ఇంగ్లిష్ న్యూ ఇయర్ డే కి ప్రపంచం ఎంత హడావిడి, హంగామా చేస్తున్నా నాకు మాత్రం మహాపేలవంగా, అసహజంగా అనిపిస్తుంది. I may be wrong but that’s how it feels. ఉగాదికి అలా వుండదు. ఉగాది పచ్చడిని దాని అంతరార్ధంతో సహా ఆస్వాదిస్తుంటే ప్రకృతికూడా వసంతాగమనంతో కోయిలస్వరంతో అదే అర్ధాన్ని ప్రతిధ్వనిస్తుంది. మనిషి ఒక్కడే కాక చరాచరాలన్నీ కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న భావన కలుగుతుంది. జనవరి ఫస్టు 365 రోజులు పూర్తయినందుకు టపాకాయలు పేల్చినట్టుంటుంది. So what? అనిపించేలా వుంటుంది. జనవరి 1, 2021 మాత్రం ఉగాదికి సరితూగే అర్ధంతో వచ్చింది. ఆ అర్ధాన్ని మానవులంతా బట్టీ పట్టి, యుగాలపాటు మర్చిపోకుండా వుండాలనేంత పట్టుదలతో వచ్చింది. అందుకేనేమో ఈ రోజు వచ్చిన థాట్స్ ఇలా వున్నాయి 👇 –

అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలతో
🌹🙏🌹