అలలు, అలలు, అలలు,— ఓ కార్టూన్, అరచేత్తో సూర్యోదయాన్ని ఆపడం, etc, etc.


పై పెద్దమనిషిని సానుభూతితో అర్ధం చేసుకోండి, పాపం. గాంధీ , నెహ్రూల బాటలో నడుస్తున్నానని కూడా చెప్పారీయన. ఒక అనుమానం ఏమిటంటే, గాంధీ గారు 70 ఏళ్ల వయసులో చేసిన వివాదాస్పద ప్రయోగాలు, నెహ్రూ గారి పై వచ్చిన మనకంతగా నచ్చని కధలూ సీరియస్ గా తీసుకుని ఫాలో అయిపోతున్నాడా ఈయన? అని.

బ్లాగు తెరిచినంత తేలికా రాయడం ?

అల్లసాని వారి అల్లిక జిగి బిగి,

ముక్కుతిమ్మనార్యు ముద్దుపలుకు,

పాండురంగ విభుని పదగుంభనమును,

కాక, మాను రాయ నీకే తగురా

– అన్నట్టు ఏం వ్రాయాలో తెలీక దగ్గరలో మానులేంలేక కుర్చీకేసి , అదీ మామూలు కుర్చీ కాదు ఆఫీసు

కుర్చీ , వీపు రాసుకుంటూ ఇంతమంది ఇంత బాగా రాసేవాళ్ళుండగా నేనెందుకు ఇందులో దిగానా

అనుకుంటుండగా అంతలో అంతరాత్మ ప్రబోధం తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు అని. సరే ఎందుకు

చెప్తోందో అంతరాత్మ, ఎన్ని సినిమాల్లో ఎంతమంది చెడిపోలేదు , ఎన్ని అద్దాలు అనవసరంగా

పగిలిపోలేదు దీని మాట వినక అనుకుని, అదీ కాక బుర్రలో ఉన్నది ఎలాగో ఇసకే కనక తైలం తప్పక

వస్తుందనిపించి , ముందు ఏదైనా సబ్జెక్ట్ చూసుకుందామని ప్రయత్నం మొదలుపెట్టా. అన్ని సబ్జెక్ట్లూ

థీములూ – స్తోత్రాలూ సుభాషితాలతో మొదలై స్ట్రింగ్ థియరీ వరకూ కవర్ అయిపోయాయి. తిట్టే నోరూ

తిరిగే కాలూ లాగే రాసే పెన్నూ టైప్ చేసే వేళ్ళూ కూడా ఊరుకోవు కనక ఏదో ఒకటి, నోటికొచ్చిన వాగుడూ

చేతికొచ్చిన రాతలూ బ్లాగులో దింపేద్దాం అనుకుని ఇదిగో ఇలా ……. ఎందుకో టామ్ సాయర్ కధలో  ఓ అమాయకప్పిల్లికి  టామ్ తన దగ్గు మందు పోసే ఘట్టం మాటి మాటికీ గుర్తొచ్చింది. అసలే ఎలా రాయాలో ఎం రాయాలో

తెలియక ఏడుస్తుంటే ఈ పిల్లి శకునం ఏంట్రా అనుకోకుండా అదే సబ్జక్ట్ తీసుకు రాయడం మొదలెట్టా.  టామ్, పోలీ పెద్దమ్మ ఇచ్చిన మందు తను వేసుకోకుండా గోడ కున్న పగుళ్ళలో పోసేస్తూ ఉంటే పోలీ

పెద్దమ్మ పెంపుడు పిల్లి, పీటర్, అక్కడికొస్తుంది. ఒరిజినల్ చదవడంలోని మజా నేనెలా

అనువదించగలను? ఒరిజినలే చదవండి. ఒకసారి బాల్యంలోకి వెళ్ళొచ్చినట్టు కూడా ఉంటుంది.

– One day Tom was in the act of dosing the crack when his aunt’s yellow cat came along, purring, eying the teaspoon avariciously, and begging for a taste. Tom said: “Don’t ask for it unless you want it, Peter.” But Peter signified that he did want it. “You better make sure.” Peter was sure. “Now you’ve asked for it, and I’ll give it to you, because there ain’t anything mean about me; but if you find you don’t like it, you mustn’t blame anybody but your own self.” Peter was agreeable. So Tom pried his mouth open and poured down the Pain-killer. Peter sprang a couple of yards in the air, and then delivered a war-whoop and set off round and round the room, banging against furniture, upsetting flower-pots, and making general havoc. Next he rose on his hind feet and pranced around, in a frenzy of enjoyment, with his head over his shoulder and his voice proclaiming his unappeasable happiness. Then he went tearing around the house again spreading chaos and destruction in his path. Aunt Polly entered in time to see him throw a few double summersets, deliver a final mighty hurrah, and sail through the open window, carrying the rest of the flower-pots with him. The old lady stood petrified with astonishment, peering over her glasses; Tom lay on the floor expiring with laughter. “Tom, what on earth ails that cat?” “I don’t know, aunt,” gasped the boy. “Why, I never see anything like it. What did make him act so?” “Deed I don’t know, Aunt Polly; cats always act so when they’re having a good time.”

(మార్క్ ట్వైన్ ఒరిజినల్ కన్నా నండూరి రామ్మోహన్రావు గారి ట్రాన్స్ లేషన్ మరీ అందంగా ఉంటుంది, టరమ్స్ & కండిషన్స్ అప్లై. మనలో బాల్యం ఆవిరైపోకుండా ఉండాలి.)

ఇదెందుకు వ్రాయాలనిపించిందో అర్ధమైంది. అది తరువాత. సూర్యోదయం ఆపడం ఎలాగా తెలుసుకుందామని కనక ఈ పోస్ట్ చదువుతుంటే ముందుగా ఓ కమర్షియల్

బ్రేక్.  Buy one, get one free. అరచేత్తో సూర్యోదయం ఆపడం తో పాటు నా సొంత డబ్బా ఉచితం.

అసలు వీడెందుకు వ్రాయాలి, వ్రాసెను బో నేనెందుకు చదవాలి అనిపిస్తే ఈ క్రింది కారణాల వలన  –

పువ్వులెందుకు పూస్తాయో, సూరీడు వెలుగెందుకిస్తాడో,

నదులెందుకు ప్రవహిస్తాయో, అప్పారావు అప్పులెందుకు చేస్తాడో,

ఆర్ జీ వి ఈ మధ్య సినిమాలెందుకు తీస్తున్నాడో

చట్టం ఎందుకు ‘ఎంచక్కా’ తన పని తాను చేసుకుపోతూ ఉంటుందో

– అందుకే

( ఆర్ జీ వి అన్నాను కదాని ఆయనొక్కడే కాదు ఇంకా చాలామంది ఉంటారు ఆ కేటగిరీలో, ఆర్ జీ వి

అంటే ట్రెండీ గా ఉంటుందనీ …)

నీటిలో చేప నిశ్శబ్దంగా ఉంటె, గాల్లో ఎగిరే పక్షి పాట పాడుతుందిట, నేలపై తిరిగే జంతువు సందడి

చేస్తుందిట. మనిషిలో మూడూ ఉన్నాయిట. ఇది రవీంద్రనాధ్ ఠాగూర్ వాక్యం – STRAY BIRDS లో.

ఆయన నాయిస్ అన్నాడు. నాయిస్ పదానికి డిక్షనరీలో  ౘప్పుడు, శబ్దము, సందడి, ధ్వని, సద్దు,

confused sound, din, cry, outcry, clamour, uproar, hubbub, tumult, fuss, bustle ఇన్ని

అర్ధాలున్నాయి. జంతువుల్లో అనవసరంగా అరిచేవేమీ లేవు. జిమ్ కార్బెట్, కెనెత్ ఆండర్సన్ , డేవిడ్

అటెన్ బరో నడిగినా, వాళ్ళకున్న అనుభవజ్ఞానంలేని ఆర్డినరీ వైల్డ్ లైఫ్ లవర్నడిగినా చెప్పేస్తాడు

జంతువులకి అనవసర వాచాలత్వం లేదని. మరి విశ్వకవి జంతువులకెందుకు నాయిస్ అనే పదం

వాడాడు? నే చూసిన పుస్తకం లో టైపో ఎర్రర్ అయ్యుంటుంది , ప్రకృతిప్రేమికుడైన రవీంద్రుడు ఖచ్చితం గా

జంతువులకి గందరగోళం ఆపాదించడు అనిపించి దాన్ని సందడి అని ఫిక్స్ చేసేసుకున్నా. ఐతే ఈ

వాక్యంలో ఠాగూర్ దృష్టి మెయిన్ గా మనిషి మీదే కనక, మనిషికి నాయిస్ పదం కూడా పూర్తిగా

సరిపోదు కనక, అర్ధం చేసుకునేవాళ్ళు జంతువులకో అర్ధంలో, మనుషులకో అర్ధంలో నాయిస్ ని

అన్వయించుకుంటారనుకుని ఆయన ఆ పదం వేసి ఉంటాడు. మనిషి ఇన్ ఫ్రా సోనిక్ టు అల్ట్రా సోనిక్ త్రూ

టు ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ లన్నిటిలో చప్పుడు చెయ్యగలడు. వినేటప్పుడు మాత్రం ఇది వర్తించదు.

ఎదుటివాడి ఫ్రీక్వెన్సీ , వేవ్ లెంగ్తూ పట్టుకోలేకపోవడమే నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం

కావడానికి ఒకానొక ప్రధాన కారణం అంటే తప్పవుతుందా? అన్ని ఫ్రీక్వెన్సీలూ వినాలంటే చెవులు

పట్టుకెళ్ళి మనసుకి తగిలించాలి. మనసు మూగాడే కానీ బాసున్డది దానికి, చెవులుండే మనసుకే

ఇనిపిస్తుండా ఇది ….(ఆత్రేయ పాట, అక్కినేని నోట అనగానే ఈ ట్రాన్స్ లిటరేషన్ టూలుక్కూడా

కిక్కెక్కిందో ఏంటో) మనసు మూగదేగానీ బాసుండది దానికి, చెవులుండే మనసుకే ఇనిపిస్తుందా ఇది….

మనసుతో వినడం మొదలెట్టినప్పుడే మనిషికి పరిపక్వత వస్తుంది. ప్రపంచాన్ని సానుభూతితో అర్ధం

చేసుకోవడం అలావాటౌతుంది.  కవులకిలాంటివి అందరికంటే ముందుగా ఎలా తెలిసిపోతాయో ? అని

నాలాంటివాడు అనుకోకుండా ద్రష్ట అనే పేరు కూడా ఉందిట కవికి. కనబడకుండా వినిపించేవాడు కవి అని

వెలుగు నీడల్లో అక్కినేని నాగేశ్వరరావు డైలాగు. మరి ద్రష్ట ఎలా అయ్యాడూ అనుకుంటూ –

కనబడనిది కని

వినబడనిది విని

తడబడక వల్లించు

వాడుఇలను కవిరా, కుమతీ …..

అని నాకు నేనే ఎక్స్ ప్లనేషన్ ఇచ్చుకున్నాక అర్ధమయింది కవులు ద్రష్టలెలా అయ్యారో. ఏదైనా సరే ఎవరి

పుర్రెలో పుట్టిన బుద్ధి వాళ్లకి బాగా అర్ధం అవుతుంది. ద్రష్టగా సత్యాన్ని గుర్తిస్తే, కవిగా ఆ సత్యాన్ని

అందంగా, ఆవేశంగా, అందరి తరఫునా చెప్తాడు కవి. భావం ఉన్నా భాషలోకి మార్చలేక కష్టపడే నాలాంటి

వాడికి మౌత్ పీస్ కవి. సరే, ఠాగూర్ కవి, దేర్ ఫోర్, ద్రష్ట. నాయిస్ పదం వాడి  ఆయన నాలోని నాయిస్

వినిపించేందుకు లైసెన్స్ ఇచ్చాడనిపించి ఏదో నాకొచ్చింది రాసేస్తున్నా.  సరే, టామ్ సాయర్ పిల్లి కధ ఇక్కడెందుకు దూర్చానంటే, ఇందుకు –

But Peter signified that he did want it.

Peter was sure.

Peter was agreeable. కన్వీనియంట్ థింకింగ్ అనే దాన్ని ఈ మూడు ముక్కల్లో చూపించాడు రచయిత. చాలా మందిలో ఉండేదే.

చేస్తున్న పనిని ఏదో విధంగా జస్టిఫై చేసేసుకోవడం. అదే నాలోనూ ఉందండి. కానీ ఇప్పటివరకూ ఎవరి

మీదా ఉపయోగించలా. ఏదో ఒకటి రాయాలని పెన్ను, కాదు, కీ బోర్డ్ గొడవ మొదలెట్టేవరకూ.

అప్పట్నుంచీ కన్వీనియంట్ థింకింగూ మొదలైపోయింది. పై మూడు వాక్యాలూ నేను వాడుకున్న

విధంబెట్టిదనిన …

పొరపాటున నా రాతలు చదువుతున్నారు కదా అని  ఓ క్షణం పాటు టామ్ సాయర్

పిల్లితో పోలుస్తున్నట్టనిపిస్తే నేనేమీ చెయ్యలేను. నా ఉద్దేశం అది కాదు, నా సుత్తంతా వినడానికి

చతుస్సముద్రవేలావలయితమైన ఈ బ్లాగు దేశంలో ఎవరో ఒకరు ఉంటారనే జస్టిఫికేషన్ కోసం  మాత్రమె

వాడుకుంటున్నాను దీన్ని. అయినా ఇంకా అలాగే అనిపిస్తే దయచేసి చదవడం మానెయ్యండి. మనం రాసేవి

చూసి ఎవరో ఒకరు ఏదో ఒకటి అనుకుని అది పైక్కూడా అనేస్తే ఎలా అనే భయం లేకుండా ఈ టామ్

సాయర్ – పిల్లి ఎపిసోడ్ మంచి ధైర్యాన్నిస్తుంది. ఇంతోడి చెత్త రైటింగ్ కి  టామ్ సాయర్నుంచి ఠాగూర్  వరకూ వత్తాసు తెచ్చుకోవాలా అని మీకనిపిస్తే మీరే రైటు. మీ చేతిలోనే ఉంది వోటు.

వోటు అంటే గుర్తొచ్చింది. అరిచేత్తో సూర్యోదయం ఆపడం ఎలాగో చెప్తాను. నిజానికి నేను కాదు చెప్పేది.

మెగాస్టార్. చెప్పడం కాదు చేసి చూపించారు. ప్రజారాజ్యం సూర్యుణ్ణి కాంగ్రెస్ హస్తం తో మూసేసినప్పుడే ఈ

వామపక్ష భావజాల మహావాక్యం తప్పని తేలిపొయింది. ప్రపంచాన్ని నడిపేది ఆదర్శాలు, ఇజాలు కాదు

మనుషుల అవసరాలు, అహంభావజాలు(అహం అనే భావం నుంచి పుట్టిన ఇజాలు అని

కవిహృదయము)  అని చరిత్ర చాలాసార్లు నిరూపించింది. అదే సత్యానికి విలీనం ద్వారా ఒక జాతీయ పార్టీ

ఒక ప్రాంతీయ పార్టీ కలిసి సింబాలిక్ గా పునరంకితం అయ్యారు. ఎవరైనా ప్రరాపా ద్వారా రాజకీయాల్లో

పెనుమార్పు వచ్చేస్తుందని నమ్మి ఉంటే వాళ్లకి సున్నితంగా చరిత్రగతిని సూచించడం అన్నమాట ఇది.

విలీనం చెయ్యాలని నిర్ణయించడం ద్వారా మెగాస్టార్ కే  ఈ క్రెడిట్ పూర్తిగా దక్కాలి. ప్రజలు చరిత్ర

మర్చిపోకుండా ఓ పార్టీని పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలనీ త్యాగం చేసి మరీ ఓ సందేశాన్నిచ్చినందుకు.

ఇండియా పార్టిషన్, గాంధీజీ హత్య, కమ్యూనిస్ట్ సిద్ధాంత వైఫల్యం, పార్లమెంటులో నేర చరిత్రుల బిల్లు

పాసవ్వకపోవడం, అన్నహజారే ఉద్యమంపై రాజకీయ బురద జల్లుడు … ఇవన్నీ ఏం చెబుతున్నాయి ? దేశమంటే

మట్టి కాదోయ్, … వెయిట్, ప్రపంచమంటే మట్టికాదోయ్, ప్రపంచమంటే మనుషులోయ్ అని. (గ్లోబలైజ్

అయిపోతున్నాంకదా.) మనుషులు ఎలా వుంటే వాళ్ళ పాలకులు, నాయకులు, జీవితాలు , ఎట్సెట్రా,

ఎట్సెట్రా ..అలా ఉంటాయనే కదా. మనని మనమే తిట్టుకోవడం, మనని మనమే మార్చుకోవడం అత్యంత

అవసరమని అరిచేత్తో సూర్యోదయాన్ని ఆపడం అనే ఫినామినన్ మనకి చెబుతోంది. గాంధీ తాత

గారేమన్నారు ? బీ ద ఛేంజ్ దట్ యూ వాంట్ టు సీ ఇన్ అదర్స్ అని కదా. ఆయన తను పాటిస్తూ

అందరికీ చెప్పారు డైరెక్ట్ గా. మన రాజకీయాలు, నాయకులు అదే విషయాన్ని  ఇన్ డైరెక్ట్ గా

చెప్తాయి(రు). వియ్ హావ్ టు రీడ్ బిట్వీన్ ద లైన్స్. అందువల్ల నాయకులు సరిగా లేరు అని

బాధపడకుండా మనమే మారాలి. వ్యవస్థ ఏదైనా, విశ్వాసం ఏదైనా వాటిని నిలబెట్టాల్సింది వాటిని

నిర్మించుకున్న మనమే, మన గుణగణాలే. సంఘ స్థాయిలో మనలో పేరుకుపోయిన ఆవాంఛనీయ

లక్షణాలే మెజారిటీ పాలిటిక్స్ రూపంలో మనకి నాయకులని అందిస్తాయి. ఒక్క రాజకీయమే కాదు, అన్ని

రంగాల్లోనూ ఇది ఇంతే. విలీన రూపంలో ఇంత గొప్ప సందేశం ఇచ్చినా ‘జల్సా’ సినిమాలో పవన్ కళ్యాణ్

చేసిన కాంగ్రెస్ నాయకుడి సీను అనుకోకుండా చిరంజీవి చెయ్యాల్సివస్తోందే అని కొంచెం బాధగానే

ఉంటుంది. కానీ ఎవరేం చెయ్యగలరు? కుచ్ పానే కే లియే ఔర్ కుచ్ ఖోనా హై.

చిరంజీవి పరిస్థితిలా ఉంటే, రాజకీయాల్లోకి దూకుతానని మాటి మాటికీ బాలకృష్ణ వార్నింగులు. వచ్చేదేదో సీరియస్ గా సీనియర్

ఎన్టీయార్ లా అదే ఉత్సాహంతో, అదే ఆత్మవిశ్వాసంతో వస్తే బావుండు. లవకుశ లో నిత్యానందుడు కోపం

వచ్చేస్తోందీ, శాపం పెట్టేస్తానూ అంటూ బెదిరిస్తాడు అలా చేస్తే జనాలకి నిత్యానందుడు గుర్తోచ్చేస్తే వోట్లు

రాలడం కష్టం కదా. కమిటవ్వకుండా తొడలు కొట్టినా, మీసాలు తిప్పినా అవి కొత్త వోట్లు తేవు, ఇతర

పార్టీల వోట్లు చీల్చవు. ఎవరేం మంచి చేస్తారు ప్రజలకి అనేది పక్కనపెట్టి కనీసం ఓ బలమైన

ప్రత్యామ్నాయ పార్టీగా తెలుగు దేశానికి పూర్వ వైభవం తెస్తే బావుండు. బాలకృష్ణకి వోట్లు తెచ్చే టెక్నిక్

తెలియకపోవచ్చు. మరి చంద్రబాబుకీ తెలియదా?ఇప్పుడే అందిన వార్త అన్నా హజారే నిరాహార దీక్షకి

మంచి స్పందన వస్తోందిట. మంచి వార్త. ప్రజల్లో ఉన్న కసి తెలుస్తోంది. ఐతే, జన లోక్ పాల్ అనుకున్న

లక్ష్యం సాధీంచగలదా?ఇప్పటికే ఉన్న ఫోర్ ఎస్టేట్స్ తో పాటు ఫిఫ్త్ ఎస్టేట్ అయ్యి కొన్నాళ్ళకి వాటిలాగే

ఇనెఫెక్టివ్ అయి కూచుంటుందా? చెప్పలేము. ఎవరూ నన్నడగరు కానీ అడక్కపోయినా చెప్పగల

స్వాతంత్ర్యం బ్లాగ్దేవత ప్రసాదించింది కనక చెప్తున్నా. లోక్ పాల్ రావడం పక్కనుంచి, అన్నా టీమ్

రాజకీయాలపై ప్రజల ఫోకస్ తగ్గకుండా కులమతప్రాంతాలకతీతంగా సామాన్యుడి అవసరాలని, కష్టాలనీ

దృష్టిలో ఉంచుకుని పనిచేసే ఒక శాశ్వత ఫోరం టీమ్ అన్నా ఏర్పాటు చేసి అన్ని సమస్యల మీద బహిరంగ

చర్చ నిరంతరం జరిగేలా చూస్తే ప్రజలు సంఘటితం కావడానికి ఒక కేంద్రం ఉంటుంది. ఉద్యమాలూ , వాటి

నాయకులూ ఆవిర్భవించేవరకూ అవినీతి, అరాచకం తమ పని తాము చేసుకు పోతూ ఉంటాయి.

చట్టాల్లాగే. వీటికి వ్యతిరేకంగా ప్రజలు సంఘటితం కావాలంటే ఎంతో ప్రాసెస్ జరగాలి. అది జరిగి ఉద్యమం

మొదలయ్యాక రాజకీయ బురద జల్లుడు మొదలౌతుంది. అది తట్టుకుని మళ్ళీ కూడదీసుకోవడంలో

చాలా ఆలస్యం జరుగుతుంది. శాశ్వత ఫోరం ఉంటే అవసరమైనప్పుడు ప్రజలు దానివైపు తిరుగుతారు.

కాకపొతే ఫోరం లోకి కోవర్ట్ లు, కుహనాలు రాకుండా టీమ్ జాగ్రత్త పడాలి. ఎప్పటికప్పుడు టీమ్ లీడర్స్ ని

తయారు చేస్తూ ఉండాలి. ఆది శంకరుడు దేశం నాలుగు దిక్కులా నాలుగు అద్వైత పీఠాలు స్థాపించినట్టు

అన్నా కూడా ప్రజాస్వామ్య పీఠాలు ఏర్పాటు చేస్తే?   ఇన్ని రాసి జగన్ గురించి రాయకపోతే ఎలా ? జగన్ని చూస్తుంటే మలేషియాలో ప్రతిపక్ష నాయకుడు

అన్వర్ ఇబ్రహీం కధతో పోలికలున్నాయా అనిపిస్తోంది. అతన్ని, అన్వర్ ఇబ్రహీం, తొంభై ఎనిమిది నుంచీ రకరకాల కేసుల్లో

ఇరికించి ఎన్నికల్లో పాల్గోకుండా చూస్తోంది అధికార పక్షం. ఒక్క కేసూ ప్రూవ్ అవ్వదు కానీ ఇతను

అధికారం లోకి వచ్చే అవకాశం ఉండదు. మలేషియా ఎన్నికల నియమాలు అలా ఉన్నాయి. నిజానికి

అలా తయారు చేసారు. పోలికలు అంతవరకే. జగన్ కేసు పూర్తిగా అలా ఉండే అవకాశం తక్కువ. అంతా

2014 ఎన్నికల సమీకరణాలను బట్టీ ఉంటుంది. కణికుడి రాజనీతి అవలంబించిన మనరాజకీయాల్లో

శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు, పనిలో పనిగా దేశానికి సరైన నాయకులూ ఉండరుకదా. ఇంకా

రాజకీయాలు చాలు. ఇప్పుడు భారతంనుంచి ఒక కధ. ఇంద్రాది దేవతలు తమ కంటే శక్తివంతులు గర్విస్తూ ఉంటే పరమాత్మ వాళ్ళమధ్య

ఒక గడ్డి పరక పడేసి దానిపై వారి శక్తుల్ని చూపమంటాడు. ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఏమీ

చెయ్యలేకపోతాడు. అగ్ని కాల్చలేడు, వాయువు కదపలేడు. మిగతా దేవతల శక్తియుక్తులు గడ్డిపరకపై

పని చేయక వాళ్ళు పరమాత్మకి తలవంచుతారు. ఈ కధ ఉదాహరించటానికి కారణం ఈ మధ్య

వార్తల్లోకెక్కిన దైవ కణం. ఈ దైవ కణం గురించి మొదటిగా తెలిసాక (పూర్తిగా కాదు) ఫైనల్ గా సైంటిస్టులు

సృష్టి రహస్యం కనిపెట్టేస్తారేమో, ఇంక దేవుడి పీఠం కూడా కదిలిపోతుందేమో అని కొంచెం బాధగా ఉండేది.

దైవకణం గురించి పూర్తిగా తెలియదు కదా మరి. అప్పుడు పైన చెప్పిన కధ గుర్తొచ్చేది. సైంటిస్టులు దైవ

కణం కనుక్కున్నట్టు, అందులోంచి దేవుడు వీళ్ళకి ఏవో పరీక్షలు పెట్టి పై దేవతల కన్నా దారుణంగా వీళ్ళ

గర్వభంగం చేసేసినట్టు, వీళ్ళందరూ లాబోరేటరీలు వదిలి అరణ్యాల దారి పట్టినట్టు ఏవేవో ఊహించేవాణ్ణి.

తీరా దైవ కణం పేరు ఎలా వచ్చిందో ఈ మధ్య తెలిసాక దేవుడి భవిష్యత్తుకి, సైంటిస్టుల భవిష్యత్తుకి ఏ ఢోకా

లేదని తెలిసిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్,  దైవకణం అనే పేరు వెనక దైవవిశ్వాసం నేతిబీరకాయలో నెయ్యి కన్నా కొంచెం తక్కువుంది. దీనికోసం

వెతికిన మొదటి సైంటిస్టుల్లో ఒకడైన Leon Lederman దీన్ని Goddamned Particle అని

రాద్దామనుకున్నాడట ఏదో సైన్స్ పత్రికలో, కానీ ఎడిటర్ ఒప్పుకోక గాడ్ పార్టికిల్ అని సెటిల్ అయ్యాడట.

Goddamned అనేది ఆస్తికుల్ని నొప్పించే పదం. వాడకంలో దీన్ని నిస్సహాయ స్థితిని సూచించటానికి

వాడతారు. హిగ్స్- బోసాన్ ఆచూకీ దొరక్క ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు Leon Lederman ఈ పదం

వాడాడు. తన పేరు పెట్టుకున్న కణం గురించి మాట్లాడుతూ హిగ్స్ అన్నాడు అసలు దైవ కణం అనే మాట

వాడడం కూడా తనకిష్టం లేదని. తను ఆస్తికుడు కాకపోయినా నమ్మకం ఉన్నవాళ్ళు దేవుణ్ణి ఒక చిన్న

కణంలో బంధించడాన్ని మెచ్చరని అతని భయం. భయపడడా మరి? భూమి, సూర్యుడి చుట్టూ తిరుగుతుందన్నందుకు కోపర్నికస్ కి పట్టిన గతి తెలిసినవాడు, ఆ ప్రాంతాల్లోనే పుట్టి పెరిగాడు.
పరమాత్మా, పరమాణురూప, శ్రీ తిరువేంకటగిరి దేవా .. అంటూ భారతీయులు అంతటా దివ్య చైతన్యాన్ని చూడగలరని, ఇప్పటికీ చూస్తున్నారనీ ఆయనకేం తెలుసు పాపం.  అసలు దైవ కణం దొరకగానే దేవుడి రహస్యం అంతా

మనుషులకి తెలిసిపోతుందనే భయం ఆధార రహితం అని కొంచెం లేటుగా అర్ధంచేసుకున్నాను. మన

ఋషులు మానసిక పవిత్రతతో చేసిన సాధనలో దేవుణ్ణి దర్శించారు. భౌతిక శాస్త్ర పరిశోధనలో ఆ దేవుడు

కనబడడం అసాధ్యం. దేవుడిచ్చిన మనసుతోనే పరిశోధన చేస్తూ, ఆ మనసులోనే దేవుణ్ణి చూడగలం, అలాగే ఆయన్ని చూడాలి

అన్న విషయం వీళ్ళకి తెలియదు,  ఇప్పుడే తట్టదు. మనసుని తప్ప అన్నిటినీ కంట్రోల్ చేయ్యాలనుకునేది ఇప్పటి

మానవ జాతి. విష్ణువుని వెతుకుతూ వైకుంఠానికి వెళ్లి అయన కనబడక తనకి భయపడి

పారిపోయాడనుకున్న హిరణ్యకశిపుడి అజ్ఞానం, దైవ కణం దొరగ్గానే సృష్టి రహస్యం తెలిసిపోయిందనుకుని

చంకలు గుద్దుకునే వాళ్ళ విజ్ఞానం దాదాపు ఒకటే. సృష్టి రహస్యాలు చివరికంటా కనుక్కున్నా (మనుకున్నా) భౌతిక దృష్టితో చూసేవాళ్ళకి కనపడేది విష్ణువు లేని వైకుంఠమే. మనిషిని రక్షించే దేవుణ్ణి చూడాలంటే, అణువుల్లో కాదు, ఋషిహృదయాల్లోనే వెతుక్కోవాలి.పాపం సైంటిస్ట్ లని  ఏమీ అనట్లేదు. వాళ్ళు చాలా

వరకూ న్యూట్రల్ ఈ విషయంలో. ప్రపంచ వ్యాప్తంగా సైంటిస్ట్ లలో 50% దేవుణ్ణి నమ్ముతారట. ఎప్పుడో

బి.బి.సి వెబ్ సైట్ లో చదివిన గుర్తు. అలాగే సైంటిస్ట్ లకి ఒక మంచి గుణం ఉంది. ఏ థియరీ కూడా ‘ గిది

ఫైనల్’ అని చెప్పరు వాళ్ళు.  ఎప్పటికప్పుడు సిద్ధాంతాలని సవరించుకోడానికి సిద్ధంగా ఉంటారు. ఆ

విషయంలో  మత విశ్వాసాల కన్నా సైన్స్ సిద్ధాంతాలే నయం. మనిషిని మభ్య పెట్టవు. డాగ్మా వుండదు.

ఐతే, ఆధ్యాత్మికతా ఉండదు. మానవత్వానికి లాభం తక్కువ. అదే దాంతో వచ్చిన సమస్య. ఆధ్యాత్మికతని

డాగ్మాటిక్ పద్ధతిలో అనుసరించమంటుంది మతం. అదే దాంతో వచ్చిన చిక్కు. మనసు దాహం

తీరనివ్వదు. రెండూ కాని మధ్యే మార్గం ఉంటుంది. రెండిటినీ సరైన పాళ్ళలో ఉపయోగించుకునేది.

అలాంటి పధ్ధతి దైవ కణం తో పరోక్ష సంబంధం ఉన్న ఒకాయన, హిగ్స్-బోసాన్ అనే పేరులో బోసాన్ కి

తన నామధేయాన్ని అరువిచ్చిన శ్రీ ఎస్. ఎన్. బోస్ జీవన విధానం లో కనబడుతుంది. ఈయన కనిపెట్టిన

లెక్కల ప్రకారం ప్రవర్తించే కణాల జాతికి చెందుతుంది దైవ కణం. ఈయనది ఋషి లాంటి వ్యక్తిత్వం.

ప్రచారానికి దూరం. అసలు సైన్స్ లో తన ప్రజ్ఞనీ , నైపుణ్యాన్నీ కూడా బయట పెట్టుకోలేనంత

నిరాడంబరత్వం. మరో సైన్స్ ఋషి, ఐన్ స్టీన్ వల్ల ఈయన ప్రతిభ వెలుగులోకొచ్చింది. ఐన్ స్టీన్ కి ఈయన

వ్రాసిన లెటర్ చూస్తేనే ఎంత వినయవంతుడు అనిపిస్తుంది. ఫ్రెంచి భాష చక్కగా మాట్లాడ గలిగీ మేరీ క్యూరీ

కి ఆ విషయం చెప్పలేకపోయిన మొహమాటస్తుడు. ఆవిడేమో, ఈ విషయం తెలియక, ఫ్రాన్స్ లో ఎక్కువ

కాలం ఉండి ఫ్రెంచి నేర్చుకుంటే తన దగ్గర రీసెర్చ్ చెయ్యొచ్చని చెప్పిందట. ఐతే మొహమాటం,

నిరాడంబరత్వం, యూరోపియన్స్ అంటే భయం (అని కొందరన్నారు) కాదు, ఆయనలో ఉన్నది

ఋషిత్వమే అనిపిస్తుంది. ప్రాచీన ఋషులు గొప్ప వైజ్ఞానికులని కొందరికి అనుమానం, కొందరికి

అభిప్రాయం, కొందరికి విశ్వాసం. ఎవరైనా రైటు కావచ్చు. నమ్మనివాళ్ళది మాత్రం ఒకటే ప్రశ్న. అంత

విజ్ఞానం ఉన్నప్పుడు మానవాళి అభివృద్ధికి ఎందుకు వాడలేదు, అలా రహస్యంగా ఎందుకు వుంచేసారు

అని. ఋషులు మనిషి మనసుని ఆధునికులేవరూ చూడనంత లోతుగా అధ్యయనం చేసారు. వాళ్లకి

తెలుసు ఎప్పుడో ఒక ఏ.క్యూ. ఖాన్ ఆవిర్భవిస్తాడని, వాణ్ణి కాపాడే పాకిస్తాన్ లు, వాడి మార్కెట్ గా నార్త్

కొరియాలు, ఇరాన్ లు ఎప్పుడూ ఉంటాయని. అంతే కాదు, ఇలాంటివాళ్ళని సృష్టించి,

రాజకీయావసరాలకి వాడుకుని , తరువాత శ్రీరంగనీతులు చెప్పే దేశాలూ ఉంటాయని.   మహాభారతంలో కొన్ని విషయాలు మోడరన్ సైన్స్ కి అతి దగ్గరగా ఉంటాయి. నిజంగా అప్పుడు ఇంత

టెక్నాలజీ ఉందేమో అనిపించేంత. ఉందని నమ్మేవాళ్ళు ఒంటికాలి మీద లేస్తే నేనేం చెయ్యలేను. Maybe,

ఉందేమో కూడా అనుకుని, అదే మాట పైకీ అనేస్తాను. జూల్స్ వెర్న్, హెచ్. జి. వెల్స్ లు తమ రచనల్లో

తమ కాలంలో ఊహించరాని ఎన్నో  ఫ్యూచరిస్టిక్ విషయాలు వ్రాసారు. సబ్ మెరైన్, స్పేస్ ట్రావెల్ లాంటివి.

మరి వ్యాసుడు టెస్ట్ ట్యూబ్ బేబీలు, ఆర్టిఫిషియల్ ఇన్ సెమినేషన్, క్లోనింగ్ … అన్నీ వ్రాసేసాడు. ఒకవేళ

ఇవన్నీ అప్పుడే తెలిసి ఉన్నా మనవాళ్ళు ఎందుకు అలా వదిలేసారు అంటే సమాధానం ఎస్. ఎన్. బోస్,

జే.సి. బోస్ వంటి వాళ్ళని చూస్తె అర్ధం అవుతుంది. సత్యాన్వేషణలో ఉన్న ఆసక్తి మనవాళ్లకి, ఐ మీన్

మన మొదటి తరం సైంటిస్ట్లకి, దాన్ని భౌతిక ప్రయోజనాలకి వాడుకోవటంపై ఉండదు. అలా చెయ్యడం

ఎలాంటి దుష్పరిణామాలకి దారి తీస్తుందో వీళ్ళ జీన్స్ కి తెలుసు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ కన్నా క్వాలిటీ ఆఫ్

మాన్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తే లైఫ్ క్వాలిటీ దానంతట అదే పెరుగుతుంది. కదా?

ఆంధ్రా హనుమాన్

ఇటీవల మీడియా అంతా హనుమంతుడంటే దారాసింగే గుర్తొస్తాడని రాస్తుంటే తెలుగు చిత్రాల హనుమంతుడు అర్జా

జనార్దన రావు జ్ఞప్తికొచ్చారు. 1926 లో పుట్టి 2007 లో గతించిన అర్జా తెలుగులో హనుమంతుడు

ప్రముఖంగా కనబడే చిత్రాలన్నిటిలో నటించారు. వీరాంజనేయ, సంపూర్ణ రామాయణం, రామాంజనేయ

యుద్ధం, ముత్యాలముగ్గు మొదలైన సినిమాల్లో ఆయన హనుమంతుడి దాస్య భక్తిని, వీరత్వాన్ని చక్కగా

బాలన్స్ చేసి నటించారు. నిజానికి హనుమంతుడి బాడీ లాంగ్వేజ్ దారాసింగ్ కన్నా అర్జా అద్భుతంగా

పట్టుకున్నట్టు హనుమ రామభక్తి తెలిసిన వాళ్ళందరికీ తెలిసిపోతుంది. సంపూర్ణ రామాయణంలో ఫుల్

లెంగ్త్ పాత్రలో జీవించిన ఆయన రామాంజనేయ యుద్ధంలో హనుమంతుడిగా కళ్ళనీళ్ళు తెప్పిస్తారు.

ముత్యాలముగ్గులో హనుమ అమాయకత్వాన్నీ అద్భుతంగా నటించారు. విలన్ని చంపుదామని గద

ఎత్తుతుంటే వాడు ఏదో మాట్లాడుతూ రామ రామ అంటాడు. అంతే, హనుమ గద దించి వెళ్ళిపోతాడు.

ఆయన భక్తురాలైన పాప ఏమిటి స్వామీ వాణ్ని వదిలేసావ్? అంటుంది. వాడు రామ నామం

జపిస్తున్నాడమ్మా అని ఈయన అమాయకంగా సమాధానం చెబుతాడు. ఈ పాత్రలో దారాసింగ్ ఎలా

చేసేవారో కానీ అర్జా మాత్రం లా జవాబ్. ఈయన వివరాలకోసం IMDB, తెలుగు వికీ లో చూస్తె కొద్దిగానే

ఉన్నాయి.

1 thought on “అలలు, అలలు, అలలు,— ఓ కార్టూన్, అరచేత్తో సూర్యోదయాన్ని ఆపడం, etc, etc.

  1. తృష్ణ

    బావుందండి మీ బ్లాగ్. టామ్ సాయర్ నాకత్యంత ఇష్టమైన పుస్తకాల్లో ఒకటి. అదీ తెలుగు అనువాదం! తరచూ రాస్తూండండి..

    Like

    Reply

Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s