Don’t know if this world can ever give answers to the thousand questions that your young heart is pining for, O hero’s daughter !
ఈ దుఃఖానికి కారణమెవరు?ఈ గాయానికి బాధ్యులు ఎవరు?
మనుషుల మధ్యన మంటలు పెట్టే మతమా?మతం పేరుతో నాటకమాడే రాజకీయమా?
ఈ దుఃఖానికి కారణమెవరు?ఈ గాయానికి బాధ్యులు ఎవరు?
చేతికొచ్చిన తలరాతలు రాసే దేవుళ్ళా?దేవుడి పేరిట ద్వేషం నేర్పే మనుషులా?
ఈ దుఃఖానికి కారణమెవరు?ఈ గాయానికి బాధ్యులు ఎవరు?
అమాయకంగా ప్రాణాలొడ్డే దేశభక్తులా?అధికారంకై ఎత్తులు వేసే దేశభోక్తలా?
ఈ దుఃఖానికి కారణమెవరు?ఈ గాయానికి బాధ్యులు ఎవరు?
జిహాద్ ముసుగులో మూఢులు చేసే రక్తపాతమా?చేతకానితనపు ఆయుధం పట్టిన శాంతికపోతమా?
ఈ దుఃఖానికి కారణమెవరు?ఈ గాయానికి బాధ్యులు ఎవరు?
విభజించి పాలించే సామ్రాజ్యవాద స్వార్ధపరత్వమా?వ్యాపారానికి ఆదర్శాల్ని బలిచేసే బడుగుదేశాల నిస్సహాయత్వమా?
కులమతవర్గ ప్రాంతవర్ణజాతిబేధాలను పాటించనివి తీరని దుఃఖాలూ,మానని గాయాలే, మనుషులు కాదు
సరిహద్దులు, అంతస్తులు, ఆచారాలకి అతీతమైనవి వ్యాపారం, దురహంకారం, అధికార దాహం అంతే, మానవత్వం కాదు
మనుషులందర్నీ ఒకటి చేసేది మంచి మనసు, కానీ దేవుళ్ళని విడగొట్టేది మనసు చచ్చిన మతం
తెలుసుకో పిచ్చితల్లీ, ఏడవకు మళ్ళీ మళ్ళీ
గాయాలు, దుఃఖాలు, మతమౌఢ్యాలు, సిద్ధాంతాల్లో తేడాలు, మనుషుల మధ్య గోడలు, అవి రాజకీయాల పంచ ప్రాణాలు
రాజకీయం, దురహంకారం, వ్యాపారం, అధికారం, అతివ్యామోహం ఇవి స్వార్ధానికి పంచశిరస్సులు
రాజకీయాల పంచప్రాణాలు పోతేనే…
View original post 32 more words