భూమ్మీద మొదటి జీవి పుట్టినప్పుడు తను బ్రతకాలంటే పరిసరాలనుంచి ఏదో ఒకటి సంగ్రహించాలన్న విషయం ఎలా తెలుసుకుంది? – {అం’తరంగా’ల్లో విశ్వకవి భావాలు-2}


YVR's అం'తరంగం'

రవీంద్రుడి దృష్టిలో “స్కాండినేవియన్ దేశాల ప్రజలకి సంబంధించినంత వరకు సముద్రం వారి జీవన విలువలని ప్రతిబింబిస్తుంది. ఉత్తుంగ తరంగాలతో నేలతో, ఆ నేలతల్లి బిడ్డలతో ఎడతెగని యుద్ధం చేస్తూ కడలి వారికి నిరంతరం పొంచి ఉండే ప్రమాదంగా, అధిగమించవలసిన అడ్డంకిగా కనబడుతుంది. అజేయమైన మానవుడి ఆత్మస్థైర్యానికి విలయ ప్రకృతి విసిరే సవాలు సముద్రం. ఈ పోరాటంలో మనిషే గెలిచాడు, అది అతనిలో పోరాట స్ఫూర్తి నింపి ఇప్పటికీ అతనిచేత దారిద్ర్యం, నియంతృత్వం, అనారోగ్యాలపై యుద్ధం చేయిస్తోంది. నౌకాయానం నేర్చి మహాసముద్రాలు దాటి భూమిని చుట్టి వ్యతిరిక్త పరిస్థితులని అనుకూలంగా మార్చుకోవడం నేర్చుకున్నాడు.”

INNER WAVE

ప్రకృతిలో పుట్టిన మనిషి దాని తత్వాన్ని, చేష్టలనీ గమనించి, ప్రశ్నించి, పరిశోధించి దానికి అతీతుడయ్యే ప్రయత్నం చేస్తాడు. చాలాసార్లు కృతకృత్యుడౌతాడు. కానప్పుడు ఇలా ఎందుకు జరిగిందనే ప్రశ్నతో, విశ్లేషణతో మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తాడు.

మనిషి అలుపెరగని ప్రయత్నం అలలతో తీరాన్ని కుదిపి కుదిపి ప్రశ్నించే సాగరాన్ని తలపిస్తే; తన చేష్టల్లోనే తన రహస్యాల్ని ఛేదించే సూచనలు దాచివుంచి ఏమీ ఎరగనట్టు ప్రవర్తించే ప్రకృతి ఆకాశానికి ప్రతీక.

ఏ సమస్యకైనా పరిష్కారమార్గం ప్రశ్నలతో ప్రారంభం అవుతుంది.
క్వెస్ట్, అన్వేషణ, శోధన, తత్త్వ చింతన … ప్రశ్నకి పర్యాయపదాలు. ప్రస్తుతంలో మిగిలిఉన్న చిక్కుముళ్ళకి సంకేతాలు.
భూమ్మీద మొట్టమొదటి జీవి ఆవిర్భవించినప్పుడు దానికి చుట్టూ ఉన్న ప్రపంచం అస్సలేం తెలీదు కదా. తను బ్రతకాలంటే తన పరిసరాలనుంచి ఏదో ఒకటి సంగ్రహించాలన్న విషయం దానికి ఎలా…

అసలు టపాను చూడండి 480 more words