలపడడానికి బీజేపీ సాహసాలు చెయ్యకుండా ఆపచ్చు.
టీఆరెస్, టీడీపీలకి ఆప్ రూపంలో కొత్త మిత్రపక్షం దొరికితే ఇక బీజేపీ నాటకాలాడకుండా కొత్త రాష్ట్రాలకి చెయ్యవలసిన సాయం చెయ్యాలన్న”సద్బుద్ధి” కలిగించొచ్చు.
మోడీకి కూడా పార్టీకి ప్రభుత్వానికీ మధ్య ఎంత డిస్టెన్స్ ఏ విధంగా మెయింటైన్ చెయ్యాలనే ఐడియా వచ్చుంటుంది.
ఓ రకంగా మోడీకి హిందుత్వ ఎజెండాని కొద్దిగానైనా పక్కకి పెట్టి అభివృద్ధి ఎజెండాని ఇంకా ముందుకి తెచ్చే, పార్టీపై పట్టు మరింత బిగించే మంచి అవకాశం వచ్చింది. హోప్-ఫుల్లీ హి విల్ యూజ్ ఇట్ టూ కంట్రీ’స్ ఎడ్వాంటేజ్. ఇప్పుడు 14.2% ఉన్న ఒక మతపు జనాభా 2101 కి 17% ఔతుందని సచార్ కమిటీ అంచనా. అంటే ఇప్పుడు పదహారు కోట్లున్న వాళ్ళు ఇంకో ఎనభైఆరేళ్ళకి ముప్ఫై రెండు కోట్లు ఉంటారు. షుమారు ఏడాదికి ఇరవైలక్షలు పెరుగుతారు. దీన్నిబట్టి చూస్తే జనాభా దృష్ట్యా ఇప్పట్లో హిందువులకొచ్చే నష్టమేమీలేదు. అందువల్ల మోడీ హిందూత్వ వాదాన్ని బాక్ బర్నర్ పై పెట్టడంపై పరివారం బాధపడాల్సిన అర్జెంట్ అవసరంలేదు, ప్రొవైడెడ్ దే అండర్స్టాండ్ ఇట్ ఫ్రం ద రైట్ పెర్స్పెక్టివ్.

(ఇప్పుడే అందిన వార్త, ఒబామా రిమార్కుల వెనక 1984లో సిఖ్ఖులపై జరిగిన ఎట్రాసిటీస్ పాత్ర కూడా ఉందిట. మోడీ స్టేట్మెంట్ కి వైట్ హౌస్ ప్రతిస్పందనలో ఈ విషయం మెన్షన్ చేసారు. సో, కాంగ్రెస్ వాళ్లకి తమ మతసహనంపై చంకలు గుద్దుకునే చాన్స్ ఎగిరిపోయినట్టే)

“”””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””

Published by YVR's అం'తరంగం'

These little thoughts are the rustle of leaves; they have their whisper of joy in my mind...

Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

vedika

your forum for critical and constructive writings

నా కుటీరం

chinaveerabhadrudu.in

Kadhana Kuthuhalam

మరపురాని కథలను మళ్ళీ చదువుదాం.!

🌿🐢YVR's 👣Walks🐾With🌾Nature🐌🍄

🌻Look deep into nature, and then you will understand everything better 🌹 👨‍🔬Albert Einstein👨‍🏫

ఉహల ఊసులు

కవిత్వం, వంటా - వార్పు, మనసులో మాటలు, అక్కడ - ఇక్కడ

Kavana Sarma Kaburlu

All Rights Reserved

Prasad Oruganti

“I've learned that people will forget what you said, people will forget what you did, but people will never forget how you made them feel”— Maya Angelou

A Birder's Notebook

"Learning to bird is like getting a lifetime ticket to the theater of nature".

SEEN ALONG THE TRAIL

"I am at home among trees." ~ J.R.R. Tolkien

BUDGET BIRDERS

birding the world on a budget

Mike Powell

My journey through photography

Singapore Bird Group

The blog of the NSS Singapore Bird Group

MORGAN AWYONG

little truths . little deaths

Animals in South-East Asia

By Andrew Rhee (http://blog.daum.net/fantasticanimals)

Singapore Birds Project

Singapore birds information for birders by birders

Life is a poetry

Life is a beautiful journey. Live, discover, feel and fall in love with it

cindyknoke.wordpress.com/

Photography and Travel

vedika

your forum for critical and constructive writings

నా కుటీరం

chinaveerabhadrudu.in

Kadhana Kuthuhalam

మరపురాని కథలను మళ్ళీ చదువుదాం.!

🌿🐢YVR's 👣Walks🐾With🌾Nature🐌🍄

🌻Look deep into nature, and then you will understand everything better 🌹 👨‍🔬Albert Einstein👨‍🏫

ఉహల ఊసులు

కవిత్వం, వంటా - వార్పు, మనసులో మాటలు, అక్కడ - ఇక్కడ

Kavana Sarma Kaburlu

All Rights Reserved

Prasad Oruganti

“I've learned that people will forget what you said, people will forget what you did, but people will never forget how you made them feel”— Maya Angelou

A Birder's Notebook

"Learning to bird is like getting a lifetime ticket to the theater of nature".

SEEN ALONG THE TRAIL

"I am at home among trees." ~ J.R.R. Tolkien

BUDGET BIRDERS

birding the world on a budget

Mike Powell

My journey through photography

Singapore Bird Group

The blog of the NSS Singapore Bird Group

MORGAN AWYONG

little truths . little deaths

Animals in South-East Asia

By Andrew Rhee (http://blog.daum.net/fantasticanimals)

Singapore Birds Project

Singapore birds information for birders by birders

Life is a poetry

Life is a beautiful journey. Live, discover, feel and fall in love with it

cindyknoke.wordpress.com/

Photography and Travel

Why watch wildlife?

A site dedicated to watching wildlife

Discover WordPress

A daily selection of the best content published on WordPress, collected for you by humans who love to read.

Gangaraju Gunnam

What I love, and mostly, what I hate

చిత్రకవితా ప్రపంచం

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

సాహితీ నందనం

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

బోల్డన్ని కబుర్లు...

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

SAAHITYA ABHIMAANI

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

లోలకం

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

కష్టేఫలే(పునః ప్రచురణ)

సర్వేజనాః సుఖినో భవంతు

కష్టేఫలి

సర్వేజనాః సుఖినోభవంతు

zilebi

Just another WordPress.com site

కష్టేఫలే

సర్వేజనాః సుఖినోభవంతు

అంతర్యామి - అంతయును నీవే

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

ఎందరో మహానుభావులు

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

వరూధిని

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

హరి కాలం

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

The Whispering

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

Satish Chandar

Editor. Poet. Satirist

పిపీలికం

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

పని లేక..

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

గురవాయణం

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

పక్షులు

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

ఆలోచనలు...

అభిమానంతో మీ ప్రవీణ.....

Vu3ktb's Blog

Just another WordPress.com weblog

ఆలోచనాస్త్రాలు

............... ప్రపంచంపై సంధిస్తా - బోనగిరి

abhiram

album contains photos of my thoughts & feelings

%d bloggers like this: