అలోలము లాలోచన
లేవేవో నా లోపల
ప్రాలేయఛ్ఛాయలవలె
తారడగ కోరాడగ ..
– శ్రీశ్రీ
శ్రీశ్రీ ఏ సందర్భంలో ఈ వాక్యాలు వ్రాసారో తెలియదు. అసలిది శ్రీశ్రీదని కూడా తెలియదు గొల్లపూడి మారుతీరావు గారి కాలం లో చదివే వరకూ. చదువుతుంటే పసితనంలో తప్ప కలగని కారణరహితమైన హాయి కలిగింది. మనసులో ఈ చిత్రం మెదిలింది. బ్లాగ్ ఎలా మొదలెట్టాలా తెలియక కొట్టుకుంటుండగా ఇదే నా ఫస్ట్ పోస్ట్ గా వేసేస్తే ? అనిపించి పోస్ట్ చేసాను. బావుండకపోతే క్షమించేయ్యండి. ఏదో బ్లాగ్స్వాతంత్ర్యం ఉపయోగించుకున్నానని సరిపెట్టేసుకోండి.