బాంధవఘర్ నేషనల్ పార్క్. జీపులో అడవిలోకి వెళ్తున్నాం. తెల్లవారు ఝాము ఐదు అవుతుంటే మౌగ్లీ రిసార్ట్ నుంచి బయల్దేరాం. కటిక చీకటి ప్లస్ చిక్కటి చలి. ఓపెన్ టాప్ జీప్ లో ముందు డ్రైవరూ, వెనక సీట్లో మేమిద్దరం. భాయ్ సాబ్! నీ దగ్గర గన్ ఉందా అని వచ్చీ రాని హిందీలో అడిగా. గన్ గిన్ ఏమవసరంలేదు సాబ్. మనం జీపులో ఉన్నంతసేపూ పులి మన జోలికి రాదు. నా సీటు పక్కనుంచి రెండడుగుల దూరంలో పులి నడుచుకుపోవడం ఎన్నిసార్లు జరిగిందో లెక్కేలేదు అన్నాడు. ఇప్పుడు పులిని అంత దగ్గర్నుంచి చూడడం అవసరమా అనే ప్రశ్న మనలో రావాలి కదా. రాలేదు. జిమ్ కార్బెట్, కెన్నెత్ ఆండర్సన్ ల అనుభవాలని ఉపాసించిన, వాళ్ళ పుస్తకాలని ఔపోసన పట్టిన పుణ్యఫలమో ఏమో అస్సలు భయం వెయ్యలేదు. భయం వెయ్యలేదా? లోపలున్న భయం బయటపడలేదా? తెలీదు. డిసెంబర్ కావడంతో అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణం. సాలవృక్షాలు (ఏగిస / Sal), వెదురు పొదలు నిండిన అడవి. మధ్య మధ్య పచ్చిక బయళ్ళు, చిన్నపాటి యేళ్ళు, అక్కడక్కడా రాళ్ళ గుట్టలు, ……దూరంగా కొండల మీద బాంధవఘర్ ఫోర్ట్.
నిశ్శబ్దంగా ఉన్న అడవిలో మట్టి రోడ్డు మీద ఎక్కువ చప్పుడు లేకుండా జీపు వెళ్తోంది. బాట, అడవిబాటకి రెండు పక్కలా జంగిల్ జయింట్స్ అన దగ్గ టేకు, ఏగిస, విప్ప (mahuva) చెట్లు. వాటి మధ్య నుంచి అప్పుడే ఉదయిస్తున్న…
View original post 962 more words