ప్రతి మనిషి కి 1008 ఛాన్సులు -1


1

ఐ యామ్ ష్యూర్ దిస్ ఈజ్ ఎనదర్ రీ-ఇన్వెన్షన్ ఆఫ్ వీల్. అయినా ఎవరో ఒకరికి ఇది పనికి రావచ్చు. ఇవాళ నా పుర్రెలో ఒక బుద్ధి పుట్టింది. ఇది పూర్వీకులు ఎప్పుడో చెప్పినదే అయిఉంటుంది. చాలా మంది చేస్తున్నదే కూడా అయి ఉంటుందనడంలో ఏ సందేహం లేదు. అయినా మనిషికి స్వయంగా అర్ధం చేసుకున్న విషయం పట్ల ఉన్న నిబద్ధత ఇతరులు చెప్పినదాంట్లో ఉండదు. ముఖ్యంగా చెప్పిన విషయం మనిషి తాత్విక, వైజ్ఞానిక తృష్ణను తీర్చే విధంగా లేకపోతె. భగవంతుడా నేను చేసే ప్రతి ఆలోచనలో, పనిలో, ఆడే మాటలో మంచి తక్కువయ్యేందుకు లేదా చెడు పెరిగేందుకు కనీసం 1008 చాన్సులు ఉన్నాయని గ్రహించాను. అవి నిజమవకుండా చూడు అని సంకల్పం చెప్పుకుని ప్రతి మనిషి ప్రతిరోజూ 1008 సార్లు దైవనామం (హిందువులయితే గాయత్రి మంత్రాన్ని, నాస్తికులయితే మంచి ఆదర్శాలని) జపించాలని ఇవాళ నేను కన్విన్స్ అయ్యాను. ప్రపంచంలో సాత్వికత తగ్గుతోందని నమ్మే చాల మందిలో నేనూ ఒకణ్ణి కావడంతో ఈ స్థితికి నాకు తోచిన రీతిలో కారణాలు వెతుకుతూ ఉంటాను. సరే మన ఫిలాసఫీలో త్రిగుణాలకి చాలా ప్రాముఖ్యత ఉంది. వాటి ఆధారంగా ఆలోచిస్తే అని మొదలెడితే నా ఆలోచనా తరంగం ఇలా సాగింది. ఇక్కడున్నదంతా చాలా రఫ్ గా , మిడి మిడి జ్ఞానం తో వేసిన లెక్క. కాకపొతే ఒక అంచనాగా ఇది కరేక్టేననిపించి, దేవుడిపై నమ్మకం తో సంబంధం లేకుండా కూడా ఇక్కడ తీసుకున్న విషయాలన్నీ అందరికీ వర్తించేవీ, నిజంగా ఉన్నవీ అనిపించి పోస్ట్ చేసేస్తున్నా.

మనిషిలో మూడు గుణాలు సమతూకం గా ఉండాలి. సత్త్వ రజస్తమో గుణాలు. సాధారణంగా ఇవి 1:1:1 నిష్పత్తిలో ఉండడం అరుదు. ఏదో ఒకటి డామినేట్ చేస్తూ ఉంటుంది. తినే తిండి, చుట్టూ ఉన్న భౌతిక, సాంఘిక వాతావరణం,జీన్స్, చదువు, … ఇలా ఎన్నో ఫాక్టర్స్ ఉంటాయి త్రిగుణాలని హెచ్చుతగ్గులకి గురి చేస్తూ. ఇప్పుడున్న జీవన విధానం లో ఏ గుణం ఎప్పుడు ప్రకోపిస్తుందో చెప్పడం కష్టం. సో, ఏ క్షణంలో చూసినా ఇక్కడ ఇచ్చిన పది కాంబినేషన్లలో ఒకటి ఆపరేషన్ లో ఉంటుంది –

1) సత్త్వ సత్త్వ సత్త్వ 2)సత్త్వ సత్త్వ రజ 3) సత్త్వ సత్త్వ తమ 4) సత్త్వ రజ రజ 5) సత్త్వ రజ తమ 6)సత్త్వ తమ తమ

7)రజ రజ రజ 8)రజ రజ తమ 9) రజ తమ తమ 10)తమ తమ తమ

ఏ గుణం డామినేషన్ లో ఉంటె దాని కలర్ మనం చేసే ఆలోచనల్లో,పనుల్లో, మాటల్లో ప్రతిఫలిస్తుంది.

మనిషి జంతు స్థాయి దాటిపోయినా ఆహార నిద్రా భయ మైధునాలనే నాలుగు ప్రకృతిసిద్ధమైన అవసరాలు తప్పించుకోలేడు. వీటికి తోడుగా self-esteem , తత్త్వ చింతన అనేవి మనిషికి అదనంగా ఉండే అవసరాలు. మొత్తం ఆరు. ప్రపంచ వ్యవహారమంతా ఈ అవసరాలు తీర్చుకోవడమనే ప్రక్రియ వల్లనే వ్యక్తం అవుతుంది. పైన చెప్పిన గుణాల ప్రాబల్యాన్ని బట్టీ అవసరాలు తీర్చుకునే పద్ధతులుంటాయి. సత్త్వం డామినేటింగ్ గుణంగా ఉన్న మనిషి జీవన విధానం నొప్పింపక తానొవ్వక అన్నట్టు ఉంటె రజో గుణ ప్రధానుడి పనులన్నీ స్వలాభం, స్వార్ధం ప్రాతిపదికలుగా ఉంటాయి. ఇక తమో గుణం అధికమైనవాడికి అవసరం తీరాలనే తరిమే కోరిక తప్ప ఆలోచన, విచక్షణ ఉండవు. ఇప్పుడు పది రకాల గుణ సంసర్గాలు ఆరు ప్రాధమిక అవసరాల నెరవేర్పులో పనిచేస్తే 10 x 6 = 60 విధాలలో అది జరుగుతుంది.

గుణ సంసర్గాలు, ప్రాధమిక అవసరాలు పుట్టుకతోనే సంక్రమిస్తాయి. అవి మనిషిలో ఏ దశలో , ఏ దిశలో పనిచేస్తున్నాయనే దాన్ని బట్టీ వాడిలో ఎనిమిది ఉద్వేగాలు ఉంటాయి. అవి కామ , క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, అహంకార (self -centeredness), మమకారాలు. చుట్టూ ఉన్న పరిస్థితుల్ని బట్టీ ఇవి పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. సాధారణంగా పెరగడమే ఎక్కువ. దైనందిన వ్యవహారాలు 60 విధాల జరిగే అవకాశం ఉండగా వాటిపై ఈ 8 ఉద్వేగాల ప్రభావం ఉంటుంది కనక 60×8 = 480 విధాల ఫలితాలు లేదా పరిణామాలు లేదా పర్యవసానాలు ఉండే అవకాశం ఉంది. ఈ లెక్కని ఇంకా విస్తరించవచ్చు మూడు కాలాలని కూడా చేరిస్తే. త్రిసంధ్యలు అనబడే మూడు రకాల కాలాలో ఒకో దానిలో ఒకో గుణానికి బలం ఎక్కువుంటుందని శాస్త్రం. 480×3 =1440 విధాల ఫలితాలు ఒక్క వ్యక్తి విషయంలో సంభవించే అవకాశం ఉందా ?అఫ్ కోర్స్, ఇదంతా ప్రాబబిలిటీ లెక్కలాంటిదే. అయితే ఇన్ని విధాల ఫలితాల్లో ఏదో ఒకటి రావచ్చు అని ఊహిస్తే మనిషి తప్పు చెయ్యకుండా జాగ్రత్తపడే చాన్సు కూడా పెరుగుతుంది కదా. సత్త్వ గుణం డామినేషన్ లో ఉండే మూడు కాంబినేషన్లు చాలా మటుకు సేఫ్ అనుకోవచ్చు. అందువల్ల ఆ మూడూ తీసేసి చూస్తే చెడు లేదా అవాంఛనీయ ఫలితాలు 7 గుణ సంసర్గాల వల్ల కలుగుతాయి. అవాంచనీయ అంటే నా ఉద్దేశ్యం మొత్తం మీద ప్రపంచంలో సాత్వికత ని తగ్గించే అని. సో, 7x6x8x3 = 1008 అవకాశాలు ప్రపంచంలో సాత్వికతని తగ్గించేందుకు ఒకో మనిషికి అందుబాటులో ఉంటాయి. ప్రపంచంలో ఏడు బిలియన్ల మంది ఉన్నారు. అంటే? లక్కీగా అందరూ నిర్ణయాత్మక , క్రియాశీలక స్థానాల్లో ఉండరు కనక సరిపోయింది, లేకపోతె ఇంకేమన్నా ఉందా ? అలాగే మెజారిటీ ఇంకా చిన్నపిల్లలు. చాల మంది వృద్ధులు , ఇనాక్టివ్ గా ఉన్నవాళ్ళు, స్వతంత్రం గా వ్యవహరించే అవకాశం లేనివాళ్ళు. ఆ పైన లా అండ్ ఆర్డర్ వ్యవస్థ. అంతేకాక జనరల్ గా మనుషుల్లోనే సత్త్వ గుణం కొద్ది మాత్రం ఎక్కువ గా పనిచేస్తోందో లేక తమో గుణం ఎక్కువై పడుకుంటున్నారో ప్రపంచం ఇంకా ఇలా ఉంది. పరిస్థితి మారవచ్చుగా. రజో గుణం విజృంభిస్తోంది. ఎప్పుడూ మంచే గెలుస్తుందని ఎంత ఎలుగెత్తి చాటినా అది గెలిచే ముందు చెడు చెలరేగుతుందిగా. అందువల్ల ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్.