మెనూ ముంగిలి

ఆకా…శ్శ్య వాణి వార్తలు చదువుతున్నది … ఎవరు చదివితే ఏంటండీ?ముందు వినండి, చివరివరకూ!

ఈ రోజు ప్రధాని షామల్ దాస్ రంచోడ్ దాస్ చంచడ్, ప్రతిపక్ష నాయకుడు ఫున్ సుక్ వాంగ్ఢు లోకసభలో ఒక సంయుక్త ప్రకటన చేసారు. ప్రస్తుతం దేశం సాధిస్తున్న ఆర్ధిక పారిశ్రామిక ప్రగతిని దృష్టిలో ఉంచుకొని, దీని వలన రాగల నైతిక దుష్పరిణామాలని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రకటన చేస్తున్నట్లు వారు వివరించారు. భారీగా జరిగే వ్యాపార లావాదేవీలు, సహజ వనరుల వినియోగం, ప్రభుత్వ వ్యయాలు, ఎన్నికల ప్రచార ఖర్చులు రాజకీయ నాయకులను కార్పొరేట్ల, మాఫియాల చేతుల్లో తోలుబోమ్మలుగా మార్చేఅవకాశం ఉందనీ, దీనిని మొగ్గలోనే త్రుంచివేయాల్సిన అవసరం ఉందనీ వారు అభిప్రాయపడ్డారు. ఈ నేపధ్యంలో దేశ రాజకీయ వ్యవహారాలలో కొన్ని మౌలిక మార్పులు తీసుకు రావటానికి అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకాభిప్రాయానికి వచ్చినట్లు, త్వరలో ఈ మార్పులను తీసుకురావటానికి పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టనున్నట్లు చెప్పారు.

స్థూలంగా బిల్లు స్వరూపాన్ని వివరిస్తూ వారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా రాజకీయాలలో ప్రవేశించి అధికారంలోకి రావచ్చుననీ, ఐతే దీనిలో మంచీ చెడూ రెండిటికీ అవకాశం ఉందనీ, ఎట్టి పరిస్థితుల్లో చెడు మాత్రం జరగకుండా చూడడమే బిల్లు ఉద్దేశ్యమనీ పేర్కొన్నారు. ఈ బిల్లు ముఖ్యంగా రాజకీయాల్లో ప్రవేశించి ప్రజా సేవ చెయ్యాలనుకుంటున్న వర్ధమాన నాయకులను దృష్టిలో ఉంచుకుని రూపొందిస్తున్నామని, వ్యక్తులు కేవలం ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చేలా బిల్లు భరోసా ఇవ్వగలదని, ఇతరత్రా స్వార్ధపూరిత వ్యవహారాలకు తావిచ్చే అవకాశం ఉన్నవారిని వడపోస్తుందనీ ఆశిస్తున్నామని తెలిపారు. ఈ బిల్లు ఉభయ సభల ఆమోదం పొందిన తరువాత రాజకీయ ప్రవేశం చేసే వ్యక్తులందరూ కుల మతాలకతీతంగా ఎలక్షన్ కమిషన్ నిర్వహించే అర్హత పరీక్షలలో ఉత్తీర్ణులయి, ఫీల్డ్ వర్క్ ప్రాజెక్టులలో తమ సమర్ధతను, నిబద్ధతని నిరూపించుకోవాలని తెలిపారు. దీని వల్ల ఐదు నుంచి పది సంవత్సరాల కాలంలో ఇప్పుడున్న పాత తరం నాయకులు, పద్ధతులు పూర్తిగా ప్రక్షాళన కాగలవని భావిస్తున్నట్లు వారు తెలిపారు.
మరికొన్ని వివరాలు ….
పరీక్షా పత్రాలు జాతీయ స్థాయి అయ్యేఎస్ ల కమిటీ తయారు చేస్తుంది.

పరీక్షలో దేశావసరాలు, సాంఘిక ఆర్ధిక స్థితిగతులు, కొత్త పాలనా సంస్కరణల అవసరం, కులమత వర్గ ప్రాంతీయతలకతీతంగా పనిచేయ్యవలసిన అవసరం మొదలైన వాటిపై అభ్యర్ధుల అవగాహనా, నిబద్ధతలను అంచనా వెయ్యడం జరుగుతుంది.

ప్రతీ సంవత్సరం అన్ని రాజకీయ పార్టీలూ తమ భవిష్యత్ నాయకత్వ అవసరాలకు అనుగుణంగా అభ్యర్ధులను ఎంపిక చేసుకొని జాబితాను ఎన్నికల సంఘానికి పంపాలి. ఒక పార్టీ ఎంతమంది అభ్యర్దులనైనా పంపవచ్చు. అభ్యర్ధులు అన్ని కులాల వర్గాల మతాల మద్దతు ఉన్నవారై ఉండాలి. కనీసం డిగ్రీ ఉండి, ముప్ఫై ఏళ్ళు పైబడి, ఏదో ఒక రంగంలో స్వయంకృషితో పైకొచ్చిన వారై ఉండాలి.
నేర చరిత్రలు ఉండి, కేసులు పెండింగులో ఉన్నవారు కేసులు పూర్తయి నిర్దోషులని తేలిన తరువాత మాత్రమె దరఖాస్తులు పంపుకోవాలి. ఈ లోపు వారు పార్టీ కార్యకర్తగా మాత్రమె అర్హులౌతారు. చట్ట సభల్లో కూర్చునే అర్హత ఉండదు.
పరీక్ష పాసైన వారు ఇంటర్వ్యూకు హాజరవ్వాలి. పరీక్షలో ఇచ్చిన అంశాలపైనే మరింత లోతుగా, కూలంకషంగా ఇంటర్వ్యూలలో పరీక్షిస్తారు.
ఇంటర్వ్యూలలో ఉత్తీర్ణులైన వారు ముందుగా జిల్లా స్థాయిలో, తరువాత రాష్ట్ర, జాతీయ స్థాయిలలో మొత్తం పది సంవత్సరాల పాటు రాజకీయ ట్రైనీగా పని చెయ్యాలి. ట్రైనింగ్ లో అభ్యర్ధి తన సొంత జిల్లాకి కనీసం రెండు జిల్లాలు, లేక రాష్ట్రం దాటి వెళ్లి అక్కడున్న ప్రజా సమస్యలు, అవసరాలు, సంస్కరణలపై పనిచెయ్యాలి. ట్రైనింగ్ కాలంలో ఏ విధమైన నేరప్రవృత్తి, కుల/మత దురహంకారం బయటపడినా అభ్యర్ధి రాజకీయాలకు అనర్హుడౌతాడు.
ట్రైనీలు ఆయా జిల్లాల కలెక్టర్, ఎస్పీ, మేజిస్ట్రేట్ల పర్యవేక్షణలో ఉంటారు. ట్రైనింగ్ పూర్తయే సమయానికి ఆయా అధికారులు ఇచ్చిన కాండక్ట్ సర్టిఫికెట్లు ఎన్నికల సంఘానికి చేరుతాయి.
ట్రైనింగ్ విజయవంతంగా పూర్తయిన అభ్యర్ధులకు సెంట్రల్ సెలక్షన్ కమిటీ వివిధ రంగాలనుంచి ఎంపిక చేసిన సమస్యలను ప్రాజెక్టు వర్క్ గా ఇస్తుంది. వాటిని అభ్యర్ధులు వివిధ స్థాయిల నాయకులు, అధికారులు, ఆయా రంగాలలో నిపుణులైన వారితో పనిచేసి పరిష్కార మార్గాలు, వాటి అమలుకు అవసరమైన ప్లానింగ్, నిధులు వగైరాలపై కసరత్తు చేసి రిపోర్ట్ ఇవ్వాలి. వీరు సమర్పించిన నివేదికల ఆధారంగా కంప్యూటర్ సిమ్యులేషన్ ద్వారా పరిష్కార మార్గాల నాణ్యతను, సమర్ధతను నిర్ణయిస్తారు. ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో అమలు చేయవచ్చు. పాస్ మార్కులు పొందిన అభ్యర్ధులు చట్ట సభలలో పాల్గొనే అర్హత పొందుతారు.
అర్హత పొందిన అభ్యర్ధులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ సొంత ప్రాంతాలలో పని చెయ్యరాదు.

బిల్లు అమలులోకి రాగానే చట్ట సభలకి ఎన్నికైన అభ్యర్ధుల చేతులకి గడియారాన్ని పోలి ఉండే ఎలక్ట్రానిక్ సాధనాన్ని అమర్చడం తప్పనిసరి. ఇది విమానాలలో ఉండే బ్లాక్ బాక్స్ ను పోలిన పరికరం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల వ్యవహారాలన్నిటినీ ఆడియో, వీడియోలుగా రికార్డ్ చేసి భద్రం చేస్తుంది. అనుమానాస్పదులైనవారి చేతి పరికరాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి సమక్షంలో వేరు చేసి అందులోని సమాచారం విశ్లేషించేందుకు వీలుగా చట్టాలని సవరించడం జరుగుతుంది. ఈ సాధనాన్ని ధ్వంసం చేసే ప్రయత్నాలని ఇది తక్షణం రికార్డు చేసి ఇంటెలిజెన్స్ బ్యూరో ఆద్వర్యంలో పనిచేసే సెంట్రల్ కంప్యూటర్ కు పంపుతుంది. (ఇలాంటి బ్లాక్ బాక్సులని మతసంస్థల అధిపతులకి, ఆస్తులు బాగా ఉన్న ఆశ్రమాల అధిపతులకీ కూడా వర్తింపజేయ్యాలని ప్రతిపాదనలున్నాయి. తీవ్రవాద కార్యకలాపాలకి, ఆధ్యాత్మికత పేరుతో అడ్డదిడ్డమైన పన్లకి అడ్డుకట్ట వెయ్యడమే దీని ఉద్దేశం. మనోభావాలు దెబ్బతిన్నా ఫర్వాలేదు, అమాయకులు దెబ్బతినకూడదని నాయకుల ఉద్దేశ్యం)

ఇవి కాక కొత్తతరం మంత్రులు, సహాయ మంత్రులందరికీ ప్రైవేట్ కంపెనీ సీఈఓలతో సమానమైన జీతభత్యాలు ఇవ్వబడతాయి. దీనివల్ల వారికి లంచాలకు ఆశపడే అవసరం తగ్గుతుందని అంచనా.

పార్టీ నిధులు అడ్డదారుల్లో సంపాదించవలసిన అవసరం లేకుండా ఎన్నికల ప్రచారం అవసరం లేని కొత్త పధ్ధతిని బిల్లులో ప్రతిపాదిస్తారు. దీని ప్రకారం ప్రజలు తమ నియోజక వర్గంలో జరిగిన అభివృద్ధి, శాంతిభద్రతల పరిస్థితి, లంచగొండితనం, ఉద్యోగావకాశాల మెరుగుదల వంటి కీలకాంశాల ఆధారంగా తామే ఎవర్నిఎన్నుకోవాలో నిర్ణయించుకుంటారు.

ఈ మార్పుల ద్వారా రాజకీయాల్ని పెడదారి పట్టించే చాలా దారులు మూసుకుపోతాయని ఆశిస్తున్నామని షామల్ దాస్ రంచోడ్ దాస్ చంచడ్, ఫున్ సుక్ వాంగ్ఢు ఆశాభావం వ్యక్తం చేసారు. పార్లమెంట్ సభ్యులంతా ఏకకంఠంతో సంతోషం వ్యక్తం చేసారు.

ఆకా…శ్శ్యవాణి వార్తలు మీరు వింటున్నారు.

ఇతర గ్రహాలలో మానవ జాతిని పోలిన బుద్ధిజీవుల అన్వేషణకై మన దేశం పంపిన అత్యాధునిక వ్యోమనౌక తొలి విజయం సాధించింది. నూరు శాతం మన గ్రహాన్ని పోలిన గ్రహాన్ని, దానిపై మన జాతిని పోలిన జాతిని వ్యోమనౌక గుర్తించింది. మక్కికి మక్కి మన భాష, సంస్కృతులు ఉన్న ఒక దేశాన్ని కూడా గుర్తించినట్టు వ్యోమనౌక నుంచి తాజా సమాచారం అందింది. మన గ్రహానికి దాదాపు ముప్ఫై కాంతి సంవత్సరాల దూరంలో మన మిల్కీ వే గాలక్సీలోనే ఉన్న ఒక మధ్య రకం నక్షత్రం చుట్టూ తిరిగే తొమ్మిది గ్రహాల్లో ఇది ఒకటని, కేంద్ర నక్షత్రం నుంచి మూడవ స్థానంలో ఈ గ్రహం 450 కోట్ల సంవత్సరాల నుంచీ ప్రదక్షిణలు చేస్తుందని సమాచారం. ఈ కొత్త సౌర కుటుంబంలోని మిగిలిన ఎనిమిది గ్రహాలపై ఎలాంటి జీవులు లేనట్టు వ్యోమనౌక ఇచ్చిన ప్రాధమిక సమాచారం.

ఆకా…శ్శ్యవాణి …వార్తలు…. ఇంతటితో .. సమా…ప్తమ్.

(ఒక అంచనా ప్రకారం కొన్ని బిలియన్ల ఎక్సో-ప్లానెట్స్ (భూమిని పోలినవి) విశ్వంలో ఉన్నాయట. More than 1800 exoplanets have been discovered (1849 planets in 1160 planetary systems including 471 multiple planetary systems as of 2 November 2014). ఇందులో కనీసం ఒక్క చోటైనా 100% భూమిలాంటి గ్రహం ఉండి, మనలాంటి మనుషులే ఉండి, మన దేశం కూడా ఉండి, అక్కడ రాజకీయాలు మాత్రం సత్తెకాలంవి అయ్యుంటే ఎలా ఉంటుంది అనే ఊహ ఈ కధకి బీజం)

When Mark Twain said,”There is no distinctly American criminal class – except Congress”, he was referring to American politics alone.Well, what would he say if he were around today?

వర్గాలునో.వా.చే.రా

YVR's అం'తరంగం'

These little thoughts are the rustle of leaves; they have their whisper of joy in my mind...

HI, _/\_ :-) THANK YOU FOR COMING THIS FAR IN THE POST ;-) I REALLY DO APPRECIATE PEOPLE WHO STIMULATE MY CREATIVITY & MAKE ME THINK ON A DEEPER LEVEL. YOUR RATING THIS POST HELPS. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

ఉహలు -ఊసులు

కవిత్వం, వంటా - వార్పు, మనసులో మాటలు, అక్కడ - ఇక్కడ

Kavana Sarma Kaburlu

All Rights Reserved

Prasad Oruganti

“I've learned that people will forget what you said, people will forget what you did, but people will never forget how you made them feel”— Maya Angelou

A Birder's Notebook

"Learning to bird is like getting a lifetime ticket to the theater of nature".

SEEN ALONG THE TRAIL

"I am at home among trees." -J.R.R. Tolkien

BUDGET BIRDERS

birding the world on a budget

Mike Powell

My journey through photography

Birder's Journey

"If you want to see birds, you must have birds in your heart." -- John Burroughs

Singapore Bird Group

The blog of the NSS Singapore Bird Group

MORGAN AWYONG

little truths . little deaths

Animals in South-East Asia

Andrew Jaehyun Rhee's Blog

Singapore Birds Project

Singapore birds information for birders by birders

Life is a poetry

Life is a beautiful journey. Live, feel, discover and fall in love with it

wHakAahUa

Do what you love and they'll love what you do

Why watch wildlife?

A site dedicated to watching wildlife

Discover

A daily selection of the best content published on WordPress, collected for you by humans who love to read.

Gangaraju Gunnam

What I love, and mostly, what I hate

చిత్రకవితా ప్రపంచం

🌊🌊🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊🌊🌊

సాహితీ నందనం

🌊🌊🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊🌊🌊

బోల్డన్ని కబుర్లు...

🌊🌊🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊🌊🌊

భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య

🌊🌊🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊🌊🌊

SAAHITYA ABHIMAANI

🌊🌊🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊🌊🌊

లోలకం

🌊🌊🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊🌊🌊

zilebi

Just another WordPress.com site

కష్టేఫలే

సర్వేజనాః సుఖినోభవంతు

%d bloggers like this: