నో.వా.చే.రా – 03 స్వచ్ఛ భారత్


‘యువ’నేత ఉవాచ:

“Modi had said (in his Lok Sabha campaign) I alone will generate employment… I alone will build factories, roads and airports. But after forming government, he said you people take the broom, I am going to Australia.”

కరెక్టే. పాత ప్రభుత్వహయాంలో ఇప్పించిన ఉద్యోగాలు చేస్తూ మోడీ పీఎమ్ గా వచ్చి చీపురు పట్టి గుర్తు చేస్తే కానీ శుభ్రత పట్టించుకోనంత బిజీ అయిపోయారు ప్రజలు. ఉద్యోగాలు పుట్టిస్తూ బిజీ ఐపోయి పాత ప్రభుత్వాలు శుభ్రతని పక్కన పెట్టాయి కానీ వాళ్లకి తెలియక కాదు. ఐనా దేశాన్ని అభివృద్ధి పధంలో నడిపించటం చెత్త చీపురుతోనా?అసహ్యంగా. ఆధునికత ఉండక్కర్లా?పైపైన చూస్తే ఈ విమర్శ చైల్డిష్ గా ఉన్నా, దీని వెనక చాలా అర్ధం ఉంది.

ఇంకా ఎన్నో ఇతర అంశాలు ఉండగా ఈ మాటర్ మీద ఫోకస్ పెట్టారంటే అమ్మ చెప్పింది కాబట్టో లేకపోతే ఇంకేదో అత్యంత మేధోపరమైన విషయం ఉండొ కానీ ఇంత గొప్ప పాయింట్ తీస్తారా ఎవరైనా? నా మట్టిబుర్రకి తట్టిన పాజిబిలిటీ ఏంటంటే –

జస్ట్ చీపుళ్ళు పట్టుకుంటే ఉద్యోగాలేమొస్తాయని? మహా అయితే చీపుళ్ళ తయారీవాళ్లకి బిజినెస్ పెరుగుతుంది. పెద్ద ఎత్తున ఎంప్లాయిమెంట్ జెనరేషన్ జరుగుతుందా? దాని బదులు, ఫరెగ్జాంపుల్, ఓ రేజర్ పట్టుకుని పబ్లిగ్గా గడ్డం గీసేసుకుని ఓ ఇరవైమంది సెలబ్రిటీలకి ముందు గడ్డం పెంచుకుని, గీసేసుకోండని పిలుపిచ్చేయ్యాలి. వాళ్ళు తమ వంతుగా తలో ఇరవైమందికి గడ్డం పిలుపిస్తారనమాట. దీంతో రేజర్లు, బ్లేడ్లు, షేవింగ్ క్రీం లాంటి క్షవర శాస్త్రాదారిత పరిశ్రమలకి వ్యాపారం పెరిగి, కొత్త ఉద్యోగాలు కల్పించబడతాయి. ఇందాక చెప్పిన విగ్రహాల ఇండస్ట్రీ లాగే ఇది కూడా క్షవరాదారిత పరిశ్రమల్ని వృద్ధి చేస్తుంది. ప్రత్యక్ష క్షవరానికి సంబంధించిన అభివృద్ధి ఇది. ఐతే ఈ స్కీములో ఉన్న గొప్పతనం పైపైన చూస్తే అర్ధం కాదు. కొంచెం ఆలోచిస్తే అప్రత్యక్ష క్షవరాలని ఉంటాయని, క్షవరం జరుగుతోందని సామాన్యుడికి అర్ధమయ్యేలోగా ప్రజలందరికీ కలిపి మూకుమ్మడిగా అవి జరిగిపోతాయని అర్ధమౌతుంది. విషయం గ్రహించిన అప్రత్యక్ష క్షవర బాధితులు, అనగా ప్రజలు, అందుకు బాధ్యులైన వాళ్లకి మరో ఐదేళ్లపాటు గడ్డం పెంచుకునే అవకాశం ఇస్తారని కూడా తెలుస్తుంది. అందుకే పై స్టేట్మెంట్ ఇచ్చినాయన ఈ మధ్యే ఫ్రెష్ గా గడ్డం గీసుకుని రెడీ ఐపోయాడు. ఇలా అనేక ఉపయోగాలున్న స్కీములు పెట్టక ప్రజల చేత చీపుళ్ళు పట్టించి విదేశాలకి వెళ్లిపోవడం ఏఁవన్నా బావుందా?

పనిలేని పెద్దమనిషొకడు పిల్లి తల గొరిగినట్టు మాట్లాడవలసిన, విమర్శించదగిన మాటర్ ఉన్న అంశాలు ఎన్నో ఉండగా ఇదా విమర్శించే విధానం? మాస్టారికి ఆ మధ్యెప్పుడో ఒక రీసెర్చ్ గ్రూప్ చేసిన సర్వే సారాంశం తెలీదనుకుంటా. తెలిస్తే స్వచ్ఛ భారత్ కాన్సెప్ట్ ఇండియాకెంత అవసరమో అర్ధం అయ్యేది.

5 రాష్ట్రాల్లో-3200 ఇళ్లనీ,22000 మంది జనాన్ని కవర్ చేస్తూ- టాయిలెట్ వాడకం పై వాళ్ళ అభిప్రాయాలని, అలవాట్లని సర్వే చేసి హడిలిపోయి ఢిల్లీకి పారిపోయారు. క్లుప్తంగా సర్వే సారాంశం ఏంటంటే –

గ్రామాల్లో గవర్నమెంట్ కట్టించిన టాయిలెట్స్ ఉన్న ఇళ్లలో కూడా రోజూ వాటిని వాడరట, శుభ్రం చెయ్యాల్సి వస్తుందని. చాలా మంది ఓపెన్ ఎయిర్ యాక్టివిటీనే ప్రిఫర్ చేస్తార్ట.

సొంత శౌచగృహములున్ననూ పరిస్థితి అంతియేనట. 44% మంది సర్వే బాధితుల్లో ఇల్లు ఒక్కింటికి ఒక్కడైననూ బయటకు పోవుటకే ప్రయత్నింతురట. కాదు పోవుదురట. అది ఆరోగ్యానికి మంచిదని, సౌకర్యమని, భావింతురట. మోడీ ఎదుట ఉన్న చాలెంజ్ ఉట్టి చీపురు పట్టుకుని ఊడ్చెయ్యడం కాదు బాబోయ్! అలవాట్లే మార్చాలి. 2019 కల్లా అందరికీ శౌచగృహాలు అందుబాటులోకి వచ్చేసినా అవి సగం జనాభా వాడుకోకపోతే నిర్మల్ భారత్ అభియాన్ ద్వారా చేసిన, చెయ్యబోతున్న ఖర్చంతా డ్రైనేజీలోకి పోయినట్టేగా. అందువల్ల స్వచ్ఛ భారత్ లో ఉన్న మేటర్ వదిలేసి విమర్శించాలి కాబట్టి విమర్శించడం అర్ధంలేని పని. విమర్శించాలంటే దాని ఎక్జిక్యూషన్ని విమర్శించొచ్చు. అసలు ప్రాజెక్టే వేస్ట్ అనడం అనవసరం. ఎక్జిక్యూషన్ గురించి మాట్లాడాలంటే –

ఈ సర్వే గురించి విన్నాక సెలబ్రిటీలు రోడ్లు మాత్రమె కాదు, టాయిలెట్ క్లీనింగ్ కూడా మొదలు పెట్టాలేమో అనిపిస్తోంది. వాళ్ళు మాత్రం ఎంచక్కా ఓ గంట ఊడ్చేసి వేరేవాళ్ళని నామినేట్ చేసేసి చేతులు కడిగేసుకుంటున్నారు. నిజానికి పైన చెప్పిన సర్వే “బాధితులకి”, ఈ సెలబ్రిటీలకి జీవన ప్రమాణాల్లో తప్ప ఆలోచనా విధానాల్లో పెద్ద తేడా ఉన్నట్టు లేదు. ఓ గంట క్లీనింగ్ చేసేసి మరో తొమ్మిది మందికి ఆహ్వానం ఇచ్చేస్తే సరిపోతుందని వీళ్ళనుకుంటున్నారా? మామూలు ప్రజల ఆలోచనా విధానం, జీవన శైలిలో మార్పులు రావడం అంత తేలికకాదు. అందుకు చాలా వర్క్ చెయ్యాలి. దానిక్కావాల్సిన ఉత్సాహం, విజన్ మోడీకి ఉన్నాయి. ప్రస్తుత వాతావరణంలో మోడీకి మాత్రమె ఉన్నాయి అంటే అతిశయోక్తి కూడా కాదు. ఐతే ఆయనలాగా ఇతర ప్రజా ప్రతినిధులు. సెలబ్రిటీలు, స్టార్లు, టైకూన్లు ఓ గంట క్లీనింగ్ చేసేసి వెళ్ళిపోతే సరిపోదు. ఆయన ఓ గంట సింబాలిక్ గా చేసిన పని వీళ్ళు వారానికోసారైనా చేస్తేగానీ సరిపోదు. మోడీ ఐడియాకి ప్రతీ ప్రముఖుడు తన సొంత ఐడియాలూ, చొరవా యాడ్ చెయ్యొద్దూ? అప్పుడుకానీ అదో ఫీవర్ గా మారదు. ఈ విషయం మళ్ళీ మోడీ చెప్తే కానీ ప్రముఖులకి ట్యూబ్ లైట్ వెలగదు. Can’t beleive it.

అసలు సినిమా వాళ్ళు, కార్పోరేట్ పెద్దలు చీపుళ్ళు పట్టుకుని పోజులిచ్చినంత మాత్రాన జనాలు మారిపోతారా, అసలు కన్విన్స్ అవుతారా, అవుతారని వీళ్ళనుకుంటున్నారా? ఆశ్చర్యం ఏంటంటే సొసైటీలో ఇంత గుర్తింపు ఉన్న వీళ్ళకి ప్రధాని పిలిచే వరకూ ఇలాంటి ఐడియాలు రావు?వాళ్ళ పన్లు, డబ్బులు, పబ్లిసిటీ వాళ్లకి ముఖ్యం. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నా చాలా మటుకు సెలబ్రిటీలు మోడీ కరిష్మా వల్లో, పబ్లిసిటీ కోసమో, ఓవర్ నైట్ ఏదో మార్పు వచ్చేస్తోందని భ్రమ పడో సెలబ్రిటీలు వస్తారు తప్ప సీరియస్ గా ఇండియాని సింగపూర్ చేసేద్దామని కాదు. వాళ్ళదంతా లిప్ సర్వీసే. (Don’t take me wrong, I am not talking about their on-screen lip service) కొందరు వాళ్ళ మీదున్నకేసులు, వాళ్ళు చేసిన కబ్జాలు చూసి చూడనట్టు వదిలేస్తారనే ఆశతో (కృతజ్ఞ్జతతో ?) కూడా రావొచ్చు.

మీ ఏరియా శుభ్రంగా ఉంచితే వారానికి ఒక ఇంట్లో టీ, ఒకింట్లో టిఫినూ, కొందరితో ఫోటోలూ, .. ఎట్సెట్రా ఉంటాయి అనొచ్చు. ఒక్కొక్కడూ ఒక ఏరియా ఇన్-ఛార్జిగా ఉంటామని మోడీకి చెప్పవచ్చు.(ఈ ఆర్టికల్ రాసే టైముకి ఎవరైనా ఇది అమల్లో పెట్టారేమో తెలీదు. I hope someone did.)

అంబానీలు, ఆడానీలు కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఏడాదికో గ్రామం దత్తత తీసుకుని అక్కడ మంచినీళ్ళు, వైద్యం, పరిశుభ్ర వాతావరణం ఏర్పరచాలి.(సచిన్ టెండూల్కర్, ఇంకొందరు ఈ పని మొదలెట్టారు. కానీ అది సరిపోతుందా? టైకూన్స్ అంటా ఇందులో దిగాలి. అందువల్ల నెలకి కోటి రూపాయలు కరెంట్ బిల్లు, అంత బిల్లు కట్టాల్సిన ఇళ్ళు కట్టే బదులు అంతకంటే ‘చెత్త పని’ చెయ్యొచ్చు. అంత డబ్బు పెడితే నెలకో గ్రామానికి మంచి నీళ్ళు, టాయిలెట్ సౌకర్యం కల్పించెయ్యచ్చు).

ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతరత్రా చిన్నాపెద్దా లీడర్లూ వాళ్ళ లొకాలిటీల్లో శుభ్రతకీ, ఆరోగ్యానికీ బాధ్యత తీసుకుని రోజూ ఓ గంట దాని మీద పని చెయ్యాలి అందరూ చూసేలా. ఫుట్-పాత్ వాసులకీ, నిరాశ్రయులకీ డార్మిటరీల్లాంటివి ఏర్పాటు చెయ్యాలి. సిటీల్లో ఈ అభాగ్యుల్ని ఆదుకోకపొతే ఇలాంటి అభియాన్ లకి అందం ఉండదు. కార్పోరేట్స్ ఈ విషయం ఆలోచించాలి. ఇవన్నీ కాక, ప్రభుత్వం కొన్ని దేశాల్లో లిఫ్ట్స్ లో మానిటరింగ్ కెమేరాలు పెట్టినట్టు (మహానుభావులు అన్ని దేశాల్లో ఉన్నారు) ఇక్కడ కూడా (సిటీల్లో కాలవ గట్లు, పార్కులు, etc), కనీసం, డమ్మీ కెమేరాలు పెట్టి ప్రకృతితో మరీ ఇంత భయంకరంగా తాదాత్మ్యం చెందేవాళ్ళని (ప్లీజ్ రిఫర్ టూ పైన చెప్పిన సర్వే) కొంత బాధ పెట్టక తప్పదు.

హైదరాబాద్ లో కిళ్ళీ ఉమ్ములేసే వాళ్ళని కూడా ఈ పధకం కింద కవర్ చెయ్యాలి, పాపం! కెమెరా ఉన్నది జాగ్రత్త! అని బోర్డ్లు పెట్టడం మర్చిపోకూడదు.

ఇక మంత్రులూ, ప్రజాప్రతినిధులు తమకి తోచిన విధంగా మోడీ కళ్ళలో పడ్డానికి ఏదో ఒకటి చేస్తారు తప్ప వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏమీలేదు. to give them the benefit of doubt, ప్రస్తుతానికైతే కనబడదు. They are more comforatable riding modi wave than creating their own, if not bigger, waves. ఇంకా వాళ్ళకా అలవాటు అబ్బలేదు. వాళ్ళకంత క్రియేటివిటీ కానీ, పవర్ కానీ ఉన్నట్టు కనబడదు.

ఇవన్నీ మోడీకి తెలియవనుకోవడం కాదు కానీ, ఫ్రాంక్లీ స్పీకింగ్, స్వచ్ఛ భారత్ సాధించాలంటే ఆయనకి సరైన డెప్యూటీ అవసరం. ఇది దేశానికి ఇమేజ్ “బిల్డప్” కాదు, ఇమేజ్ ట్రాన్స్-ఫర్మేషన్ అని మోడీ ఆకాంక్ష అర్ధం చేసుకున్న మంచి, ఫుల్ టైం డెప్యూటీ ఉండాలి. అతను టైకూన్లు, స్టార్స్, ప్రజాప్రతినిధులు, సామాన్య జనం అందరికీ దిశానిర్దేశం చేస్తూ వచ్చే ఐదేళ్ళలో ప్రతిరోజూ వేడి పుట్టించాలి. లేకపోతే స్వచ్ఛ భారత్ డీలా పడొచ్చు లేదా అవకాశం కోసం చూస్తున్న కొందరు షాజియా ఇల్మి క్లీనింగ్ ప్రోగ్రాం ఫార్సుని వాడుకుని దుష్ప్రచారం చెయ్యచ్చు. కొందరు ఇలాంటి పన్లు చెయ్యడానికే ప్రోగ్రాంలో దూరొచ్చు. అన్నా టీమ్ లో అగ్నివేష్ లాగా. మోడీకి దుష్ప్రచారాల్ని తిప్పికొట్టడం బాగా తెలుసు. కానీ ఆయన ఇలాంటివాటికి తన విలువయిన సమయం వెచ్చించాలా? తమ తమ రంగాల్లో యమా క్రియేటివ్ గా ఉండే సెలబ్రిటీలు, బిజినెస్ టైకూన్లు స్వచ్ఛ భారత్ కోసం ఇనిషియేటివ్ తీసుకోలేరా?

ఇదంతా వ్రాసాక మరీ ఇంత సీరియస్ గా తీసుకోవాలా అనిపించి కొట్టి పారేశా. టపా పోస్ట్ చెయ్యకుండా ఉంచేసా. గాంధీజీ అనుయాయి, వి.కళ్యాణంగారి గురించి తెలిసే వరకూ……